Intinti Gruhalakshmi Serial : శృతిని ప్రేమ్ తో ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది. లేదు ఆంటీ చిన్న అపార్థం.. జాగ్రత్త నీ జీవితం నాకుల చేసుకోకు భయంతో చెబుతున్నాను అంటుంది.. అంతలో అభి ఇంటికి వస్తాడు.. ఎక్కడికి వెళ్లవు ఇప్పటి వరకు అని అడుగుతుంది.. ఆపరేషన్ చేసి అలసి పోయాను నా పై డాక్టర్స్ మెచ్చుకున్నారు అని చెబుతాడు. ఇంటికి మాధవి వచ్చిందని చెప్పగా.. అభి కంగారుగా ఎందుకు వచ్చిందని అడుగుతాడు. నన్ను చూసి చాలా కాలం అయిందని చెబుతుంది. ఎందుకు మాధవి వచ్చిందని చెప్పగానే అంతగా ఆలోచిస్తున్నావు ఏమైంది అంటూ ఇండైరెక్ట్ గా లాక్ చేస్తుంది.. దాంతో అభి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..ఇక భాగ్య వచ్చి లాస్య పలకరిస్తుంది. కానీ లాస్య పట్టించుకోదు.. ఇక మాట మాట పెరిగి లాస్య బాధ చెబుతుంది.
భాగ్య కుటుంబాన్ని విడగొట్టు అప్పుడు ఏదైనా నీ సొంతం అవుతుంది. ఈ రాజ్యానికి నువ్వు రాణీ వి కావచ్చు. క్షణాల్లో నువ్వు అనుకున్నది జరుగుతుందని ఓ పనికిమాలిన ఆలోచన ఇస్తుంది. ఆ మాటల్లో నిజం ఉందనుకుని లాస్య అదే ప్లాన్ లో ఉంటుంది. ఆ ప్లాన్ ను అంకిత పై ప్రయోగించగా అది కాస్త బెడిసి కొడుతుంది. ఇక అంకిత ను కన్విన్స్ చేయాలేక లాస్య ఆఫీస్ కి టైం అయింది అంటూ అక్కడినుంచి జంప్. తులసి ఆఫీస్ కి వెళ్తుండగా అంకిత అభి వచ్చి మేము కూడా ఆఫీస్ కి వెళ్తున్నాం అని చెబుతుంది. తులసి అభిని కోపంగా చూస్తుంది. అది గమనించిన అభి అక్కడనుంచి తప్పించుకోవడానికి అంకితని వెళ్దాం పదా అంటడు. తులసి అభి రాత్రి నువ్వు ఆపరేషన్ చేసిన సంగతి మీ హాస్పిటల్ లో తెలీదా.. వాళ్ళు నాకు కాల్ చేశారు నువ్వు రాలేదని. నేను ఆపరేషన్ చేశాక వేరే హాస్పిటల్ కి ఇంటర్వ్యు కి వెళ్ళాను.

అంతలో వాళ్ళు నీకు కాల్ చేసినట్లు ఉంటారు అని కవర్ చేస్తాడు.. ఇక తులసి ఒక్కేసరి ఎదగాలి అనుకోవడం తప్పు అని చెబుతుండగా.. అంతలో నందు వచ్చి బెటర్మెంట్ కోసం వేరే ఇంటర్వ్యూ కి వెళ్లడం తప్పు కాదు కదా తులసి అంటాడు.. ఇక తులసి అందరి ముందు నిజం చెప్పడం కరెక్ట్ కాదని.. అందరి ముందు తన కొడుకు చిన్నతనం కాకూడదని మనసులో అనుకుని సైలెంట్ గా ఉండిపోయింది.. ఇక లాస్య నందు ప్రశ్నలకు సమాధానం చెప్పమని నిలదీస్తుంది.. నేనేం మాట్లాడినా అనుమానం అని ఇన్సల్ట్ చేస్తవుగా మరి నీవి అనుమానాలు కాదా అని లాస్య వరుస ప్రశ్నలు వేస్తుంటే తులసి మౌనంగా ఉంటుందా..!? నిదానంగా ఈ విషయాన్ని నందుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుందా.. ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.