Karthika Deepam 02 Nov Episode : మోనిత తో కార్తీక్ నిజం చెప్పేస్తానని ఛాలెంజ్ విసిరిన దీప..!

Karthika Deepam 02 Nov Episode :  మోనిత తో కార్తీక్ నిజం చెప్పేస్తానని ఛాలెంజ్ విసిరిన దీప..!సౌర్య ఇంద్రుడిని బాబాయ్ నాకు ఈ బట్టలు, నగలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా ఎలా చేశారు అని అడుగుతుంది.. మళ్ళీ ఏదైనా దొంగతనం చేశారా.. లేకపోతే ఏం చేస్తారు చెప్పండి అని సౌర్య నిలదీస్తుంది.. లేదంటే పిన్ని వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు చేశారా అని సౌర్య అడుగుతుంది.. నీకెందుకు జ్వాలమ్మ ఇలాంటి విషయాలు చిన్న పిల్లవి చిన్నపిల్లలాగా ఉండు అని ఇంద్రుడు అంటాడు.. మీరు పెద్ద వాళ్ళ లాగా ఉంటే నేను చిన్నపిల్లలాగానే ఉంటాను.. నేను రాకముందు మీరు దొంగతనాలు చేసేవారు.. నేను వచ్చాకే కదా మానేశారు.. ఇప్పుడు నా కోసం మళ్లీ మీరు ఏం చేశారో అని నా భయం అని జ్వాల అంటుంది..

Karthika Deepam 02 Nov today full Episode :
Karthika Deepam 02 Nov today full Episode :

దీపమ్మ సౌర్య దొరికిందా అని దుర్గ అడుగుతాడు.. లేదు దుర్గ సౌర్య అక్కడ ఉందనుకొని వెళ్ళాము.. కానీ అక్కడ సౌర్య లేదు వేరే ఎవరో పాప ఉంది అని దీప ఏడుస్తుంది.. ఏడవకు దీపం త్వరగా సౌర్య దొరుకుతుంది అని దుర్గా ధైర్యం చెబుతాడు.. సౌర్య దొరికితే నేను డాక్టర్ బాబుకి నిజం చెప్పి గతం గుర్తు చేద్దామని అనుకున్నాను.. కానీ నేను అనుకున్నది ఒక్కటి ఇప్పుడు జరిగింది ఇంకొకటి.. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దుర్గా అని దీప బాధపడుతుంది..

అవును వాల్తేరు వాణి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అని దీప అడుగుతుంది. ఆ వాల్తేరు వాణి నేను చంపాలని కుట్ర చేసింది దీపమ్మ.. ఇదంతా ఆ మోనిత చేయించింది అని దుర్గా చెబుతాడు.. అవునా నా వెనకమల ఆ మోనిత ఇంత కుట్ర చేసిందా? అయితే తన సంగతి ఇప్పుడే చూస్తాను అంటూ మోనిత వాళ్ళ ఇంటికి బయలుదేరింది.. దీప మోనిత రెండు చెంపలు వాయించి నా మీద కుట్ర చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంటుంది కార్తీక్ నా వాడు నాకు సొంతం అవ్వడం కోసం నేను ఏమైనా చేస్తాను అని మోనిత అంటుంది.. నువ్వు నా మీద ఎన్ని కొట్రలు చేసినా ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు నన్ను కాపాడతానే ఉన్నారు అది కార్తీక్ కి నాది ఉన్న భార్య భర్తల బంధం అని దీప అంటుంది.. ఈరోజు డాక్టర్ బాబు ఇంటికి రానివ్వు నీ సంగతి మొత్తం చెబుతాను.. ఈరోజుతో నువ్వు అయిపోయావు అని దీప మోనిత వార్నింగ్ ఇస్తుంది..

అలా ఏం చేయలేదు జ్వాలమ్మ.. మొన్న నీకు ఒక ఆవిడ వాటర్ బాటిల్ కొని ఇచ్చిందని చెప్పాం కదా.. ఇప్పుడు అలాగే వేరొక సార్ వచ్చి నీకు బట్టలు, నగలుకొని ఇచ్చారు.. ఆ డబ్బులు ఊరికినే ఏమి తీసుకోలేదు.. అప్పుగా తీసుకున్నాను అని ఇంద్రుడు చెబుతాడు.. ఇందాక నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను అని ఇంద్రుడు చెబుతాడు.. నన్ను కూడా పిలిస్తే నేను కూడా వచ్చి థాంక్యూ చెప్పేదానిని కదా అని జ్వాల అంటుంది.. మళ్లీ వస్తూ ఉంటారులే ఈసారి చెబుదువు గాని అని చంద్రమ్మ చెబుతుంది.. ఏంటి ఈరోజు మీరిద్దరూ ఏదో కంగారుగా ఉన్నారు అని జ్వాలా వాళ్ళ బాబాయ్, పిన్ని వాళ్ళని అడుగుతుంది.. అలాంటిది ఏమీ లేదు అని ఇంద్రుడు కవర్ చేసుకుంటాడు..