karthikadeepam 23 sep episode : కార్తీక్ వాళ్ళ అమ్మనాన్నలను గుర్తుపట్టేశాడు..! దీపను చూసేసిన ఆనందరావు..!!

karthikadeepam 23 sep episode :  మోనిత ఇచ్చిన షాక్ కు దీపకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది.. ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ తన అత్తమామలను తలుచుకుని బాధపడుతుంది.. వెంటనే నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది.. కానీ నేను ఏం చేయకుండా ఆ మోనిత చేసింది.. ఇప్పుడు నాకు చావు తప్ప మరో గతి లేదు అని దీప బాధపడుతుంది.. అప్పుడే దీప వాళ్ళ అన్నయ్య వచ్చి.. ఏమైంది దీప ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని అడుగుతాడు.. దీప తన అన్నయ్య కు మోనిత చేసిన పని.. అక్కడ జరిగిందంతా వాళ్ళ అన్నయ్యకు వివరంగా చెబుతుంది.. ఇలాంటి అప్పుడు నీకు ఒకే ఒక్క దారి ఉంది దీప.. నువ్వు కార్తీక్ ను ఎలాగైనా హాస్పిటల్ కి తీసుకురా.. తనకి గతం గుర్తుచేసే ప్రయత్నం నేను చేస్తాను.. హాస్పటల్ కు తీసుకువస్తే డాక్టర్స్ కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పిదం అని వాళ్ళ అన్నయ్య సలహా ఇస్తాడు.. అర్జెంటుగా తనని తీసుకురమ్మని చెబుతాడు.. సరే అని దీప అంటుంది..

వాళ్ల అన్నయ్య చెప్పిన మాటలు విన్న దీప పరుగు పరుగున మోనిత వాళ్ళ ఇంటికి వెళుతుంది.. అప్పటికే మోనిత ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.. సౌందర్య ఆనంద్ రావు మోనిత దగ్గర కార్తీక్ ఉన్నాడని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వస్తారు.. మోనిత కార్తీక్ ను ఇంట్లో కనిపించకుండా ఉండాలని.. శివని పిలిచి కార్తీక్ ను బంకెట్ లోకి తీసుకోవాలని చెబుతుంది.. మోనిత చెబుతున్న మాటలు సౌందర్యకు నమ్మసక్యంగా ఉండవు.. ఇక్కడే బోటిక్ ఎందుకు పెట్టుకున్నావు అని సౌందర్య సూటిగా ప్రశ్నిస్తుంది.. నా కార్తీక్ చివరి శ్వాస విడిచిన నేల ఇది.. అందుకే తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఇక్కడే ఉండిపోయాను అని మోనిత అంటుంది..

karthikadeepam Karthik reminded them of their parents..! Ananda Rao saw Deepa
karthikadeepam Karthik reminded them of their parents..! Ananda Rao saw Deepa

శివా బ్రతిమిలాడి కార్తీక్ ను అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు.. అప్పటికే కార్తీక్ సౌందర్య ఆనందరావులను చూసేస్తాడు.. శివ వాళ్ళని ఎక్కడో చూశానయ్యా అని ఆలోచనలో పడతాడు.. అందులో కార్తీక్ గతంలో వాళ్ళు చూసిన్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి ఉండు వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను అని కార్తీక్ అంటాడు.. కానీ శివ అప్పటికే అక్కడి నుంచి కార్తీక్ ని తీసుకొని వెళ్ళిపోతాడు.. మోనిత సౌందర్యకు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నం చేస్తుంది..

మోనిత నువ్వు ఇందాక ఫోన్లో కార్తీక్ అని అన్నావు అంటే.. కార్తీక్ నీ దగ్గరే ఉన్నాడు అని సౌందర్య అంటుంది.. అవును కార్తీక్ నా దగ్గరే ఉన్నాడు.. చూపిస్తాను రండి అని మోనిత పైకి తీసుకు వెళ్లి ఆనందును చూపిస్తుంది.. కార్తీక్ చనిపోయిన తర్వాత ఆనందునే కార్తీక్ అని పిలుచుకుంటున్నాను.. ఇందాక మీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆనంద్ మంచం మీద నుంచి కింద పడిపోయాడు .. కార్తీక్ అని గట్టిగా అరిచాను అని.. తనని లోనే కార్తీక్ ని చూసుకుంటున్నాను అని సౌందర్యకు మస్కా కొడుతుంది మోనిత.. కానీ నీ మాటలు నాకు నమ్మశక్యంగా లేవు అని సౌందర్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది .. అంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఏవండీ ఏవండీ అని వాళ్ళ అమ్మానాన్నలను పిలుస్తాడు.. మోనిత వాళ్ళని పిలవనివ్వకుండా అడ్డుపడుతుంది.. ఎవరు మోనిత వాళ్ళు.. వాళ్ళని మేము ఎక్కడో చూశాను అని కార్తీక్ అంటాడు.. నాకు తెలిసిన కస్టమర్స్ అని మోనిత కవర్ చేసుకుంటుంది..