Karthika Deepam 01 Nov Episode : దీపని బురిడి కొట్టించిన చంద్రమ్మ.. నిజం చెప్పమని ఇంద్రుడుని నిలదీసిన కార్తీక్.. మోనిత ను కొట్టిన దీప.!

Karthika Deepam 01 Nov Episode : దీప, కార్తీక్ ను తీసుకుని ఇంద్రుడు తన ఇంటికి వస్తాడు.. చంద్రమ్మ వీళ్ళు మన జ్వాలను చూడటానికి వచ్చారు.. జ్వాలను చూపించు అని ఇంద్రుడు అంటాడు.. ఈ అమ్మ నాకెందుకు తెలియదు.. ఆ రోజు బస్సులో జ్వాలకి వాటర్ బాటిల్ ఇచ్చింది ఈమె.. వాళ్ళ అమ్మ ఇచ్చింది అని కూడా చెప్పమని చెప్పింది అని చంద్రమ్మ అంటుంది.. మొన్న ఫోన్లో జ్వాల సరుకులు లిస్టు కూడా చెప్పింది ఈమేకే అంటాడు ఇంద్రుడు.. సరే ఉండండి జ్వాలను తీసుకు వస్తాను అని చంద్రమ్మ లోపలికి వెళుతుంది.. దీప, కార్తీక్ ఇద్దరు సౌర్య వస్తుందేమోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..

karthika-deepam-01-nov-today-full-episode
karthika-deepam-01-nov-today-full-episode

కానీ చంద్రమ్మ ఎవ్వరూ ఊహించని విధంగా వేరే పాపను తీసుకుని వచ్చి ఈమె మా జ్వాలా అని చెబుతుంది.. దీప షాక్ అవుతుంది.. నిజానికి ఇంద్రుడు కూడా షాక్ అవుతాడు.. వాళ్ళ జ్వాలను తీసుకురాకుండా ఎవరో పిల్లను తీసుకువచ్చి జ్వాల అని చెబుతుంది ఏంటి అని అనుకుంటాడు.. మాకు ఒక బిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోయింది.. ఆ తర్వాత జ్వాలా నరసింహస్వామికి మొక్కుకుంటే మా జ్వాల పుట్టిందని చంద్రమ్మ చెబుతుంది.. అక్షంతలు వేసి ఆశీర్వదించమని దీపకు అక్షింతలు ఇస్తుంది.. సరే మేము వెళ్తామని దీప తన బాధను దిగ మింగు కోలేక అంటుంది.. అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నారు భోంచేసి వెళ్ళండి అని చంద్రమ్మ అంటుంది..

దీప ఏడుస్తూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది.. చంద్రమ్మ ఏంటి ఇలా చేశావు.. జ్వాలనీ వాళ్ళ అమ్మానాన్నలకి ఇచ్చేద్దాం అని అనుకున్నాం కదా.. ఇప్పుడు వాళ్ళ అమ్మానాన్న వస్తే ఎందుకు ఇవ్వలేదు అని ఇంద్రుడు అడుగుతాడు.. నిన్నటి నుంచి వాళ్ళు వస్తారని నువ్వు మనిషి మనిషి లాగా లేవు అలాంటిది.. జ్వాలను ఇప్పుడు ఇచ్చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండాలని నేను ఎలా అనుకుంటాను.. అయినా వాళ్ళు బాధపడతారు కదా చంద్రమ్మ.. నాలుగు నెలలు పెంచినందుకే మనకు ఇంత ప్రేమగా ఉంటే చిన్నప్పుడు నుంచి జ్వాలను పెంచుకున్న వాళ్ళకి ఇంకా ఎంత బాధగా ఉంటుంది అని ఇంద్రుడు అంటాడు.. వాళ్లు ఎంత బాధ పడతారు అనేది కాదు.. నువ్వు ఏమైపోతావో అని నాకు భయమేసింది .. వాళ్ల బాధ కన్నా నా మాంగల్య బంధం ఎక్కువ అని అనిపించింది.. అందుకే జ్వాల ను ఇవ్వాలని అనుకోలేదు అని చంద్రమ్మ ఏడుస్తుంది..

డాక్టర్ బాబు అక్కడ మన శౌర్య ఉందని నాకు నిజంగా అనిపిస్తుంది.. కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది అని దీప అంది.. లేదు దీప నువ్వు అక్కడ సౌర్య ఉంటుంది అని అనుకుంటున్నావు కదా.. అందుకే నీకు అలా అనిపిస్తుంది అని కార్తీక్ అంటాడు.. మీరు సౌర్యను చూశారా అని దీప అడుగుతుంది.. కార్తీక్ తన సమాధానం చెప్పేలోపే నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో మోనిత తను చేసిన కుట్రలు ఎవరికీ తెలియకూడదు అని తనలో తాను అనుకుంటా ఉండగా.. దీప వెళ్లి మోనిత రెండు చెంపలు వాయిస్తుంది.. మరోవైపు కార్తీక్ ఇంద్రుడు వాళ్ళ ఇంటికి వెళ్లి నాకు కొన్ని నిజాలు చెప్పమని అడుగుతాడు.. వారణాసి ఫోటో చూపించి ఇతను నీకు తెలుసా తెలీదా అని అడుగుతాడు.. మరోవైపు శౌర్య కార్తీక్ ను చూసినట్టుగా చూపిస్తారు.. ఇక కథ రేపు ఏ వైపుగా మలుపు తిప్పుతారో చూడాలి..