TV Anchor : బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో ఫీమేల్ యాంకర్స్ ఎంత పాపులారిటీ దక్కించుకుంటున్నారో అంతే స్థాయిలో మేల్ యాంకర్స్ కూడా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సోషల్ మీడియా ద్వారా గ్లామర్ షో చేస్తూ అడప దడపా సినిమాలు చేస్తూ తమకంటూ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. కానీ మేల్ యాంకర్స్ మాత్రం ఒకవైపు పలు టీవీ షోలు ఇంకొక వైపు సినిమా ఫంక్షన్లతోపాటు సినిమాలలో హీరోగా కూడా అవతారం ఎత్తి మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై గొప్పగా చెప్పుకోవాల్సిన యాంకర్స్ లలో ప్రదీప్ , రవి , సుధీర్ వంటి వారు ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు.

అయితే ఇప్పుడు వీరి ముగ్గురిలో ఎవరు అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రదీప్ ఒక్కొక్క ఈవెంట్ కి సుమారుగా రూ.5 లక్షల పారితోషకం తీసుకుంటే.. సుదీర్ ఒక్కొక్క ఈవెంట్ కి రూ.4 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక రవి విషయానికి వస్తే వరుస షోలతో బిజీగా ఉండే రవి ఒక సినిమా ఈవెంట్ చేస్తే రూ.3 లక్షల పారితోషకం ఇస్తారట. మొత్తానికైతే ఇండస్ట్రీలోకి వచ్చి పాతుకు పోయి తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాంకర్ ప్రదీప్ అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.