Intinti Gruhalakshmi 24 May Today Episode : అభి అంకిత పక్కకి వెళ్ళి కూర్చున్నాడు.. ఎన్నిరోజులు ఇలా నామీద కోపంతో ఉంటావు అని అంకితను అభి అడుగుతాడు. ఇది కోపం కాదు అభి.. వైరాగ్యం అని అంటుంది అంకిత. నాకు నచ్చిన నచ్చకపోయినా నీకోసం నేను ఏమైనా భరించాలి అంతేకదా అంటుంది అంకిత.. అంతలో తులసి ఫోన్ చేయగా అంకిత లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది.. అభి తో మాట్లాడి అని అడగగా ఇస్తాను అంటుంది. రెండు మూడు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. వాడి గొంతు వినాలనిపించి కాల్ చేశాను అడిగానని చెప్పు అంటుంది. అంతలో గాయత్రి వచ్చి అంకిత తో వాళ్ళ నాన్న రేపు వస్తున్నారని చెబుతుంది. డైరెక్ట్ గా గుడికి రమ్మన్నారు అన్నారు అందరినీ అక్కడికి రమ్మన్నారు ఒక గుడ్ న్యూస్ చెబుతారట అని అంటుంది.గాయత్రి అంకిత అభి ముగ్గురూ కలిసి గుడికి వెళ్తారు.
అంతలో అంకిత వాళ్ళ నాన్న అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.అసలు విషయం ఏమిటో చెప్పమని అడుగుతుంది గాయత్రి మనకు దక్కదు అనుకున్న ఆస్తి మనకు దక్కింది మనం కోర్టులో కేసు గెలిచాము నా బంగారు తల్లి అంకిత అదృష్టవంతురాలు 50 కోట్ల ఆస్తి మనకు సొంతం కాబోతుంది అని వాళ్ళ నాన్న కోర్టు ఆర్డర్ చూపిస్తాడు.. చూడు అంకిత కష్టపడింది నేనే అయినా సుఖ పడాల్సింది మాత్రం మీరే. ఈ ఆస్తిని నీ పేరు మీద రాయబోతున్నాను అని వాళ్ళ నాన్న చెబుతాడు.ఈ మాటలన్నీ లాస్య గుడిలో ఓ పక్కన నుంచుని ఉంటుంది అంటే నా కొడుకు కానీ కొడుకు అభి 50 కోట్ల ఆస్తికి ఇండైరెక్ట్ గా వారసుడు కాబోతున్నాడు.. నక్క తోక తోక్కడుగా అనుకుంటుంది. వాళ్ళ గుడిలో పూజ చేయించుకుని ఆ కోర్టు ఆర్డర్ పేపర్స్ తీసుకోమని అంకిత కు వాళ్ళ నాన్న ఇస్తాడు..

చూడు అంకిత నీ చేతికి వచ్చింది వేలు వందులు కాదు కోట్లు.. తెలివిగా ఆలోచించాలి.ఎవ్వరినీ అమాయకంగా నమ్మకు అని గాయత్రి అంటుంది. జాలి, దయ అంటూ ఎవ్వరికీ దానం చేయకు అంటుంది. నువ్వు ఎవ్వరికీ గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది. తులసి ఆంటీ గురించి అంటుంది. దయ చేసి మీ గొడవ ఆపండి అంటాడు అంకిత వాళ్ళ నాన్న.. అభి, అంకిత ఇద్దరు జీవితం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అని అంటాడు వాళ్ళ నాన్న. తప్పకుండా అని అభి అంటాడు.ఇక్కడ జరిగిన విషయాన్నంతా లాస్య నందు కి వివరంగా చెబుతుంది. అభి ని మచ్చిక చేసుకోమని చెబుతుంది. అభీకి ఆస్తి వస్తే మనం స్టార్ట్ చేయబోయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయమని అడుగుదాం. అభి తప్పకుండా మన కంపెనీ లో ఇన్వెష్ట్ చేస్తాడు. మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నువ్వు ఇప్పటి నుంచి పనిలో ఉండు అని లాస్య సలహా ఇస్తుంది.