Intinti Gruhalakshmi 13 May Today Episode : తులసి ఆఫీస్ నుంచి బయటకు వస్తూ.. నందు తో లోపల జరిగిన విషయాలన్ని తలచుకుని ఆలోచిస్తూ ఉంటుంది.. అలా కంగారుగా ఆలోచిస్తూ ఉండగా ప్రవళిక ఒక చాక్లెట్ తీస్తుంది తులసికి.. ఎందుకు ఇప్పుడు నేను ఏం గెలిచానని ప్రవళిక.. వచ్చిన జాబ్ పోగొట్టుకున్నాను.. అయితే ఏమైంది ఆత్మాభిమానాన్ని గెలుచుకున్నవ్.. అంతకంటే విలువైనది ఇంకేం కావాలి అని ప్రవళిక అంటుంది..అన్నీ కోల్పోయిన కూడా నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద విషయం.. పాతికేళ్ళు మీతో కాపురం చేసి డైవర్స్ తీసుకున్న వ్యక్తి మీకు జాబ్ ఇప్పించాలి అనుకున్నాడు.. కానీ తల వంచి తన సహాయాన్ని తీసుకోవాలి అనుకోకుండా.. వద్దని చెప్పి నీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నావు.. అన్ని ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు.. ఏమీ లేనప్పుడు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు ప్రవళిక అంటుంది.. నువ్వు సాధించావు అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు అని.. చాక్లెట్ ఇచ్చి తీసుకోమని అంటుంది..

ప్రవళిక చెప్పిన మాటలకు తులసి ఇన్స్పైర్ అయి చాక్లెట్ తీసుకుంటుంది..నందు నువ్వు ఎప్పుడు వచ్చావు చడీచప్పుడూ లేకుండా లాస్య అడుగుతుంది.. నేనేమైనా ఆంబులెన్స్ అనుకుంటున్నావా చడీచప్పుడు లేకుండా రావడానికి అని నందు ఫైర్ అవుతాడు.. ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావ్ అని లాస్య అంటుంది.. వెళ్లిన పని అవ్వలేదా అని లాస్య అడుగుతుంది.. ఎనీ ప్రాబ్లం అని అంటే.. ఎవరి థింగ్ విల్ బి ఫైన్ అని నందు అంటాడు.. తులసి గురించి నీ ఎస్టిమేషన్ తప్పు కాదు లాస్య.. వామ్మో వామ్మో తులసి మామూలుది కాదు.. ఏం చూసుకొని తనకి అంత పొగరు.. ఇల్లు లేదు జాబు లేదు అని నందు అంటుండగా.. మళ్లీ తులసి దగ్గరికి వెళ్ళావా అని అంటుంది లాస్య..నేను ఎందుకు వెళ్తాను అని నందు అంటాడు.. జాబ్ ఆఫర్ ఇస్తానని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను కదా.. తను కూడా అక్కడికి జాబ్ కోసం వచ్చింది.. పోనీలే కదా అని రికమెండ్ చేశాను..

నువ్వు ఎవరు రికమెండ్ చేయడానికి అంటూ నా మీద రివర్స్ అయ్యింది అని అనగానే.. తులసి చంప చెంప పగల కొట్టాల్సింది అని అంటుంది లాస్య.. ఎవరు నేనా అని అంటాడు నందు.. కాదు తులసి నీ చెంప పగల కొట్టాల్సింది అని లాస్య అంటుంది.. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఎలా రియాక్ట్ అవుతారో నీకు తెలుసు. అయినా నువ్వు ఎందుకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నావు అని లాస్య అడుగుతుంది.. ఎందుకు ఇంకా తన వెనక పెడుతున్నావు అని అంటుంది.. వెనక పడటం ఏంటి.. నువ్వు వెనకపడ్డ బట్టే కదా తను నిన్ను చీ కొడుతుంది.. అసలు తులసి అంటే నీకు ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్.. పాతికేళ్లు కలిసి కాపురం చేసినందుకు.. గతం తాలూకు జ్ఞాపకాలు కూడా నీకు గుర్తు రావడానికి వీలు లేదు.. నేను నీ భార్యను.. ప్రేమ చూపించాలి అనుకుంటే నా మీద చూపించు.. చేతిలో పెట్టుకొని ఎందుకు ఆ రద్దయిన నోటు వెంట పడతావ్ ఏంటి.. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది లాస్య.. నందు లాస్య మాటలకు షాక్ అవుతాడు..