Intinti Gruhalakshmi 30 August Today Episode : సామ్రాట్ ముందు తులసి మాజీ భర్త నేనేనని ఒప్పుకున్న నందు..! తులసి ఇష్టపడుతున్నాను..!

Intinti Gruhalakshmi 30 August Today Episode : సామ్రాట్, తులసి ఇద్దరూ మీడియా వారితో మాట్లాడతారు.. తులసిని మీ ముందుకు తీసుకురావడం వరకే నా బాధ్యత.. తులసిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. తనని ఏం అడగాలనుకుంటున్నారో అది మీ ఇష్టం.. తులసిని మీకు అప్పగిస్తున్నాను అంటూ సామ్రాట్ అక్కడి నుంచి లేచి వస్తాడు.. అప్పుడే శృతి సామ్రాట్ ని ఓ ప్రశ్న అడుగుతుంది.. తులసి ఆంటీ అంటే మీకు ఇష్టమా అని శృతి అడుగుతుంది.. తులసి అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.. కానీ అది మీరు అనుకునే లాంటి దురుద్దేశంతో అయితే కాదు.. అని సామ్రాట్ తన మనసులో ఉన్న మాటని శృతి ముందు కుండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు..!! నేనంటే పరాయి వాడిని బయటవాడిని.. నన్ను ఈ విధంగా అర్థం చేసుకోవడంలో తప్పులేదు కానీ తులసి గురించి మీ అందరికీ తెలుసు కదా అయినా తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారు అని శృతిని అడుగుతాడు సామ్రాట్..

దయచేసి తులసిని అనుమానించకండి అని సామ్రాట్ అంటాడు.. అలాంటి పరిస్థితి మాకు ఎప్పటికీ రాదు అని శృతి అంటుంది.. తులసి మీడియా ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా అసలు ఆశయాలు మీకు చెప్పము దయచేసి వాటిని జనాల్లోకి తీసుకెళ్లండి.. మీ వంతు సహాయం చేయడం.. తులసి వనం కి మీరు సపోర్ట్ చేయండి అని చెబుతుంది.. తులసి, సామ్రాట్ ఇద్దరు వేలి ముద్రలు వేసిన కుంకుమ పేపర్ వెళ్లి నందు కి అంటుకుంటుంది.. అందరూ అది ఫేట్ అని అంతా అనుకుంటారు.. ఇంతటితో పూజా క్రతువు ముగిసింది.. ఈరోజు నుంచి మీరిద్దరూ వ్యాపార భాగస్వామ్యం వహిస్తున్నారు.. మీరిద్దరూ లాభాలలోనే కాదు నష్టాలు వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడాలి.. ఒకరు అలిసిపోతే ఇంకొకరు పగ్గాలు పట్టుకుని నడిపే లాగా ఉండాలి.. లాభం, చెడు, కష్టం, సుఖం ఏది ఎదురైనా మీ భాగస్వామ్యం ఇలాగే కొనసాగాలి..

Intinti Gruhalakshmi Serial 30 August 2022 Today Full Episode
Intinti Gruhalakshmi Serial 30 August 2022 Today Full Episode

తట్టుకుని నిలబడే లాగా ఉండాలి.. ఒక విధంగా చెప్పాలంటే.. వ్యాపార భాగస్వామ్యం భార్యాభర్తల బంధం లాంటిది అని ఆ పంతులు అనగానే.. అభి క్లప్స్ కొడుతూ అక్కడికి వస్తాడు.. అందరూ అభి వైపు షాక్ అవుతూ చూస్తారు.. వా.. ఏం చెప్పారు పంతులుగారు.. వ్యాపార భాగస్వామ్యం అంటే భార్యాభర్తల బంధం లాంటిదా.. ఇది ఏ వేదం లో ఉందో చెప్పండి అని అంటాడు అభి.. సామ్రాట్ గారు మా మామ్ కి దగ్గర ఇవ్వాలని ఇదంతా చేస్తున్నారు అని అభి అంటాడు మీ నాన్న ఇదంతా నిన్ను రెచ్చగొట్టించి మాట్లాడుతున్నారు అని తులసి వాళ్ళ తమ్ముడు అంటాడు మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడరా అని నందు అంటాడు.. మా అక్క భర్తగా ఉన్నప్పుడు నీకు మర్యాద ఇచ్చాను.. విడాకులు దాకా తీసుకువచ్చింది నేను కాదు మీ అక్క అని నందు అంటాడు.. తులసి గారి మాజీ భర్త వా నువ్వు అని సామ్రాట్ షాక్ అవుతు అడుగుతాడు..

Advertisement