Bigg Boss 7 : ప్రస్తుతం తెలుగులో రేపటితో బిగ్ బాస్ ఆరవ సీజన్ పూర్తి కాబోతోంది . ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది..? హోస్ట్ ఎవరు..? కంటెస్టెంట్లు ఎవరు..? ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఏడవ సీజన్ కోసం నాగార్జున రావడం లేదు అని .. కొత్త హోస్ట్ రాబోతున్నారని ఇప్పుడు స్పష్టం అవుతుంది. నిజానికి బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా రాగా.. ఆ తర్వాత రెండవ సీజన్ కి నాని పోస్ట్ గా వచ్చారు. ఇక మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు హోస్ట్గా నాగార్జున వ్యవహరిస్తూ ఉండడంతో ఆయన హోస్టింగ్ పై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో చూపించిన స్ట్రాటజీ.. పెర్ఫార్మెన్స్.. హుషారు ఇప్పుడు నాగార్జున లో కనిపించడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో నాగార్జున కూడా వచ్చే ఎపిసోడ్ కి హోస్టుగా చేయనని ఖరాకండిగా చెప్పేశారు. దీంతో హోస్ట్ వేటలో పడ్డ బిగ్ బాస్ నిర్వహకులు రౌడీ హీరో విజయ్ దేవరకొండను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన యూత్ ఐకాన్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి స్టార్ హీరో చేత హోస్టింగ్ చెప్పిస్తే బిగ్ బాస్ కు ప్లస్ అవుతుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఎంతవరకు నిజమవుతుందో తెలియదు.. కానీ ప్రస్తుతం అయితే ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి.