Guppedantha Manasu : దూసుకెళ్తున్న గుప్పెడంత మనసు సీరియల్ టిఆర్పి రేటింగ్..! ఈ ట్విస్ట్ ఊహించారా.!?

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు కూడా ఒకటి.. నిన్నటి తో ఈ సీరియల్ 552 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. ఈ సీరియల్ విభిన్న కథా కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లి ధర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో గుప్పెడంత మనసు 10.70 రేటింగ్ సొంతం చేసుకుని రెండవ స్థానంలో నిలిచింది.. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ రెండో స్థానంలో నిలుస్తూ కార్తీకదీపం గట్టి పోటీ ఇస్తోంది.. ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం..!!

వసుధర తన మనసులో ఉన్న ప్రేమను ఎగ్జామ్స్ వరకు దాచుకొని ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంది.. రిషి ఎగ్జామ్స్ అయిపోగానే తనను బయటకు తీసుకువెళ్తాడు.. తన మనసులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటాడు. ఆ తరువాత వసుధార రిషికి ప్రపోజ్ చేస్తుంది. రిషి కూడా వసుధారకు ఐ టు లవ్ యు చెబుతాడు.. గౌతమ్ వీళ్లిద్దరి ప్రేమ సంగతి తెలుసుకొని ఓ స్పెషల్ సర్ప్రైజ్ పార్టీని ఇస్తాడు.. అప్పుడే రిషి వసుధలను ఏదైనా కోరిక కోరుకోమని అడుగుతాడు.. మహింద్రా, జగతిల పెళ్లి రోజు పార్టీ మీ చేతులతో చేయమని అడుగుతుంది వసుధర..

Guppedantha Manasu Serial TRP Rating
Guppedantha Manasu Serial TRP Rating

మహింద్రా, జగతిల పెళ్లి రోజు పార్టీ చేయడానికి రిషి ఒప్పుకుంటాడు.. దేవయాని మహింద్రా, జగతిల పెళ్లి రోజు పార్టీ చేయడానికి రిషి ని ఒప్పించమని చెబుతుంది. ఈ విషయం తెలుసుకున్న మహీంద్రా, జగతి ఇద్దరు షాక్ అవుతారు. ఖచ్చితంగా దేవయానికి ఏదో ఉండే ఉంటుంది అని జగతి అనుకుంది. మహేంద్ర కూడా అదే విధంగా ఆలోచిస్తాడు.. మహింద్రా, జగతిల పెళ్లి రోజు పార్టీ లో కచ్చితంగా దేవయాని ఏదో కుట్ర చేస్తుంది. అప్పటివరకు దేవయాని అందరితో మామూలుగానే ఉంటుంది కానీ ఫంక్షన్ లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇస్తుంది.. ఇదే వచ్చేవారం హైలెట్స్ కానుంది..

Advertisement