Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదేనా.!?

Intinti Gruhalakshmi : స్టార్ మా లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ విభిన్న కథశంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లి వీక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 12.04 రేటింగ్ సొంతం చేసుకుని థర్డ్ ప్లెస్ లో నిలిచింది.. గత వారం ఈ సీరియల్ రెండో స్థానంలో నిలవగా వారం మూడో స్థానానికి పడిపోయింది.. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..! తులసి కలలు కన్నా మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ సామ్రాట్ దయతో పట్టాలెక్కుతుంది అని అందరూ అనుకున్నారు.. కానీ అభి మాటలతో ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోతుంది..

నందు తులసి మాజీ భర్త అన్న సంగతి తులసినే కావాలని చెప్పలేదు అన్నా.. అర్థంతో తులసి పై సామ్రాట్ కోపం పెంచుకుంటాడు.. దానికి తోడు లాస్య సామ్రాట్ ను తన మాటలతో రెచ్చగొడుతుంది.. ఇన్ని రోజుల నుంచి మీరు బిజినెస్ పార్టనర్స్ కదా.. తను మీతో ఈ విషయం చెప్పకుండా ఉంటుందని మేము అనుకోలేదు.. నందు కూడా ఈ విషయం మీతో చెప్పమని చెప్పాడు తులసి సమయం చూసుకొని చెబుతానని చెప్పింది.. ఇన్ని రోజుల నుంచి తులసి ఈ విషయం మీకు చెప్పలేదని మేము ఊహించలేదు.. తను అంతే సార్ ముందు ఒకలాగా వెనుక ఒకలాగా ఉంటుంది.. తన తీరే అంత అందుకే నందు తులసికి దూరంగా ఉంటాడు అని తులసిపై లేనిపోని మాటలు ఎక్కేసి సామ్రాట్ కి నూరిపోస్తుంది.. తులసి పై ఎన్నడూ లేనంత కోపంతో సామ్రాట్ రగిలిపోతాడు.

Intinti Gruhalakshmi serial next week The highlight twist 
Intinti Gruhalakshmi serial next week The highlight twist

సామ్రాట్ లాస్య చెప్పిన మాటల్లో నిజమైన అనుకునే తనపై ఇంకా ఆశ్చర్యం పెంచుకుంటాడు అని తులసి లాంటి వాళ్ళింటికి వెళ్ళాలని పట్టుబడుతుంది.. గణపతి పూజ వాళ్ళ ఇంట్లోనే చేసుకుందామని అనేసరికి హనీ కోరిక మేరకు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసి వాళ్ళ ఇంటికి వస్తారు.. తులసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ దింపుతారు.. సామ్రాట్ మాత్రం కారులోని కూర్చుని రాకూడదు అని అనుకుంటాడు.. సామ్రాట్ లోపలికి రాకుండా కారులోనే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని హనీతో చెప్పి అక్కడే కూర్చుని ఉంటాడు.. కాసేపటి తర్వాత నందు లాస్య అక్కడికి వస్తారు.. లాస్య నందుకు ఇంకొక మాట గుర్తు పెట్టుకో.. లోపల ఎవ్వరు ఎందుకు మాట్లాడినా ఎంతగా రెచ్చగొట్టినా.. మాజీ బర్త అనే నిజం సామ్రాట్ గారికి తెలియకుండా దాచామని.. నువ్వే తులసిని రిక్వెస్ట్ చేశావనే నిజం పొరపాటున కూడా బయట పెట్టకు అని లాస్య అంటున్న మాటలు.. కారులో కూర్చున్న సామ్రాట్ వింటాడు.. సామ్రాట్ షాక్ అవుతూ అంటే నందు రిక్వెస్ట్ చేశారని తులసి నాతో నిజం చెప్పలేదు అన్నమాట..

ఓ మై గాడ్ నేను అనవసరంగా తులసిని అపార్థం చేసుకున్నాను అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు.. నిజం తెలుసుకున్న సామ్రాట్ ఏం చేయాలా అని అనుకుంటాడు.. ఈ నిజం తెలుసుకోకుండా అనవసరంగా తులసిని బాధపెట్టని అని మనసులో అనుకుంటాడు.. అయినా కానీ సామ్రాట్ ఇంట్లో వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తులసి సామ్రాట్ దగ్గరకు వస్తుంది.. ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా నిలబడిపోయారు.. ఏంటి అని సామ్రాట్ ని తులసి అడుగుతుంది.. దయచేసి మీరు లోపలికి రండి అని తెలిసి రిక్వెస్టింగా సామ్రాట్ ని అడుగుతుంది.. సామ్రాట్ గారు మీరు మా ఇంటికి రావడం నిజంగా ఆ వినాయకుడే మా ఇంటికి వచ్చినట్టు ఉంది అని సామ్రాట్ ని చూస్తూ పరంధామయ్య అంటారు.. మా ఇంటి మీద పడి గొడవ చేసినందుకు.. మా మమ్మీని అరిచినందుకు ముందు మా మమ్మీ కి సారీ చెప్పి పూజలు కూర్చోవాలి అని అభి అంటాడు.. సామ్రాట్ సారీ చెప్పి ఇకమీదట ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండాలని పూజలో కూర్చుంటాడు .. లాస్య , నందు వాళ్లకి టార్చర్ అంటే ఏంటో చూపించాలని సామ్రాట్ అనుకుంటాడు..

Advertisement