Intinti Gruhalakshmi 14 Sep Today Episode : లాస్య, నందు హాట్ హాట్ స్టెప్స్.. తులసిని రేపటి నుంచి ఆఫీస్ కి రమ్మన్నా సామ్రాట్..!

Intinti Gruhalakshmi 14 Sep Today Episode : నెక్స్ట్ స్లిప్ ప్రేమ్ తీయగానే అందులో భార్యాభర్తలిద్దరూ ప్రేమగా గొడవపడాలని ఉంటుంది.. శృతి గొడవ స్టార్ట్ చేస్తుంది.. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. నటించింది నువ్వు.. బ్లేమ్ చేస్తుంది నన్ను అంటూ ప్రేమ్ శృతి గొడవపడతారు.. వాళ్ళిద్దరి మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. నిజంగా గొడవ పడుతున్నారా అని తులసి అడుగుతుంది. లేదు అమ్మా యాక్ట్ చేశాం అని ప్రేమ్ అంటాడు.. అవును ఆంటీ అంటూ శృతి కవర్ చేస్తుంది.. మేము నిజమే అనుకుని హడలి చచ్చం అంటూ అనసూయమ్మ అడుగుతుంది..! నెక్స్ట్ స్లిప్ నందు, లాస్య తిస్తారు.. చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలే పడుతున్న అంటూ నందు లాస్యను చూస్తూ స్టెప్స్ వేస్తాడు చూస్తానికి బాగానే ఉన్నా కాస్త రోతగా అనిపిస్తుంది.. ఇక చివరిలో నందు లాస్యని ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు..

హాస్యం చూసి అందరూ మూతి ముడుచుకుంటారు తులసి మనసులో బాధను భరిస్తూ మౌనంగా క్లాప్స్ కొడుతుంది.. ఆ తర్వాత స్లిప్ తులసి తీస్తుంది. చక్కెర లాంటి తీయదనమైన పాట పాడమని ఆ స్లిప్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు నోట్లో చక్కెర పోసుకొని రావాలా అని తులసి జోక్ వేస్తుంది. తులసి తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను తలుచుకొని ఓ అందమైన పాటను ఆలపిస్తుంది తులసి పాటకు అందరూ ఫిదా అవుతారు.. ఇప్పుడు సామ్రాట్ వంతు వస్తుంది ముందుగా దివ్య సామ్రాట్ని ఓ పాటకి డాన్స్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది ఆ తర్వాత స్లిప్ ఎదురుగాను అని అంటుంది లక్కీ హనీ సామ్రాట్ ముగ్గురు కలిసి డీజె టిల్లుపాటికి ఊగిపోయే స్టెప్స్ వేస్తారు.. అప్పుడే సామ్రాట్ చూస్తూ అంకుల్ ఇప్పుడు ఒక స్లిప్ తీయండి అని దివ్య అడుగుతుంది ఓ అందమైన కథను చెప్పమని ఆ స్లిప్ లో రాసి ఉంటుంది నిజజీవితంలో జరిగిన ఓ కథను ఈరోజు మీ అందరి ముందు చెబుతాను అని సామ్రాట్ స్టార్ట్ చేసాడు..

Intinti Gruhalakshmi 14 September Today Full Episode
Intinti Gruhalakshmi 14 September Today Full Episode

ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఆ వినాయకుడి మహిమల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న రోజు.. ఓ బిజినెస్ మేన్ తన పార్టనర్ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తనని అవమానిస్తాడు.. తన బిజినెస్ పార్టనర్ ని తన మాజీ భర్త బ్రతిమిలాడుకున్నాడు.. తనే మాజీ భర్తని ఆఫీసులో తెలియనివ్వదు అని చెప్పాడు.. తను ఆ మాటకు కట్టుబడి ఉంది మౌనం వహించింది.. బాస్ ఆగడాలకు సహించింది.. చెయ్యని తప్పుకి ఆమె మాజీ భర్త ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన తప్పులేదు అని సామ్రాట్ అంటాడు ఆ మాటలకు షాక్ అవుతూ నందు, లాస్య లేచి నిలబడతారు.. నిజం సామ్రాట్ కి తెలిసిపోయిందని ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఫీల్ అవుతారు.. లాస్య నందు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ఇక చివరిగా నన్ను క్షమించండి తులసి అంటే రెండు చేతులు జోడించి సామ్రాట్ చెబుతాడు.. రేపటి నుంచి మీరు ఆఫీస్ కి రండి అని తులసి కి చెప్పి అక్కడి నుంచి సామ్రాట్ వెళ్ళిపోతాడు..