Intinti Gruhalakshmi 26 May Today Episode : తులసి ఆంటీ తప్పు చేసిందన్న అంకిత.. షాక్ లో దివ్య, పరంధామయ్య..!

Intinti Gruhalakshmi 26 May Today Episode : తులసి అభి ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. మరి ఎప్పుడో అభిని మా దగ్గరకు పంపించచ్చు కదా.. మామ్ వంకర మాట్లాడం తప్ప సరిగ్గా మాట్లాడటం రాదా అని అడుగుతుంది. అమ్మా తులసి ఫ్యాక్టరీ బాధ్యతల నుంచి తప్పుకున్న అట కదా ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అమ్మా అని అడిగితే వాళ్ళ డాడీ అడుగుతాడు.. నువ్వేమి ఇబ్బంది పడకు వదినా నువ్వేం చేస్తున్నావో నేను చెబుతానులే.. దారినపోయే నలుగురు పిల్లల్ని పోగేసుకుని పాతిక కి పరకకు తనకు వచ్చిన సంగీతాన్ని నేర్పిస్తుంది.. ఏదో ఒకటి కనీసం కాఫీ నీళ్లు కింద డబ్బు వస్తుంది కదా అంటూ తులసిని ఇండైరక్ట్ గా అనరాని మాటలు అంటుంది..ఇక ఆపుతావా మమ్మీ ఆంటీ ని చులకనగా చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ఆంటీ త్వరలోనే ఒక గొప్ప ఒక సంగీత టీచర్ అవుతుంది. దాంతో అభి పక్కకు వెళతాడు. తులసి అభిని చూస్తూ మీ ఆంటీ అన్న ప్రతి మాటకు నా దగ్గర సమాధానం ఉంది. నా బిడ్డ సంతోషం చూడడం కోసం వచ్చాను.

తులసి అభిని దగ్గర తీసుకొని నువ్వు చాలా అదృష్టవంతుడివి రా అమ్మను మరిపించే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారుఅమ్మను దూరం చేసే వాళ్ళు నీ దగ్గర ఉన్నారు నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తులసి.. అంకిత చూసావా మీ తులసి ఆంటీ ఆస్తి వచ్చింది అని తెలియగానే ఎలా వచ్చి వాలిందో అని అంటుంది గాయత్రి. ఈ జన్మకి నీకు తులసి ఆంటీ మంచితనం అర్థం కాదు. నువ్వు ఇంతే అంటుంది అంకిత.ప్రేమ్ శృతి కి కాల్ చేసి మా బాస్ ని ఎలాగోలా ఒప్పించాను. నాకు జాబ్ వచ్చింది అని అంటాడు. కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పవా అని అంటే చెప్పాను ప్రేమ్. సరే మళ్లీ నీకోసం కంగ్రాట్స్ చెప్తున్నాను అని అంటుంది శృతి. ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే ఉంటే నేను క్యారేజ్ ఎలా ఇవ్వాలి అని అంటుంది శృతి..

Intinti Gruhalakshmi Serial 26 may 2022 Today Full Episode
Intinti Gruhalakshmi Serial 26 may 2022 Today Full Episode

తులసి ఇంటికి కాస్త లేట్ గా చేస్తుంది. ఇప్పటికీ వరకు రాకపోవడానికి ఏమైంది అని అడుగుతారు అని అంటారు ఇంట్లో వాళ్ళందరూ.. వాడిని అందరం అపార్థం చేసుకుంటున్నారు. నేను వెళ్ళగానే వాడు నన్ను పట్టుకుని వదలలేదు. నిజానికి వాడు అక్కడ ఉన్నాడు కానీ వాడి మనసంతా ఇక్కడే ఉంది. అభి అన్నయ్య అంతలా మారిపోయాడు అంటే నాకు నమ్మ బుద్ధి కావడం లేదు అంటే.. నేను అబద్ధాలు చెబుతున్నాను అని తులసి అంటుంది. అవును తులసి అంటే అబద్ధాలే చెబుతున్నారు అని అంకిత అంటుంది..చిన్నపిల్లలకి అబద్ధాలు చెప్పి మరి ప్రేమించడం తప్పు కాదు ఆంటీ. ఇంట్లో వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించడం తప్పే కదా ఆంటీ అని అంటుంది అంకిత. చావు బ్రతుకు లో ఉన్న డాక్టర్లు కూడా మీరు బ్రతుకుతారు అని అబద్ధాలు చెబుతారు. ఇప్పుడు నేను చేసింది కూడా అదే అంకిత. మళ్ళీ మంచి రోజులు రావంటావా అంకిత అంటుంది తులసి..