Intinti Gruhalakshmi : తులసికి సామ్రాట్ విశ్వరూపం చుపించనున్నాడా.!?

Intinti Gruhalakshmi : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ విభిన్న కథనాంశంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.. నిన్నటితో ఈ సీరియల్ 728 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. ఈ వారం ఈ సీరియల్ లో జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..! తులసి మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఎంతో తపన పడింది.. నందు తో విడాకులు తీసుకున్నా తరువాత తులసి తన కళ్ళ పై తను నిలబడాలని నిర్ణయించుకుంది.. తులసి సంగీతం స్కూల్ స్టార్ట్ చేయడానికి భూమి పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి.. అభి వాళ్ళ అమ్మ మీద ఉన్న కోపంతో రచ్చ రచ్చ చేస్తాడు.. నందు సామ్రాట్ ముందు నేనే తులసి మాజీ భర్త నని ఒప్పుకుంటాడు.. దాంతో సామ్రాట్ తులసి మధ్య అనుమానపు బీజాలు పడ్డాయి.. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి మ్యూజిక్ స్కూల్ ఫంక్షన్ గ్రాండ్ గా చేసి ఈ పాటికి ఒక బిల్డింగ్ కూడా పూర్తి అయ్యేది..

నందు నీ తులసి నువ్వు ఆరోజు సామ్రాట్ గారితో నువ్వు నా మాజీ భర్త అన్న విషయం చెప్పద్దు అని అడిగావు కదా.. ఇప్పుడు ఆ విషయం సామ్రాట్ తో చెబితే సమస్య ఇంతటితో సమసి పోతాయి అని తులసి అడుగుతుంది.. నేను ఆల్రెడీ మ్యూజిక్స్ స్కూల్ డీల్ ను వెనక్కి తీసుకుంటున్నానని సామ్రాట్ గారితో చెప్పేసాను.. నన్ను నమ్ముకున్న మనుషుల దగ్గర నేను నా వ్యక్తిత్వం కోల్పోకూడదు..అందుకే ఈ విషయం చెబుతున్నాను అని తులసి అంటుంది.. అలా అయితే ఒక కండిషన్ మీద నేను ఈ విషయం సామ్రాట్ గారితో చెప్పడానికి ఒప్పుకుంటున్నాను.. నువ్వు హనీ ని కాపాడిన రోజు నేను తనని యాక్సిడెంట్ చేశానన్న సంగతి చెప్పలేదు కదా.. ఈరోజు అది కూడా సామ్రాట్ గారితో చెప్పేస్తాను.. ఇప్పుడు ఎలాగో నాకు శిక్ష పడుతుంది.. ఇప్పుడు నాకు రెండు శిక్షలు పడతాయి.. చనిపోతానని తెలిసినప్పుడు ఎన్ని శిక్షలు పడితే ఏమైంది.. ఇది కూడా చెబుతాను అని తులసిని ఇండైరెక్టుగా బెదిరిస్తాడు నందు.. చి చి మీరు మనుషులేనా మీకు మంచి చేద్దామని ఆరోజు ఆలోచించినందుకు..

Intinti Gruhalakshmi Will Is Samrat Vishwarupa to Tulsi
Intinti Gruhalakshmi Will Is Samrat Vishwarupa to Tulsi

ఇప్పుడు నాకు చెడు చేయాలని ఆలోచిస్తున్నారా..  మీరు ఇద్దరు అస్సలు బాగుపడరు ఇక్కడ నేను మౌనంగా ఉన్నా పైన ఉన్న ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోరు . మీరు ఎంతకు ఎంత అనుభవిస్తారు.. అని తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. నందు మొత్తానికి లాస్య లాగా తయారవుతాడు.. సామ్రాట్ ఇప్పటికే తులసి మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ లో డ్రాప్ అయిందన్న కోపంగా ఉంటే.. నందు, లాస్య సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి తులసి మీద లేనిపోనివన్నీ ఎక్కేసి చెబుతారు. సామ్రాట్ ఇంకాస్త కోపంతో తులసి నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్.. పట్టాలెక్కకుండానే డ్రాప్ అయిపోయింది.. అంటే నా పరువు పోయినట్టే కదా అని సామ్రాట్ అంటాడు.. ఇది మీకు ఒక విధంగా ఓటమిని లాస్య సామ్రాట్ ను రెచ్చగొడుతుంది.. నేను దీనిని తట్టుకోలేకపోతున్నాను నందు అని సామ్రాట్ ఉక్రోషంగా అంటాడు.. మీరు తగ్గద్దు సార్ అని లాస్య రెచ్చగొడుతుంది.. తులసి మీద ఉన్న కోపంన్ని వాళ్ళ ప్రాజెక్ట్ ఓకే చేసుకోవాలని లాస్య ప్లాన్ అది వార్కుట్ అవుతుందా లేదా అనేది చూడాలి..

Advertisement