Intinti Gruhalakshmi 14 May Today Episode : ప్రవలిక తులసిని ఒక ఆవిడ దగ్గరకు తీసుకు వెళ్తుంది.. ఈవిడ నా ఫ్రెండు తులసి అని పరిచయం చేస్తుంది.. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ప్రవలిక.. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ కార్ లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అని చెబుతోంది.. తులసి ఎందుకు మీకు అంత శ్రమ ఫ్లైట్ లో వెళ్లొచ్చు కదా అని అంటుంది.. మీ గురించి మా తులసి కి తెలియదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాలి అనేది జానకమ్మ గారి కల అని చెబుతుంది ప్రవళిక..! పెళ్లి కాక ముందు ఆ డ్రీం కుదరలేదు.. పెళ్లయిన తర్వాత పిల్లలు వాళ్ళ అత్తమామలతో కుదరలేదు.. వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు అయ్యి కుదరలేదు..
తర్వాత తన భర్త కాలం చేశారు.. ఇన్నాళ్లకు మళ్లీ తన కలను నెరవేర్చుకోవటానికి కుదిరింది.. దేనికైనా జానకమ్మ సంకల్ప బలాన్ని నమ్ముతుంది..సంకల్పబలం ఉంటే ఏదైనా చేయొచ్చు.. నీకు ఒక విషయం తెలుసా ఈ ట్రిప్ కోసం ఆవిడ గారు మూడు నెలల క్రితమే డ్రైవింగ్ నేర్చుకున్నారు.. అప్పటి వరకు ఆమెకు కార్ డ్రైవింగ్ చేయరాదు అని చెప్పగానే తులసి షాక్ అయ్యి ఆమె వైపు చూస్తుంది.. చూడు తులసి కష్టాన్ని ఇష్టంగా మలచుకుంటే ఏదైనా చేయొచ్చు అని అంటుంది ప్రవలిక..నిజంగా ఆవిడ చాలా గ్రేట్ కదా అని తులసి అంటుంది. అవును మరి 80 ఏళ్ల జానకమ్మ గారికి ఉన్న సంకల్పబలం నీకు ఎందుకు ఉండకూడదు అని తులసి అడుగుతుంది ప్రవళిక.. రేపటి నుంచి నీకు లా నన్ను విసిగించే వాళ్ళు ఉండరు. నాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఇది నిన్ను కలవడం ఆఖరి సారి అవ్వచ్చు కానీ ఫోన్ లో నీకు ఎప్పుడు టచ్ లోనే ఉంటాను అని అంటుంది ప్రవలిక.

నా జీవితం నువ్వే మలుపు తిప్పావు. నువ్వు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఓమ్ము కనివ్వను ప్రవలిక అని తులసి అంటుంది..తులసి బియ్యం బస్తా తీసుకువచ్చి ఆ బస్తాను ఇంట్లో పెట్టడానికి నానా తంటాలు పడుతూ ఉంటుంది.. సరిగ్గా అదే సమయానికి నందు, లాస్య అక్కడకు వస్తారు. తులసిని చూస్తున్న లాస్య ఒకప్పుడు ఒక వీరనారి సంసారం బాధ్యతను అవలీలగా మోస్తనని అంది.. ఇప్పుడు బియ్యం బస్తా కూడా మోయలేక పోతుంది అని అంటుంది.. అలా చూస్తూ ఉండకపోతే నువ్వు బియ్యం బస్తా లోపల పెట్టొచ్చు కదా అని నందుని వాళ్ళ అమ్మ అంటుంది.. తులసి ఓడిపోయానని చెప్పమని చెప్పు ఇప్పుడే లోపల పెడతాను అని అంటాడు నందు.. నేను ఒప్పుకుంటున్నాను ఒక చేతకాని కొడుకును కన్నాను అని అనసూయమ్మ అంటుంది నుందుని చూస్తూ.. ఈ ముచ్చట్లు తరువాయి భాగంలో తెలుసుకుందాం.