Karthika Deepam 05 September Today Episode : మోనిత వద్దన్న టిఫిన్ చేస్తానన్న దీప.. కోరి చిక్కులు తెచ్చుకుందా.!?

Karthika Deepam 05 September Today Episode : కార్తీక్ కి మోనిత నేను నిన్ను మీ సొంత ఊరు ముంబై తీసుకు వెళ్తున్నాను.. మీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది అని చెబుతుంది.. మీరు తెలుగు వాళ్ళు కార్తీక్.. అందుకే నీకు తెలుగు అంత బాగా వచ్చు అని మోనిత అంటుంది.. అవునా.. అని కార్తీక్ అంటాడు.. ఇంకో రెండు రోజులలో మనం ముంబై వెళ్తున్నాం అని చెబుతుంది.. అవునా మా సొంత ఊరు హైదరాబాద్ లాగా అనిపిస్తుంది అని కార్తీక్ అంటాడు.. నాకు మా వాళ్లంతా హైదరాబాద్ లోనే ఉన్నారు అని అనుకుంటున్నాను.. నిజంగా మాది ముంబై నైనా మోనిత అని అంటాడు.. అనుమానమా కార్తీక్ అని మోనిత అడుగుతుంది.. మరి ఎన్ని రోజుల నుంచి నాకు ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ అడుగుతాడు..రోజు చెబుతూనే ఉంటాను కార్తీక్.. నువ్వే మర్చిపోతావ్ అని మోనిత కవర్ చేసుకుంటుంది..

దీప దగ్గరికి మోనిత వస్తుంది.. దీప ను ఇంకాస్త టెన్షన్ పెట్టాలని.. నీకు భయం అంటే ఎంటో నేను నీకు చూపిస్తా.. అసలు నిన్ను కార్తీక్ కు దగ్గర అవ్వనివ్వను.. రేపు రాత్రికి మేము ముంబై వెళ్తున్నా.. ఈ లోపు కార్తీక్ కు నీ మీద అసహ్యం కలిగేలా చేయడమే నా పని.. అని మోనిత దీప దగ్గరకు వచ్చి మనసులో అనుకుంటుంది.. దీప తో కార్తీక్ కు వంట చేసి తీసుకు రమ్మని చెబుతుంది. అస్సలు ఉప్మా చేయద్దు అని మోనిత అంటుంది. అదే చేస్తాను అని దీప మనసులో అనుకుంటుంది.. మరోవైపు శౌర్య వారణాసిని తీసుకొని ఆటోలో వాళ్ళ అమ్మానాన్నల కోసం వెతుకుతూనే ఉంటుంది.. నిజంగా అమ్మానాన్నలు బ్రతికే ఉన్నారంట శౌర్య అని వారణాసి అడుగుతాడు.. కచ్చితంగా బ్రతికే ఉన్నారు అని సౌర్య అంటుంది.. అలాంటప్పుడు మన దగ్గరికి ఎందుకు రాలేదు అని వారణాసి ప్రశ్నిస్తాడు. అమ్మానాన్నల ఫోటోలు ఎలాగైనా సంపాదించి.. వాళ్ళ ఫోటోలు ఊరంతా పోస్టర్లు వెయ్యాలి అని సౌర్య అంటుంది.

Karthika Deepam 05 September Today Full Episode
Karthika Deepam 05 September Today Full Episode

ఖచ్చితంగా అమ్మానాన్నల ఫోటోలు సంపాదిస్తాను అని వారణాసి అంటాడు.. ముంబై అనగానే నా వాళ్లంతా అక్కడే ఉన్నారా అని కార్తీక్ అంటుండగా.. అప్పుడే దీప రాగానే.. వంటలక్క అని కార్తీక్ పిలుస్తాడు.. ఏం టిఫిన్ చేసావు అని అనగానే జీడిపప్పు ఉప్మా చేశాను అని దీప అంటుంది.. అవునా అంటూ కార్తీక్ ఆలోచనలో పడతాడు.. మోనిత తింటూ తింటూ వాంతులు చేసుకుంది.. ఏమైంది అని కార్తిక్ తనని బెడ్ పై పడుకో బెడతడు.. శివా పని వాడిని పిలవడానికి రకరకాల పేర్లతో పిలుస్తాడు.. నిజంగా దీనికి ఏమైనా అయ్యిందా.. కావాలని నాటాకం చేస్తుంది.. ఇప్పటి వరకు గుండ రాయిలా ఉంది కదా.. అయితే ఇది ఖచ్చితంగా నాటకమే అని అనుకుంటుంది దీప.. తరువాయి భాగంలో కార్తీక్ కు దీప అంటే అసహ్యం పుట్టేలా చేయాలని మోనిత ఆ వాంతులను అడ్డం పెట్టుకొని ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ చేత చెప్పిస్తుంది.. ఇదంతా దీప చేసిన వంటల వల్లనేనని క్రియేట్ చేస్తుంది.. దాంతో కార్తీక్ దీప పై గొడవ పడడానికి వెళ్తాడు..