Intinti Gruhalakshmi 15 Sep Today Episode : లాస్యకి శిక్ష వేసిన తులసి..! సామ్రాట్ కండిషన్స్ కి లాస్య ఒప్పుకుంటుందా.!?

Intinti Gruhalakshmi 15 Sep Today Episode : తులసి గారు ఇంకా రాలేదు ఏంటి బాబాయ్ అని సామ్రాట్ ఆఫీస్ లో వాళ్ళ బాబాయ్ దగ్గర తెగ సతమత మవుతాడు.. ఇక తులసి రాదు అని సామ్రాట్ బయటికి వెళ్తుండగా.. అప్పుడే తులసి ఎదురుగా కూర్చుని ఫైల్ చూస్తుంది.. నేను రాను అనుకున్నారు కదా అని సామ్రాట్ ను తులసి అడుగుతుంది.. మీకు మైండ్ రీడింగ్ కూడా వచ్చాను సామ్రాట్ అడుగుతాడు అంత కరెక్ట్ గా ఎలా చెప్పేసేశారు సామ్రాట్ అనగానే వేరే ఏ ఆడది ఉన్నా కూడా చేసే పని అదే కాబట్టి అని తులసి అంటుంది.. కొన్నాళ్లు ఇంటికి దూరంగా ఉండి మీ బిజినెస్ వర్క్స్ చేసుకోవచ్చు కదా అని తులసిని సామ్రాట్ అంటారు.. నేను బ్రతికేది వాళ్ళ కోసం ఎక్కడ ఉన్నా సాయంత్రం గూటికి పక్షులు ఎలా చేరుకుంటాయి.. నేను నా ఇంటికి అలాగే చేరుకోవాలి అని అనుకుంటున్నాను అని తులసి అంటుంది.. ఇక నుంచి నా పార్టనర్ ఎలా చెబితే అలా వింటాను అని సామ్రాట్ ని చూస్తూ తులసి అనగానే.. సామ్రాట్ పకపక నవ్వేస్తాడు.. అప్పుడే లాస్య ఆఫీస్ లోకి వస్తుంది.. గుడ్ మార్నింగ్ సార్ అని లాస్య సామ్రాట్ ను విష్ చేస్తుంది. లాస్య తో ఫోన్ చేసి రావాల్సింది అని సామ్రాట్ అంటారు.

నాకు తెలుసా మీరు కోపంగా ఉంటారని ఒక్క ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే మీతో మాట్లాడుతున్నాను అని లాస్య అంటుంది.. తులసి గారికి ఇబ్బంది లేకపోతే ఇక్కడే తన ముందే మాట్లాడుతాను అని లాస్య అంటుంది. పక్కవారి విషయాలు వినటం నాకు అంతే ఇష్టం ఉండదు అని అనగానే.. అయితే నా క్యాబిన్ లో వెయిట్ చేయండి నేను వస్తాను అని సామ్రాట్ అంటాడు.. నందగోపాల్ మీకు చాలా అన్యాయం చేశాడు అని సామ్రాట్ అంటుండగా.. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదని తులసి ఉంటుంది.. నీ గురించి అన్ని విషయాలు తెలిసిపోయే కాబట్టి ఓపెన్ గా మాట్లాడుకుందాం అని సామ్రాట్ ఇక నందు వాళ్ళని నేను ఆఫీసులోకి రానివ్వను అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఆ విషయం గురించి మాట్లాడటానికి లాస్య ఎక్కడికి వచ్చింది. మీకు అన్యాయం చేసిన వారిని ఎదురుగా చూస్తూ.. మీరు ఆఫీసులో ప్రశాంతంగా వర్క్ చేసుకోలేదని నాకు తెలుసు.. నందు లాస్యలను ఆఫీసులో తీసుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా నీకే వదిలేస్తున్నాను మీరు ఎలా డిసైడ్ చేసుకునీ ఏది అంటే అదే నిర్ణయం నేను ఫైనల్ గా తీసుకుంటాను మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అని కూడా అడగను..

Intinti Gruhalakshmi 15 September Today Full Episode
Intinti Gruhalakshmi 15 September Today Full Episode

నీకు ఏ నిర్ణయం కావాలంటే అది తీసుకోండి లాస్య కి నేను చెబుతాను అని సామ్రాట్ అంటాడు.. డిసైడ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా లాస్యను మళ్ళీ రమ్మని చెబుతాను అని సామ్రాట్ అంటాడు.. ఇబ్బంది నాకు కాదు మీకు అని తులసి అంటుంది.. నా బాధ దిగులు అంతా మీ గురించే అందరి ముందు నవ్వులు పాలవ్వడం నాకు ఇష్టం లేదని తులసి అనగానే.. సామ్రాట్ వెంటనే లాస్య దగ్గరకు వెళ్తాడు.. లాస్య సారీ సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కారణం లేని నేనే.. నందుని తులసి మాజీ భర్తన్న సంగతి చెప్పొద్దు అని చెప్పాను. నా కోసం నందు తులసి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశాడు. సర్వైవల్ ప్రాబ్లం అందుకే జాబ్ కోసం మీ దగ్గర ఈ నిజాన్ని దాచాలని అనుకున్నాము అని లాస్య అంటుంది. మీరు చేసిన తప్పు వల్ల తులసి ఎంత బాధ పడిందో మీకు తెలుసు కదా అని సామ్రాట్ అంటాడు.. దయచేసి మా జాబ్స్ మమ్మల్ని చేసుకోనివ్వండి అని లాస్య సామ్రాట్ రిక్వెస్ట్ చేస్తుంది.. నాకు మీ దగ్గర నుంచి మూడు విషయాలలో క్లారిటీ కావాలి.. నా ఆఫీస్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి..రెండోది నా ప్రాజెక్టు ప్రశాంతంగా జరగడం.. మూడోది నా బిజినెస్ పార్లర్ ప్రశాంతంగా ఇక్కడ పని చేసుకోవడం..

వీటిల్లో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడను అని సామ్రాట్ ఇన్ డైరెక్టుగా లాస్యకు వార్నింగ్ ఇస్తాడు.. నిజంగా మీకు జాబ్ చేయాలి అని అనుకుంటే జాబ్ అవసరం అని అనుకుంటే నిన్న జరిగిన తమాషాలా లాంటివి మళ్లీ ఇంకోసారి చేయటానికి వీల్లేదు అని సామ్రాట్ అంటాడు.. నువ్వు నీ భర్త కంట్రోల్ లేకుండా ప్రవర్తించడం నీ బాధ్యత.. అలా అని నువ్వు నాకు మాట ఇస్తేనే నీ జాబ్స్ ఉంటాయి.. మీరు మాకు జాబ్స్ ఇచ్చినందుకు థాంక్యూ సర్.. అది సామ్రాట్ తో రాసి అనగానే మీకు జాబ్ ఇచ్చింది నేను కాదు తులసి.. థాంక్యూ చెప్పాల్సింది నాకు కాదు తులసికి అని సామ్రాట్ లాస్య తో అంటాడు.. మళ్లీ ఇంకొకసారి చెబుతున్నాను గుర్తుంచుకోండి.. మీ వల్ల మీ తులసికి, నాకు, నా కంపెనీకి ఎటువంటి ఇబ్బంది కలిగిన మీకు లైఫ్ లో జాబ్ కెరియర్ ఉండదు వీటన్నింటికీ మీరు ఒప్పుకుంటేనే మీరు జాబ్ చేయడానికి రండి అని సామ్రాట్ అంటాడు.. మీ డెసిషన్ ఇప్పుడే చెప్పనవసరం లేదు టైం తీసుకుని చెప్పండి పర్వాలేదు అని సామ్రాట్ అనగానే.. ఇప్పుడే ఒప్పుకుంటున్నాను సార్ అని లాస్య అంటుంది.. ఓకే గుడ్ ఆల్ ది బెస్ట్ అని సామ్రాట్ లాస్యతో అంటాడు.. లాస్య తులసి దగ్గరికి వచ్చి ఇంకోసారి నీ మంచితనాన్ని నిరూపించుకున్నావు థాంక్యూ అని అంటుంది..

ఈ మంచితనం నాది కాదు సామ్రాట్ గారిది అని తులసి అంటుంది.. నువ్వు తలుచుకుంటే మాకు జాబ్స్ రాకుండా చేయవచ్చు కానీ నువ్వు అలా చేయలేదు.. మా గురించి సామ్రాట్ గారికి మంచిగానే సలహా ఇచ్చావు.. అలాంటప్పుడు నీకే కదా థాంక్యూ చెప్పాలి అని లాస్య తులసి దగ్గర తగ్గి మాట్లాడుతుంది.. మా వల్ల నీకు కలిగిన కష్టం బాధ గుర్తుకు రాలేదా అని లాస్య తులసిని అడుగుతుంది. వచ్చాయి అని తులసి అంటుంది. గతం అంతా సినిమా రీల్ లాగా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.. ఆ బాధ ఎలా ఉన్నట్టు తెలుసు అలాంటి బాధ మీరు ఎవ్వరూ అనుభవించకూడదని.. ఇలా చేశాను అని తులసి లాస్యతో అంటుంది.. అపకారికి అపకారం చేస్తే అది ప్రతీకారం అవుతుంది.. ఆపగారికి ఉపకారం చేస్తే అది అని తులసి ఆపగానే అది సహాయం అవుతుంది అని లాస్య అనగానే కాదు అది శిక్ష అవుతుంది అని తులసి అంటుంది.. లాస్య షాక్ అవుతూ చూడగానే.. అవును లాస్య నేను బాధ పెట్టిన నన్ను బాధ పడకుండా చూసారే అనే ఆలోచన మన మనసుని బాధిస్తూ ఉంటుంది అది కూడా శిక్షే కదా అని తులసి ఉంటుంది.. నా బ్రతుకు నాది నా జీవితం నాది ఎవరి గురించి పట్టించుకునే అంత ఓపిక, తీరిక, ఆసక్తి నాకు లేవు అని తులసి అంది..ఇక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో రేపటి వరకు వేచి చూడాల్సిందే…

Advertisement