Intinti Gruhalakshmi Serial : అంకిత ఉద్యోగం విషయంలో లో అమ్మ గాయత్రి తను చెప్పిన ఉద్యోగానికి కాకుండా మరో చిన్న ప్రైవేట్ హాస్పిటల్ లో పని చేస్తానన్న అంకిత అవమానిస్తూ తనతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ కూడా అవమానిస్తుంటే.. నందు ఎంటర్ అవ్వడం తనని నాలుగు మాటలు అంటుంది..ఇక తులసి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో అంకిత ఇంటర్వ్యూ కి వెళ్లి జాబ్ తెచ్చుకుంటుంది.. అందుకు తులసి అంకితను మెచ్చుకుంటూ ఓ గిఫ్ట్ ఇస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో స్కేతస్ స్కోప్ ఉంటుంది. నా కల నెరవేర్చారు ఆంటీ.. ఏంటమ్మా నీ కల.. నా మొదటి జీతంతో ఈ గిఫ్ట్ కొని మీ చేతులతో నా మెడలో వేయించుకోవాలి అనుకున్నాను. అయినా నేను ఇంటర్వ్యూకే కదా వెళ్ళింది. నామీద ఎందుకంత మీకు నమ్మకం ఆంటీ అంటుంది ఆడపిల్ల తన కాళ్ళ మీద తను బ్రతకాలమ్మ.. నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు. అభి విషయం నువ్వు మరిచిపో అని చెబుతుంది.

అంకిత తో తులసి మాట్లాడుతున్న మాటలు అన్ని ఓ పక్క నుంచి నందు గమనిస్తూ ఉంటాడు. తులసి మన పిల్లలు అదే నీ పిల్లలు గొప్ప తల్లి కడుపున పుట్టారు. తల్లి గా నువ్వు ఓడిపోయామని ఆరోజు నేను ఎలా అనగలిగాను నాకే తెలీదు తులసి.. ఈ మాట అన్నందుకు నామీద నాకే అసహ్యంగా ఉంది. ఎదిగిన కొడుకులు తల్లి మాట వినడం చాలా కష్టం. వినేలా పెంచడం నీ గొప్పతనం.. ఈ తండ్రి నీడ వాళ్ళ మీద పడలేదు.. ఒకే విధంగా నాకు సంతోషంగానే ఉంది. ఆ రోజు మీరు నిందలు వేసినప్పుడు నేను ఎలా ఉన్నాను. ఈరోజు నన్ను పొగుడుతున్నప్పుడు కూడా అలాగే ఉన్నాను.. నా కాళ్లు భూమి మీదే ఉన్నాయి. నన్ను నన్నుగా బతకనివ్వండి చాలు అని తులసి అంటుండగా.. అవకాశం దొరికితే చాలు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అని లాస్య అంటూ వస్తుంది. మా పెళ్లయిన తర్వాత నందు నాకంటే నీతో ఎక్కువగానే ముచ్చట్లు పెడుతున్నాడు అంతగా..

ఏ మంత్రం వేసావే ఏంటి.. నీతో మాట్లాడే అప్పుడే ఆ పెదాల మీద చిరునవ్వు.. కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది.. ఏ మంత్రం వేసావో నాకు చెప్పచ్చు కదా.. ఇంకా తనివి తీరలేదా నందు ఇక్కడి నుంచి వెళ్దామా అనగానే నందు అక్కడినుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు..ప్రేమ్ కోసం శృతి ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రేమ్ మాట్లాడుకోకుండా ఇంట్లోకి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు అని ఇంట్లోకి వెళ్ళిపోతుండగా.. ప్రేమ్ ప్రేమ్ అంటూ శృతి ఆనడం తులసి ఉంటుంది. వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని మనసులో అనుకుంటుంది. అంతలో ప్రేమ్ మూడు రోజులు ఊర్లో ఉండనని కాన్సెప్ట్ కి వెళ్తున్నా అని చెబుతాడు. ప్రేమ్ కి శృతి కి మధ్య జరిగిన గొడవ ఏంటో తులసి తెలుసుకుని సరి చేస్తుందో లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.