Sunday, May 22, 2022

Intinti Gruhalakshmi 11 May Today Episode : తులసి పాటకు ఫిదా.. ప్రవలికను నిలదీసిన తులసి.. నందుకు షాక్ ఇచ్చిన లక్కీ..!

Intinti Gruhalakshmi 11 May Today Episode : తులసి గొప్ప తల్లి అని తెలుసు.. ఆ తల్లి గొప్ప మనసు ఈ రోజు స్వయంగా చూసాను.. చంద్రుడిలో మచ్చ కనిపిస్తుందేమో కానీ.. మచ్చుకు కూడా తులసిలో ఒక్క మచ్చ కూడా కనిపించదు.. పిల్లల భవిష్యత్తు కోసం నాన్న జీవితంలో త్యాగాలు చేస్తే.. అమ్మ తన జీవితాన్నే త్యాగం చేస్తుంది.. నేను చాలా మందిని చూసాను.. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కింద పడకుండా గ్లాస్ వేసుకుంటాం.. ఆ గ్లాస్ పై దుమ్ము పడకుండా ప్రతి 5 నిమిషాలకు దానిని తుడుస్తూ ఉంటాం.. ఎక్కడ మొబైల్ ఫోన్ పోతుందేమోనని చేజారిపోకుండా వ్యక్తిగా పట్టుకుంటారు.. మొబైల్ ఫోన్లో చూపించినంత జాగ్రత్త ఇంట్లో అమ్మ మీద చూపించారు ఎందుకు అని అంటుంది ప్రవలిక.. ఈరోజు ఈ కాంపిటీషన్ లో పాల్గొన్న అందరికీ నా శుభాకాంక్షలు.. కంగ్రాట్స్ తులసి అని ప్రేమగా హత్తుకుంటుంది ప్రవళిక..ఈరోజు కాంపిటీషన్ లో గెలిచిన నువ్వు నీ నవ్వు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

నువ్వు కలెక్టర్ వని నాకు ఎందుకు చెప్పలేదు అని తులసి అడుగుతుంది. నేను కోరుకుంది నీ స్నేహాన్ని.. నా చిన్ననాటి స్నేహితురాలిని కలవాలని అనుకున్నా.. నువ్వు ఇచ్చే మర్యాదను కాదు.. నీ గౌరవం కోసం కాదు అని అంటుంది ప్రవాలిక.. నా గురించి ఎలా తెలుసుకున్నావు అని తులసి అడగగా.. నువ్వు నీ ఫ్యాక్టరీ గురించి పెట్టుకున్న అర్జీ చూసి.. అంటే నీ ఫ్రెండ్ నని హెల్ప్ చేసావా అని అంటుంది.. కాదు నీ వైపు న్యాయం ఉంది అందుకే నీ గురించి తెలుసుకుని ఇదంతా చేశాను అంటుంది. నాకు తెలియక అడుగుతున్నా ప్రవళిక ఇంత బిజీగా ఉండే నువ్వు నాతో అంత ఫ్రీ గా ఎలా ఉంటున్నావు అని అడుగుతుంది.. రోజులో నాకంటూ ఒక గంట కేటాయించుకుంటా అని చెబుతుంది.. అది పూర్తిగా నా టైమ్.. నా మనసుకు నచ్చిన పని చేస్తాను.. అప్పుడే నీతో కలిశాను అని అంటుంది.. మనం తిరగడంతో నువ్వు ఏమైనా నీ బాధ్యతలను మర్చిపోయావా.. లేదు కదా.. ఏ బంధాల కోసం మనం వెంపర్లాడవసరం లేదు.. ఇంతకంటే నేను నీకు ఏమీ చెప్పలేను..

intinti gruhalakshmi serial 11 may 2022 today full episode
intinti gruhalakshmi serial 11 may 2022 today full episode

దేవుడు నూరేళ్ళు ఇచ్చింది ఎవరికో ధారపోయమని కాదు.. నీకోసం కూడా కాస్త సమయం వాడుకోమని చెబుతుంది ప్రవాలిక.లక్కీ నందును అలాగే చూస్తుంటే.. ఏంటి అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు నందు.. నువ్వు మా డాడీ కాదు కదా అని లక్కీ అంటాడు.. నేను మా మమ్మీ గొడవ పడుతుంటే ఎందుకు మధ్యలో వచ్చి అడ్డుపడ్డవు అని లక్కీ నందును అడుగుతాడు.. అంటే ఏంటి నన్ను డాడీ అని పిలుస్తావా అని నందు అంటాడు.. అంత లేదు అని లక్కీ అంటాడు.. నా మనసు ఒప్పుకోవాలి.. నాకు నువ్వు అలవాటు పడాలి అని లక్కీ అక్కడనుంచి వెళ్ళిపోతాడు.. వీడికి కూడా అలుసు అయిపోయినా అనుకుంటాడు నందు మనసులో..ఇంట్లో అందరూ నిద్ర పోయారని తులసి పాట పడగలనో లేదో అని పాట పడుతుంది.. తులసి పాట విన్న దివ్య, వాళ్ళ అత్త మావయ్య అందరూ బయటికి వస్తారు.. దివ్య అంతటితో ఆగకుండా ఫోన్ లో తులసి నీ తన పాటను వీడియో తీస్తుంది.. తులసి మైమరచి పడుతుండగా.. వాళ్లంతా తులసి పాటకు ఫిదా అయిపోయి క్లాప్స్ కొడతారు.. ఇక తులసిని పొగడ్తలతో ముంచెత్తారు ఇంట్లో వాళ్ళందరూ.. ఇక దివ్య ఆ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటుంది..

Related Articles

- Advertisement -

తాజా వార్తలు