Guppedantha Manasu: జగతి మనసు తెలుసుకున్న రిషి.. పెళ్లి రోజు ఫంక్షన్ చేయడానికి ఒప్పుకున్నాడా.!?

Guppedantha Manasu: జగతి, మహీంద్రాల పెళ్లిరోజు రేపని వసుధార చెబుతుంది.. ఎలాగైనా వాళ్ళిద్దరి పెళ్లిరోజు ఫంక్షన్ ని చేస్తే బాగుంటుంది అని వసుధర అడుగుతుంది.. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం మాత్రమే నా నిర్ణయం అని మిమ్మల్ని బలవంతం చేస్తూ ఏదీ చేయించాలని నా ఉద్దేశం కాదు అని.. మీరు ఇష్టపూర్వకంగా చేస్తే బాగుంటుంది అని వసుధర తన మనసులోని మాటను రిషికి చెబుతుంది..

Guppedantha Manasu Serial 09 September 2022 Today Full Episode
Guppedantha Manasu Serial 09 September 2022 Today Full Episode

జగతి తన రూమ్ లోకి వచ్చిన ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మహీంద్రా వచ్చి జగతి మేడం మీకు ఒక సర్ప్రైజ్ అంటూ ఓ గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తాడు.. ఏంటిది మహీంద్రా అని జగతి అడుగుతుంది.. పెళ్లిరోజుకి గిఫ్ట్ అని మహీంద్రా అంటాడు.. మనం దూరం అయ్యి చాలా రోజులు అయింది.. అసలు మన పెళ్లి బంధం ఉన్న సంగతి కొన్నాళ్లు పాటు మనకి గుర్తులేదు.. ఇప్పుడైనా నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు.. ఆ బంధానికి గుర్తుగా చిన్న కానుక కూడా ఇవ్వకూడదని మహీంద్రా అంటాడు..

మహీంద్రా ఇప్పుడు ఇవేమీ వద్దు అని జగతి అంటుంది.. ముందు రిషి వసుధారా ల బంధంను మనం గౌరవించాలి.. వాళ్ళిద్దరూ ఏమవుతారో అని జగతి అంటున్నా మాటలు రిషి ఓ పక్క నుంచి వింటూ ఉంటాడు.. ఇప్పుడు మనం పెళ్లిరోజు చేసుకుంటే రిషికి నచ్చుతుందా.. నచ్చదు అని జగతి అంటాడు.. రిషి మనిషిని బాధ పెట్టి మనం ఇప్పుడు ఈ పెళ్లి రోజు చేసుకోవడం అవసరమా అని జగతి అంది. రిషి మనస్సు అద్దం లాంటిది.. మనం పదిలంగా చూసుకోవాలి.. అంతేకానీ బాధ పెట్టకూడదు అని జగతి అన్న మాటలు విని రిషి షాక్ అవుతాడు.. తన మంచి మనసుని అర్థం చేసుకొని మహీంద్రా జగతిల పెళ్లిరోజు ఫంక్షన్ చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి..

Advertisement