Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదేనా.!?

Intinti Gruhalakshmi : బుల్లితెర పై ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది ఈ సీరియల్.. స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి ఈ వారం కూడా మూడో స్థానంలో నిలిచింది.. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఏంటో చూద్దాం..! తులసి వాళ్ళ ఇంట్లో వినాయకుని పూజ అయ్యాక.. అందరూ కలిసి సాయంత్రం కూర్చుంటారు.. సామ్రాట్ చూస్తూ అంకుల్ ఇప్పుడు ఒక స్లిప్ తీయండి అని దివ్య అడుగుతుంది ఓ అందమైన కథను చెప్పమని ఆ స్లిప్ లో రాసి ఉంటుంది.. నిజజీవితంలో జరిగిన ఓ కథను ఈరోజు మీ అందరి ముందు చెబుతాను అని..

ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఆ వినాయకుడి మహిమల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న రోజు.. ఓ బిజినెస్ మేన్ తన పార్టనర్ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తనని అవమానిస్తాడు.. తన బిజినెస్ పార్టనర్ ని తన మాజీ భర్త బ్రతిమిలాడుకున్నాడు.. తనే మాజీ భర్తని ఆఫీసులో తెలియనివ్వదు అని చెప్పాడు.. తను ఆ మాటకు కట్టుబడి ఉంది మౌనం వహించింది.. బాస్ ఆగడాలకు సహించింది.. చెయ్యని తప్పుకి ఆమె మాజీ భర్త ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన తప్పులేదు అని సామ్రాట్ అంటాడు ఆ మాటలకు షాక్ అవుతూ నందు, లాస్య లేచి నిలబడతారు.. నిజం సామ్రాట్ కి తెలిసిపోయిందని ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఫీల్ అవుతారు.. లాస్య నందు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ఇక చివరిగా నన్ను క్షమించండి తులసి అంటే రెండు చేతులు జోడించి సామ్రాట్ చెబుతాడు.. రేపటి నుంచి మీరు ఆఫీస్ కి రండి అని తులసి కి చెప్పి అక్కడి నుంచి సామ్రాట్ వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi next week The highlight twist 
Intinti Gruhalakshmi next week The highlight twist

Intinti Gruhalakshmi  : లాస్యకి శిక్ష వేసిన తులసి..! సామ్రాట్ కండిషన్స్ కి లాస్య ఒప్పుకుంటుందా.!?

లాస్య సామ్రాట్ దగ్గరకి వచ్చి కోపంగా ఉంటారని ఒక్క ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే మీతో మాట్లాడుతున్నాను అని లాస్య అంటుంది.. లాస్య సారీ సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కారణం లేని నేనే.. నందుని తులసి మాజీ భర్తన్న సంగతి చెప్పొద్దు అని చెప్పాను. నా కోసం నందు తులసి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశాడు. సర్వైవల్ ప్రాబ్లం అందుకే జాబ్ కోసం మీ దగ్గర ఈ నిజాన్ని దాచాలని అనుకున్నాము అని లాస్య అంటుంది. మీరు చేసిన తప్పు వల్ల తులసి ఎంత బాధ పడిందో మీకు తెలుసు కదా అని సామ్రాట్ అంటాడు.. దయచేసి మా జాబ్స్ మమ్మల్ని చేసుకోనివ్వండి అని లాస్య సామ్రాట్ రిక్వెస్ట్ చేస్తుంది.. నాకు మీ దగ్గర నుంచి మూడు విషయాలలో క్లారిటీ కావాలి.. నా ఆఫీస్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి.. రెండోది నా ప్రాజెక్టు ప్రశాంతంగా జరగడం.. మూడోది నా బిజినెస్ పార్లర్ ప్రశాంతంగా ఇక్కడ పని చేసుకోవడం.. వీటిల్లో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడను అని సామ్రాట్ ఇన్ డైరెక్టుగా లాస్యకు వార్నింగ్ ఇస్తాడు..

నిజంగా మీకు జాబ్ చేయాలి అని అనుకుంటే జాబ్ అవసరం అని అనుకుంటే నిన్న జరిగిన తమాషాలా లాంటివి మళ్లీ ఇంకోసారి చేయటానికి వీల్లేదు అని సామ్రాట్ అంటాడు.. నువ్వు నీ భర్త కంట్రోల్ లేకుండా ప్రవర్తించడం నీ బాధ్యత.. అలా అని నువ్వు నాకు మాట ఇస్తేనే నీ జాబ్స్ ఉంటాయి.. మీరు మాకు జాబ్స్ ఇచ్చినందుకు థాంక్యూ సర్.. అది సామ్రాట్ తో రాసి అనగానే మీకు జాబ్ ఇచ్చింది నేను కాదు తులసి.. థాంక్యూ చెప్పాల్సింది నాకు కాదు తులసికి అని సామ్రాట్ లాస్య తో అంటాడు.. మళ్లీ ఇంకొకసారి చెబుతున్నాను గుర్తుంచుకోండి.. మీ వల్ల మీ తులసికి, నాకు, నా కంపెనీకి ఎటువంటి ఇబ్బంది కలిగిన మీకు లైఫ్ లో జాబ్ కెరియర్ ఉండదు వీటన్నింటికీ మీరు ఒప్పుకుంటేనే మీరు జాబ్ చేయడానికి రండి అని సామ్రాట్ అంటాడు.. మీ డెసిషన్ ఇప్పుడే చెప్పనవసరం లేదు టైం తీసుకుని చెప్పండి పర్వాలేదు అని సామ్రాట్ అనగానే.. ఇప్పుడే ఒప్పుకుంటున్నాను సార్ అని లాస్య అంటుంది.. ఓకే గుడ్ ఆల్ ది బెస్ట్ అని సామ్రాట్ లాస్యతో అంటాడు..

Intinti Gruhalakshmi : తులసికి ప్రపోజ్ చేసిన సామ్రాట్..

నందు తాగి వచ్చి సామ్రాట్ నువ్వు ఆ రోజు తులసి గురించి ఏదో కుసావ్.. అది ఏంటో చెప్పు అని రోడ్డు మీద కేకలు వేస్తాడు.. అప్పుడే సామ్రాట్ తులసి తో.. తులసి గారు మీరంటే ఏంటో తెలుసుకున్న మొదటి క్షణం మీపై అభిమానం పెంచుకున్నాను.. మీ వాళ్ళ మీద మీరు చూపిస్తున్న ఆప్యాయత అనురాగత చూసి ఈర్ష్య పడి వాళ్లలో నేను కూడా ఒకడిని అవ్వాలి అనుకున్నాను.. జీవితంలో ఎదగాలని తపన చూసి అందుకు కారణం నేనే కావాలని అనుకున్నాను.. మనిషిగా మీ స్థాయి అందుకోవడానికి నా స్థాయి సరిపోదు.. మీ నీడలో మనిషిని అవ్వాలి అనుకుంటున్నాను.. మీ జీవితంలో సగం భాగం కావాలని అనుకుంటున్నాను.. మీకు ఇష్టమేనా అని సామ్రాట్ అడగగానే తులసి నవ్వుతూ సరే అని తల ఊపుతుంది.. చాలా నీ డౌట్ క్లారిఫై అయిందా అని సామ్రాట్ నందుని చూస్తూ అంటాడు.. ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అని సామ్రాట్ తులసి భుజం మీద చేయి వేసి అంటాడు అప్పుడే నందు కోపంతో తన చేతిలో ఉన్న వైన్ బాటిల్ వాళ్ళ మీద విసిరి కొట్టాలని చూడగా అదంతా బ్రమ.. నందు సామ్రాట్ కార్ కింద దూరి బ్రేక్ ఫైయిల్ చేస్తాడు..

రేయ్ పొద్దున్నే లేచి తులసి ఇంటికి వెళ్లాలని కలలు కంటున్నావెమో.. నువ్వు వెళ్ళేది తులసి ఇంటికి కాదు హాస్పిటల్ కి అని నందు అంటాడు.. కానీ యాక్సిడెంట్ జరిగింది సామ్రాట్ కి హనీ అని చూపిస్తారు..నందు ప్లాన్ చేసిన యాక్సిడెంట్ లాస్యకు తెలిసి దాన్ని ఆపమని అడ్డుకుంటుంది. కానీ ఆలోపే జరగాల్సిన ఘోరం మొత్తం జరిగిపోతుంది.. అప్పుడు కూడా తులసి దగ్గరుండి సామ్రాట్ హానీలను కాపాడుతుంది సొంత భార్య తల్లి లాగా వాళ్ళిద్దరికీ సేవలు చేస్తుంది దాంతో కోపం వచ్చి నందు మరోసారి తాగుతాడు అప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా ఏంటి అని సామ్రాట్ ను నందు ఆ మత్తులో అడుగుతాడు అప్పుడే సామ్రాట్ తులసి మెడలో తాళి కట్టినట్టు అది కూడా ఒక భ్రమ లాగా చూపించనున్నారు.. వచ్చేవారం ఇదే హైలెట్ ట్విస్ట్ అవుతుందేమోనని ఒక ఇంటింటి గృహలక్ష్మి అభిమానులు అనుకుంటున్నారు. నిజంగా ఈ సీన్ ఉంటే టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో ఉంటుందనడంలో సందేహం లేదు..

Advertisement