Inaya : ఇనయ సుల్తానా ఒకప్పుడు ఈ పేరు ఎవ్వరికీ తెలియకపోవచ్చు.. ఆర్జీవీ హీరోయిన్ గా కాస్త గుర్తింపు పొందింది.. కానీ బిగ్ బాస్ ఇనయ అంటే మాత్రం ప్రేక్షకులు పడి చచ్చిపోయేంత అభిమానాన్ని సొంతం చేసుకుంది.. అనూహ్యంగా 14వ వారం ఎలిమినేట్ అయిన ఇనయ కు బయటకు వచ్చాక ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించుకుంది..

ఆర్జీవీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇనయ బిగ్ బాస్ హౌస్ లో లేడీ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇనయ ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. మూడో వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ఇనయ ఏకంగా 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చినా కూడా ఇనయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇనయ ఇన్స్టాగ్రామ్ లో తాజాగా పెట్టిన స్టేటస్ లో ఇనయ బిగ్ బాస్ లో ఉన్న మోస్ట్ పాపులర్ ఫోటోస్ అన్నింటినీ కలిపి ఒక ఫోటో చేసి బిగ్ బాస్ ఇనయ క్వీన్ అని పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇనయ అభిమానులకు ఈ పోస్ట్ విజువల్ ట్రీట్ అందిస్తోంది..