Guppedanta Manasu : గుప్పెడంత మనసు సీరియల్ వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఇదే.!?

Guppedanta Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను టీవిల నుంచి కదలనివ్వకుండా కట్టిపడేస్తుంది.. టిఆర్పి రేటింగ్స్ చార్ట్ లో రెండవ స్థానంలో నిలుస్తూ కార్తీకదీపంకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ వారం ఈ సీరియల్ లో జరిగిన ఎపిసోడ్స్ హైలైట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

Advertisement
guppedanta manasu next episode twist super
guppedanta manasu next episode twist super

వసుధార ఇంటర్వ్యూ కి జగతి,

మహేంద్ర ఇద్దరు వస్తారు. జగతి శాలువతో వసుధారని సత్కరిస్తే రిషి వసుధార మెడలో దండ వేసి అభినందిస్తాడు. అందరూ వసుధర గురించి అద్భుతంగా స్పీచ్ ఇస్తారు. ఇక ఇంటర్వ్యూకి నాతో పట్టే నన్ను ప్రోత్సహించిన జగతి మేడం రిషి సార్ ఇద్దరూ నా పక్కన ఉండాలి అని వసుధర అందరి ముందు రిక్వెస్ట్ చేస్తుంది. ఇక ఇంటర్వ్యూ ముగిసే చివరి క్షణంలో మహేంద్ర అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది గమనించిన రిషి మహేంద్రను ఫాలో అవుతాడు. ఇక జగతి కూడా వసుధారా నుంచి తప్పించుకొని బయటకు వస్తుంది. రిషి జగతి తో మీరైనా డాడీని జాగ్రత్తగా చూసుకోమని జగతితో చెబుతాడు.

Advertisement

ఇంతవరకు వచ్చినందుకు థాంక్యూ మేడం అని అంటారు. జగతి కూడా రిషి నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళిపోతుంది. మహేంద్ర కార్లో ఎక్కబోతుండగా రిషి మహీంద్రా చేతిని గట్టిగా పట్టుకుంటాడు. డాడ్ వెళ్ళాడని వీల్లేదని అని ఆపుతాడు. డాడ్ మిమ్మల్ని ఈ రిషి వదిలి ఉండలేడు.. ప్లీజ్ డాడ్ నన్ను వదిలి పెట్టేసి వెళ్ళద్దు అని రిషి రిక్వెస్ట్ చేస్తాడు. మహేంద్ర మాత్రం రిషి తో ఉండటానికి సుముఖత చూపలేదు. మేము వెళ్ళిన దానికి ఇంకా ప్రతిఫలం రాలేదు అని అంటాడు. డాడ్ మీరు నాతో పాటు ఇంటికి రండి అని రిషి అంటాడు. ఇక్కడ వరకు వచ్చాడు. ఇంకా మా డాడ్ ఎప్పటికీ దూరం కారని ఆశ పడ్డాను. మళ్ళీ మీరు ఎందుకు నా నుంచి వెళ్లిపోతున్నారు. నాకు అన్ని మీరే కదా డాడ్.. ఫ్రెండ్ అయినా డాడ్ అయినా అన్ని మీరే కదా.. నేను ఏదో తెలిసో తెలియకో అన్నానో అనుకోండి.. ఇంత పెద్ద శిక్ష వేస్తారా.. నాకు నేనే శిక్ష వేసుకున్న శిక్ష ఇది అని మహేంద్ర అంటాడు.

మహేంద్ర వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తాడు. డాడ్ మీరు వెళ్ళాలి అని అనుకుంటే నేను ఆపును.. మీరు ఇక మళ్ళీ నా దగ్గరకు తిరిగి రావాలి అంటే రేపు ఉదయం వరకు ఆలోచించుకోండి. ఈరోజు రాత్రంతా బాగా ఆలోచించుకొని రేపు ఉదయం సూర్యోదయం కాకముందే నా దగ్గరకు రండి అని రిషి అంటాడు.. మహేంద్ర వెళ్తుండగా రిషి గట్టిగా హత్తుకుంటాడు. మహేంద్ర మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు.

ఇక మహేంద్ర ఇంటికి వెళ్లి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను అని జగతితో అంటాడు. నేను ఇందాకే నీతో పాట ఇంటికి వస్తాను రిషి అని చెప్పేలోపే రిషి కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక రేపొద్దు వరకు ఆగటం నావల్ల కావడం లేదు జగతి అని మహేంద్ర అంటాడు. భయపెట్టేసావు కదా మహేంద్ర. హమ్మయ్య అయితే మనం రిషి దగ్గరికి వెళ్లడం ఖాయం నాకు కూడా అస్సలు నిద్ర పట్టడం లేదు. నేను ఇప్పుడే రెడీ అయి కూర్చుంటాను అని జగతి కూడా అంటుంది.

వసుధర రిషి ని బాల్కనీలోకి రమ్మని మెసేజ్ చేస్తుంది. డాడ్ కోసం ఇన్ని రోజులు ఆగాను కానీ.. రేపొద్దున వరకు ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నాను వసుధర.. డాడ్ తప్పకుండా వస్తారంట అని ఆవేదనతో రిషి వసుధారతో అంటాడు.
రిషి వసుధార ఇద్దరూ బాల్కనీలో మాట్లాడుకుని చేతిలో చేయి వేసుకొని కలిసిన నడుచుకుంటూ కిందికి రావడం దేవయాని చూస్తుంది. వెంటనే ఏంటి నాన్న రిషి ఇప్పటివరకు ఎందుకు పడుకోలేదు అని అడుగుతుంది. నువ్వు కూడా నిద్రపోకుండా కబుర్లు చెబుతున్నావా అంటూ వసుధార మీద ఫైర్ అవుతుంది దేవయాని. నేనే బాల్కనీలోకి వెళ్తే వసుధార వచ్చింది పెద్దమ్మ అని రిషి కవర్ చేస్తాడు. అయినా మహేంద్ర వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడానికి ఏముంది రిషి.. వాళ్ళు రావాలి అనుకుంటే వస్తారు లేదు అంటే లేదు. దానికోసం నీ నిద్రను ఎందుకు పాడు చేసుకుంటావు అని దేవయాని అంటుంది. వాళ్లు కచ్చితంగా వస్తారు మేడం అని వసుధర గట్టిగా చెబుతుంది.

మహేంద్ర జగతి ఇద్దరూ రిషి దగ్గరికి రావడానికి బయలుదేరుతారు. అప్పుడే మహేంద్ర నేను ఏమైనా తప్పు చేశానా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి ఎన్ని రోజులు నా ప్రయత్నాన్ని వృధా చేస్తున్నానా అని అంటాడు. ఇక మహేంద్ర వాళ్ళు వస్తున్న కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయింది అని గౌతమ్ దేవయానికి ఫోన్ చేస్తాడు. తను కాల్ కట్ చేస్తుంది. రిషికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు. వసుధర తో కలిసి మహేంద్ర జగతి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడు. గౌతమ్ కాల్ లిస్ట్ చేసిన రిషి ఏమైందిరా అంటాడు. అర్జెంట్ గా హాస్పిటల్ కి రా రా అని కాల్ కట్ చేస్తాడు. రిషి, వసుధర ఇద్దరు హాస్పిటల్ కి వెళ్ళాక జగతి, మహేంద్ర ను చూసి షాక్ అవుతారు.

రిషి ఇచ్చిన బ్లడ్ డాక్టర్స్ జగతికి సెలైన్ ద్వారా పెడతారు. రిషి బెడ్ మీద నుంచి లేచి జగతి దగ్గరకు వెళతాడు. తనతో అంతకు ముందు జరిగిన సంఘటనలు అన్ని గుర్తుకు చేసుకుంటాడు..రిషి రిషి అని జగతి కలవరిస్తూ ఉంటుంది. నర్స్ మీరు తనకి ఏమవుతారు అని అడుగుతుంది. చూస్తూ ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తుంది. మేడం మీకు ఏం కాదు.. కానివ్వను.. డాడ్ కి మీరంటే ప్రాణం.. మీరిద్దరూ ఆనందంగా ఉండాలి అని అంటాడు. అప్పుడే రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా.. రిషి వేలుని జగతి పట్టుకుంటుంది. రిషి కి అప్పుడే అమ్మ ప్రేమంటే ఏంటో అర్థమవుతుంది. రిషి జగతి చేయిని నిదానంగా కింద పెట్టి .. కంటిలో వస్తున్న నీటిని తుడుస్తాడు. మీకు నాకు మధ్యన జరిగిన వాటిని నేను ప్రస్తవించ దలుచుకోలేదు. రిషి మేం నీ దగ్గరకే వస్తున్నాం అని జగతి అంటున్న మాటలకు.. రిషి జగతి తలపై ప్రేమగా నిమురుతూ.. తన చెవి దగ్గరకు వెళ్ళి మీకు ఏం కాదు అని అంటాడు.. అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతుండగా.. దాహం అని జగతి అనగానే.. రిషి జగతికి మంచి నీళ్ళు తాపించి పెదాలు పై నీటిని తుడుస్తాడు. ఈ దృశ్యాలను బయట నుంచి మహేంద్ర, వసుధర, గౌతమ్ చూసి ఆనందిస్తారు.

రిషి నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నీకు తెలియాలి అని మహేంద్ర అంటాడు. ఇప్పుడు ఇవన్నీ వద్దు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కూడా కాదు. కానీ మహేంద్ర మాత్రం రిషి తో దేవయాని అన్న మాటలు కారణంగా వెళ్ళాను అని మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అందుకే వెళ్ళామని చెబితే సీరియల్ ఇంకో వైపు మలుపు తిప్పుతారు..

Advertisement