Jabardasth Pavitra : జబర్దస్త్ కామెడీ యన్ పవిత్ర మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో కామెడీ పంచెస్ వేస్తూ నవ్విస్తూ వల్గారిటికి దూరంగా ఉండే పవిత్ర అంటే జనాలకు బాగా ఇష్టం.. పద్ధతిగా ఉంటుంది. చక్కగా మాట్లాడుతుంది. మంచిగా స్కిట్స్ లో నవ్విస్తుంది అంటూ జనాలు పవిత్రను మెచ్చుకుంటున్నారు.. ఇటీవల పవిత్ర యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే..

తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మా పెళ్లి షాపింగ్ అంటూ పెట్టిన వీడియో నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. పవిత్ర జబర్దస్త్ లో స్కిట్స్ వేసే తేజను ప్రేమిస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్ గా పవిత్ర తన యూట్యూబ్ ఛానల్ లో మా పెళ్లి షాపింగ్ అంటూ పెట్టడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇప్పటివరకు వీళ్ళ మధ్య ప్రేమ ఉన్నట్లు ఎప్పుడూ బయటపడలేదు. వీళ్ళ మధ్య ప్రేమ ఉందా అన్న అనుమానం కూడా రాకుండా కవర్ చేసుకున్నారు. కానీ సడన్ గా ఎలా పెళ్లి షాపింగ్ అంటూ వీడియో పెట్టేసరికి వీరిద్దరిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
జబర్దస్త్ లో పవిత్ర తో పాటు తేజ కూడా కలిసి స్కిట్స్ చేసేవాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఇది మొత్తం టిఆర్పి కోసమే కానీ.. నిజమైన ప్రేమ కాదు అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఏది ఏమైనా సరే పవిత్ర లాంటి కమెడియన్ కూడా పాపులారిటీ కోసం ఇలా పెళ్లి అంటూ ఫేక్ వీడియోలను చేయటం కరెక్ట్ కాదంటున్నారు వీక్షకులు. చూడాలి మరి ఇదంతా టిఆర్పి రేటింగ్ కోసమా.. లేదంటే వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా అనేది త్వరలోనే తేలిపోతుంది.