Guppedantha Manasu 29 August 2022 Episode : మహీంద్రా, గౌతమ్ కి నిజం చెప్పేసిన రిషి.. వసుధర రిషిని చూసి ఏం చేసిందంటే.!?

Guppedantha Manasu 29 August 2022 Episode : రిషి నిద్రలేచేసరికి బెడ్ పక్కన ఒకవైపు మహీంద్రా.. మరోవైపు గౌతమ్ కూర్చుని ఉంటారు.. నువ్వు మాకు ఈరోజు ఓ విషయంపై క్లారిటీ ఇవ్వాలని వాళ్ళిద్దరూ అడుగుతారు.. వసుధారని నువ్వు నిన్న కలిసావు కదా ఏం జరిగింది చెప్పమని అడుగుతారు.. వసుధర చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నావని మహీంద్రా అడుగుతాడు.. కచ్చితంగా వసుధర రిషికి ప్రపోజ్ చేస్తుందని.. మహీంద్రాకు తెలుసు.. వెంటనే రిషి వసుధార నేను చెప్పిన దానికి ఓకే అనింది.. ఇంతకీ వసుధరకు నువ్వు ఏం చెప్పావు అని మహీంద్రా అడుగుతాడు.. తను మనకి మన కాలేజ్ కి దొరికిన ఆణిముత్యం.. తనకి బాగా చదువుకోమని యూనివర్సిటీ టాపర్ అవ్వాలని చెప్పాను.. తను కచ్చితంగా మన కాలేజ్ పరువు నిలబడుతుంది అని చెబుతాడు రిషి.. ఇదేనా నువ్వు చెప్పింది వసుధారాకి అని మహీంద్రా డౌట్ గా అడుగుతాడు..

ఇదే చెప్పాను అని అంటాడు రిషి.. థాంక్యూ మై సన్ .. లవ్ యు మై సన్ అని చెప్పి మహీంద్రా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. వసుధార కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా రిషి దారిలో కార్ దగ్గర నుంచోన్ని కనిపిస్తాడు వసుధర తన ఫ్రెండ్ తో నడుచుకుంటూ వెళ్తుంది తను ఋషి సార్ అక్కడ ఉన్నారు అని చెబుతుంది కానీ పసుధార మాత్రం రిషిత మాట్లాడదు ఏమైంది వస్దారా నీకు ఈరోజు విశేషాలు కనిపిస్తే మాట్లాడవేంటి అని అంటుంది కొన్ని కొన్ని సార్లు అంటే మనం కావాలనుకున్నవారు ఎదురుగా కనిపించినా కూడా మాట్లాడలేము అలాంటి పరిస్థితి వచ్చింది అని వసుధార మెట్ట వేదాంతం చెబుతుంది తను ఏం మాట్లాడకుండా మౌనంగా రిషిని దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది.. జగతి మేడం వసుధర కోసం నోట్స్ ప్రిపేర్ చేస్తుంది.. అది ఇవ్వడానికి జగతి వెళ్తున్నాను అని చెప్పాగానే.. జగతి మేడం తో పాటు రిషి వస్తాను అని అంటాడు.. తరువాత వసుకి ఇచ్చిన మాట ప్రకారం రిషి కలవకుడదని ఆగిపోయాడు..

Guppedantha Manasu Serial 29 August 2022 Today Full Episode
Guppedantha Manasu Serial 29 August 2022 Today Full Episode

రిషి సార్ కార్ సౌండ్ వినగానే.. వసుధార రిషి సార్ వచ్చారేమో అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది.. కానీ జగతి, గౌతమ్ ను చూసి ఆగిపోతుంది.. జగతి , గౌతమ్ ఇద్దరు కలిసి వసుధర దగ్గరకు వెళ్ళి వసుధర కి ఆల్ ది బెస్ట్ చెబుతారు.. వసుధర ను రిషి డిస్ట్రబ్ చేస్తుంటే.. రిషిని వసుధర డిస్ట్రబ్ చేస్తుంది.. రిషికి ఎక్కడ ఎవరిని చూసినా కూడా వసుధార నే అనిపిస్తుంది.. అలా రిషికి గౌతమ్ కాఫీ తీసుకువచ్చి ఇవ్వగానే వసుధర ఏంటి నువ్వు కాఫీ తీసుకువచ్చి ఇచ్చావ్ అని అంటాడు.. రే రిషి నేను రా గౌతమి అని గౌతమ్ అంటాడు.. వసుధార కూర్చొని చదువుకుంటుంటే రిషి తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. తలుపులు తెరిచి చూడగా బయట కార్ దగ్గర రిషి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక గౌతమ్ దగ్గర నుంచి రిషి కిందకు నడుచుకుంటూ వచ్చేటప్పుడు హాల్లో వసుధార కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇది కూడా భ్రమ లేదంటే నిజంగా వసుధార వచ్చిందా అనేది తర్వాయి భాగంలో చూడాలి..

Advertisement