Intinti Gruhalakshmi 13 Sep Today Episode : అంకిత కి ప్రపోజ్ చేసిన అభి.. ప్రేమ్, శృతి అందరి ముందే గలాటా..!

Intinti Gruhalakshmi 13 Sep Today Episode : తులసిని అందరూ సామ్రాట్ గారికి నిజం చెప్పేయమని అడుగుతారు.. ఈ సమయంలో చెప్పడం మంచిది కాదని తులసి అందరినీ కంట్రోల్ చేస్తుంది. మనం ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం కాదు.. ఆయన మన ఇంటికి వచ్చారని మనం చెప్పడం కరెక్ట్ కాదు.. సరే ఈ విషయం ఇక్కడితో వదిలేసేసి పూజ సంగతి చూద్దాం పదండి అని తులసి అంటుంది.. దివ్య ఒక బౌల్ తీసుకువచ్చి అందులో స్లిప్స్ రాసి ఆ స్లిప్స్ లో ఒక టాస్క్ రాసి ఉంచుతుంది అందులో ఎవరికి ఏ స్లీప్ వస్తే ఆ టాస్క్ చేయాలి.. మీ భార్య ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీ మనసులోని మాట చెప్పాలి అనే స్లీప్ అంకిత రాగానే.. భర్త తన మన మాట వినాలని ఎలా కోరుకుంటురో..

అలాగే భార్య కూడా తన మాట వినాలని భర్త కోరుకుంటాడు..భార్య తనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎలా ఉంటుందో భర్త కూడా అదే కోరుకుంటడు.. ఎదగాలి అనే తన ఆలోచనకి పూర్తి సపోర్టు కోరుకుంటాడు..  భార్యాభర్తల బంధం చాలా సున్నితమైనది దాన్ని చాలా సున్నితంగా డీల్ చేయాలి లేదంటే భారంగా మారిపోతుంది.. ఒకరు చెప్పే మాట ఒకరు మనసుతో వినాలి చెవులతో వినకూడదు. నా మనసు ఒక విషయంలో చాలా బాధపడుతుంది ఒకప్పుడు నా భార్య మనసులో ఆలోచనలో నాదే మొదటి స్థానం ఇప్పుడు నా స్థానం ఎక్కడో నాకే తెలియడం లేదు వెతుక్కోవాల్సి వస్తుంది అందుకు కారణం ఎవరో కాదు అని నేను ఇప్పుడు పేరు చెప్పాలని అనుకోవడం లేదు వాళ్లే తెలుసుకుంటే చాలు అని అభి అంటాడు..

Intinti Gruhalakshmi 13 September Today Full Episode
Intinti Gruhalakshmi 13 September Today Full Episode

ఐ లవ్ యు అంకిత అని అభి అంటాడు.. అభి స్పీచ్ తో వేడెక్కిన వాతావరణం కూల్ చేయడానికి దివ్య స్లిప్ వస్తుంది. దానికి ఇష్టమైన యాక్టర్ డైలాగ్స్ చెప్పాలని ఉంటుంది. దివ్య బాలయ్య బాబు డైలాగ్స్ తో ఆ వాతావరణం కూల్ చేస్తుంది.. ప్రేమ్ కి ప్రేమలో ఉన్న జంట గొడవపడితే ఎలా ఉంటుందో చూపించాలి అని స్లిప్ వస్తుంది.. నిజంగా ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ ప్రేమించట్లేదని ఇప్పుడే అర్థం అయింది శృతి గొడవ స్టార్ట్ చేస్తుంది పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. నటించింది నువ్వు.. బ్లేమ్ చేస్తుంది నన్ను అంటూ ప్రేమ్ శృతి గొడవపడతారు వాళ్ళిద్దరి మాటలు ఉంటూ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది