Saturday, July 2, 2022

Intinti Gruhalakshmi 18 May Today Episode : నంది కి జాబ్ పోయిందని తెలిసి ఎగిరి గంతేసిన లక్కీ.! లాస్యకు చివాట్లు పెట్టిన తులసి..!

Intinti Gruhalakshmi 18 May Today Episode : అన్నట్టు మర్చిపోయాను అత్తయ్య రేపటి నుంచి సంగీతం టీచర్ గా అవతారం ఎత్తపోతున్నాను.. పార్క్ లో ఇద్దరు పిల్లలు సంగీతం ప్రాక్టీస్ చేస్తుండగా.. వాళ్ళ తప్పులు సరిదిద్దాను. వాళ్ళమ్మ వాళ్ల పిల్లలకి సంగీతం నేర్పించమని అడిగింది.. ఇంతకీ ఒప్పుకున్నావా మామ్ అని దివ్య అడుగుతుంది.. ఒప్పుకున్నా అంటుంది తులసి.. దాంతో స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు..!తులసి సంగీతం నేర్పించడానికి వెళుతుంది. సరిగమ పదనిసా అంటూ స్వరాలు పలుకుతుంది.. అంతలో లాస్య తన ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. అంతలో సంగీతం నేర్పిస్తున్న గొంతు విని నాకు సంగీతం నేర్చుకోవాలి అనిపిస్తుంది అడిగేస్తా పదా అంటుంది.. తులసిని చూడగానే ఏంటి అలా చూస్తున్నావ్ లాస్య తను నీకు పరిచయం ఉందా అని అడుగుతుంది.. ఇంటింటికి తిరిగి సంగీతం నేర్పిస్తున్నావన్నమాట.. పది మందిని ఒంటి చేతితో పోషించిన నువ్వు.. నిన్ను పోషించుకోవడానికి కింద మీద పడుతున్నావు అని లాస్య అంటుంది..

ఇప్పటికైనా పొగరు తగ్గిందా అదే రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నావా అని లాస్య అంటుంది..అర్థం చేసుకున్న వారు దానిని ఆత్మాభిమానం అంటారు.. చేసుకోలేని నీలాంటి వారు దాని పొగరు అంటారు.. చింత చచ్చినా పులుపు చావలేదు.. నువ్వు మీ ఆయన జాబ్ లేనప్పుడు ఏం చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని అంటుంది తులసి.. ఏంటి వెటకారమా.. నాకు ఎవరు జోలికి వెళ్లాలని లేదు.. నా జోలికి వస్తే ఊరుకోను అని తులసి అంటుంది.. సంజన తో చెప్పి మీ ఉద్యోగం పికించేయగలను కానీ.. నేను అలా చేయను.. మీ నోటి కాడ కుడు తియను.. నాకు థాంక్స్ చెప్పుకో అని అంటుంది లాస్య.. ఆ మాటలకు తులసి నా చేతిలో ఉంది విద్య ఉంది ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా చెప్పుకోగలను.. సంపాదించుకోగలను అని తులసి సమాధానం ఇస్తుంది… కానీ నీ మాట ఇక్కడ తప్ప ఇంకెక్కడా చెల్లుబాటు కాదు అది గుర్తుంచుకో అని అంటుంది తులసి.. వేడివేడి కాఫీ వస్తుంది తాగి రిలాక్స్ అవ్వు అని తులసి వెళ్ళిపోతుంది..మమ్మీ నువ్వు చెప్పిన మాట నేను వినాలి..

intinti gruhalakshmi serial 18 may 2022 today full episode
intinti gruhalakshmi serial 18 may 2022 today full episode

మరి నేను చెప్పిన మాట కూడా నువ్వు వింటావా అని లక్కీ అడుగుతాడు.. నువ్వు ఇలా బుద్దిగా కూర్చుంటే ఎందుకు వినను అని లాస్య అంటుంది.. కానీ నన్ను హాస్టల్ కి పంపించద్దు మమ్మీ.. ప్లీజ్ మమ్మీ హాస్టల్ కి పంపించద్దు లక్కీ అంటాడు.. నేను డాడీ ఇద్దరం బిజీగా ఉంటాము. అందుకే నేను హాస్టల్ కి పంపిస్తాను అని అంటుంది. ఇద్దరం కాస్త ఫ్రీ అయ్యాక తెచ్చుకుంటాము అని అంటుంది లాస్య.. ఏంటి త్వరగా వచ్చేశావు నందు అని లాస్య అడుగుతుంది. ఉద్యోగం సద్యోగం లేని తులసి నా ఫ్రెండ్ ఇంట్లో సంగీతం టీచర్ గా పని చేస్తుంది అని చెబుతుంది లాస్య. ఉద్యోగం లేకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థం అవుతుంది ఆ తులసికి అని లాస్య చెబుతుండగా.. లాస్య నా ఉద్యోగం కూడా పోయింది అని నందు అంటాడు.. దాంతో లాస్య షాక్ అయ్యి నందు వైపు చూస్తుంది. రెస్టారెంట్ మూసేశారు.. దాంతో లక్కీ అంకుల్ ఇంట్లో ఉంటారు.. నేను హాస్టల్ కి వెళ్ళే పని లేదు.. హుర్రే అంటూ గోల చేస్తుండగా.. షట్ అప్ అని నందు అరుస్తాడు .

Related Articles

- Advertisement -

తాజా వార్తలు