Friday, July 1, 2022

Intinti Gruhalakshmi 20 May Today Episode : నందుని తులసి ఆంటీని వదిలేసినట్లు మా మమ్మిని వదిలేయవన్న గ్యారెంటీ ఏంటన్న లక్కీ..!

Intinti Gruhalakshmi 20 May Today Episode : తులసి ప్రేమ్ గురించి ఆలోచిస్తూ వంటలో ఉప్పు, కారం అన్ని ఎక్కువ ఎక్కువగా వేస్తుంది.. దివ్య వాళ్ళ తాతయ్య, నానమ్మ ఇద్దరు భోజనానికి కూర్చుంటారు.. తులసి చేసిన వంట బాగోలేక మౌనంగా తింటారు. మధ్యలోనే చెయ్యి కడిగి పరంధామయ్య, అనసూయమ్మ వెళ్ళిపోతారు. ఆ తరువాత దివ్య నువ్వు చేసిన వంట తినడానికి బాగోలేదమ్మ అని చెప్పిద్ది..! హాయ్యో నువ్వైనా చెప్పచ్చు కదా అంటుంది తులసి..!తులసి వాళ్ళ అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్లి వంట బాగోలేదు అని చెప్పొచ్చు కదా మావయ్య అని అంటుంది. వంటల పాడైపోయింది అంటే నీ మనసు బాగోలేదు అని అర్థం ఏమైందమ్మా తులసి అని అడుగుతుంది వాళ్ల అత్తయ్య. నీ మనసులోని బాధ నువ్వు చెప్పుకోలేకపోతే.. నీ వంట బాగోలేదని ఎలా చెప్పగలం అని అంటాడు అలా మావయ్య. మిమ్మల్ని సరిగ్గా చూసుకో లేకపోతున్నాను అనే బాధ.. సంపాదన లేదు అని అంటుంది తులసి. ఏదైనా సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చూసుకుంటా అని అంటాడు వాళ్ళ మావయ్య.

అంతలో వాళ్ళ అత్తయ్య నానమ్మ ‘s కిచెన్ తో బాగా డబ్బులు సంపాదిస్తాను అంటుంది. నేను ఉండగా కష్టపడే ఆలోచనే రాని వాళ్ళు నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది తులసి. ఆ ధైర్యం మాకు ఉందమ్మా అని అంటారు వాళ్లు కూడా..నందు ఇంట్లోకి రావడంతోనే లక్కీ అని పిలుస్తాడు. ఎప్పుడూ లేనిది ఇంట్లోకి రాగానే లక్కీ అని పిలుస్తున్న ఏంటి నందు అని అడుగుతుంది లాస్య. ఏ పిలవకూడదా అని అంటాడు లక్కీ.. అదేంటి అక్కడే ఆగిపోయావు ఇటు రా అంటాడు నందు.. నువ్వు ఆడుకోవడానికి వీడియో గేమ్ తీసుకువచ్చాను తీసుకోరా అని అంటాడు లక్కినీ.. వాహ్ వీడి గురించి ఆలోచిస్తున్నావా నందు తీసుకో లక్కీ వీడియో గేమ్ చాలా బాగుంది అని లాస్య అంటుంది. నాకు ఇష్టం లేదు నేను తీసుకోను అని లక్కీ అంటాడు. అదేంట్రా మొన్ననే వీడియో గేమ్ కావాలని గోల చేసావ్ కదా అని అంటుంది లాస్య. లక్కీ ఆ వీడియో గేమ్ ను పగలకొడతాడు. నన్ను కొనివ్వమని అడిగావు కదా డాడీ తెస్తే కాదు అంటావు ఏంటి లక్కీ.. అసలు ఆయన ఎవరు నాకు కొన్ని పెట్టడానికి అని లక్కీ అనగానే..ఏంటి లక్కీ అలా మాట్లాడుతున్నావు ఆయన మీ డాడీ అని లాస్య అంటుంది..

Intinti Gruhalakshmi Serial 20 may 2022 Today Full Episode
Intinti Gruhalakshmi Serial 20 may 2022 Today Full Episode

ఈయన మా డాడీ కాదు దివ్య అక్క వాళ్ళ డాడీ అంటాడు లక్కీ.. దివ్య అక్క వాళ్ళని వదిలేసి మన ఇంట్లో ఉంటున్నాడు నాకు అంతా తెలుసు. అనగానే లాస్య లక్కీని కొట్టబోతున్న వెంటనే నందు కొట్టొద్దు అని ఆపుతాడు.. నేనేం చిన్న పిల్లవాడిని కాదు.. నాకు అన్ని విషయాలు తెలిసిన మాట్లాడుతున్నాను అని అంటాడు లక్కీ.. ఈయన దివ్య అక్క వాళ్ళ డాడీ అవునా కాదా అనగానే.. నిజమే నాన్న అని నందు అంటాడు.. మీరు దివ్యకి డాడీ అయినప్పుడు నాకు ఎలా డాడీ అవుతారు నన్ను చీట్ చేయకండి అని అంటాడు లక్కీ.. ఈయన తులసి ఆంటీ ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నారు అందుకని నీకు డాడీ అని అంటుంది లాస్య. రేపు నిన్ను కూడా వదిలేస్తే అని లక్కీ అంటాడు..నేను ఎందుకు వదిలేస్తాను రా అని నందు అంటాడు.. నువ్వు తులసి ఆంటీని వదిలేసి నట్టే మా మమ్మీని వదిలేయవని గ్యారెంటీ ఏంటి అని అంటాడు లక్కీ.. రేయ్ లక్కీ అని లాస్య అనగానే.. నాకు ఏమైనా కొని ఇవ్వాలి అంటే నువ్వు కొనివ్వు.. అంతే కానీ ఈయన కొనీవ్వడానికి వీలు లేదు. ఈయన మా డాడీ కాదు అంతే అనేసి లక్కీ అక్కడనుంచి వెళ్ళిపోతాడు..

Related Articles

- Advertisement -

తాజా వార్తలు