Inaya : రేవంతు నన్ను అక్కడ గట్టిగా నొక్కాడు.. అవి చూపించడం లేదే అంటూ ఫైర్.. ఇనయా..!

Inaya : ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ ఈవారం పూర్తి కాబోతున్న విషయం తెలిసిందే. 14వ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇనయా ఎలిమినేట్ అవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ఈ షో ఫేక్ షో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే అందరూ టైటిల్ విన్నర్ అనుకుంటున్నా రేవంత్ గురించి ఇనయ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రేవంత్ క్యారెక్టర్ ఇంత వైలెంటా అని కూడా అనిపించక మానదు.. ఎలిమినేట్ అయిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఇనయ మాట్లాడుతూ.. బిగ్బాస్ ఒక ఫేక్ అంటూ సంచలన కామెంట్లు చేసింది.

Inaya says badly about big boss Revanth..!
Inaya says badly about big boss Revanth..!

ఇనయ మాట్లాడుతూ. బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొత్తం రేవంత్ ఫేవర్గా సాగింది . హౌస్ లో అతడు చేసిన దారుణాలు ఎపిసోడ్స్ లో చూపించలేదు అని తెలిసింది.. తాను ఒక అమ్మాయి అని కూడా చూడకుండా తనతో కఠినంగా వ్యవహరించాడు అని, తన మెడ , ముఖంపై ఉన్న గాయాలు ఆమె చూపించింది. రేవంత్ వల్ల తనకు దెబ్బలు తగిలాయని.. గొంతు మీద చేతులు పెట్టి నొక్కాడు అని.. ఒకేసారి కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు.. ఎత్తి నేలకేసి కొట్టాడు.. ఇవేవీ ఎపిసోడ్లో చూపించలేదు నా ఒంటినిండా దెబ్బలు తగిలాయి. ఎలాగో టైటిల్ విన్నర్ రేవంత్ కాబట్టి అతని గురించి తప్పుగా చూపించరు అంతా మోసం అంటూ ఇనయా బాధపడింది.