Guppedanta Manasu 29 Nov Episode : వసు నేను గెంటేయబడ్డాన్నని చెప్పిన జగతి.. రిషికి ఆ నిజం చెప్పేస్తానని దేవయానిని బెదిరించిన ధరణి..

Guppedanta Manasu 29 Nov Episode : ఫణీంద్ర దేవయానితో అసలు మహేంద్ర జగతి వాళ్ళు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నిదానంగా నైనా మహేంద్రని అడిగి తెలుసుకోవాలి అని దేవయానితో అంటాడు. ఆ పక్కనే ఉన్న ధరణి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి మావయ్య అని అంటుంది. ఈ విషయాన్ని నిదానంగా తెలుసుకుంటాను దేవయాని అని ఫణీంద్ర అనగానే.. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు.. వాళ్ళ ఇంటికి వచ్చేసారు కదా అది చాలు అని దేవయాని అంటుంది. లేదు లేదు కచ్చితంగా తెలుసుకుని తీరుతాను అని ఫణీంద్ర అంటాడు.

Advertisement
guppedanta-manasu-29-nov-episode
guppedanta-manasu-29-nov-episode

ఆ తరువాత ధరణి అత్తయ్య గారు నాకెందుకో మహేంద్ర మావయ్యని జగతి అత్తయ్యని మీరే ఇంట్లో నుంచి పంపించేశారని.. అందరికీ తెలిసిపోతుందేమోనని నాకు భయంగా ఉంది అని ధరణి అంటుంది. ఇక దేవయాని కోపంతో పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి విసిరి కొడుతుంది. ఏంటి ధరణి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి నేను ఎలా కారణం అని అరుస్తుంది. ఒక్క నిమిషం దేవయాని తనని తాను తమాయించుకొని.. అదేంటి ధరణి మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా.. అలాంటప్పుడు మన విషయాలు ఒకరికి చెప్పుకోకూడదు కదా. అయినా వాళ్ళు అడగకముందే నువ్వే ఈ విషయాన్ని అందరికీ చెప్పేటట్టు ఉన్నావు. ఒకవేళ చెప్పాల్సిన సమయం వచ్చినా చెప్పకుండా తప్పించుకోవాలి కానీ ఇలా చేయకూడదు కదా అంటుంది దేవయాని. సరే అత్తయ్య అని ధరణి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మళ్లీ ధరణి అని దేవయాని పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని అడుగుతుంది. నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పవు కదా అని అంటుంది. మీరు నన్ను ఫ్రెండ్ అని అన్న తర్వాత నేను ఎలా చెబుతాను అత్తయ్య అని ధరణి కూల్ గా రియాక్ట్ అవుతుంది. మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది అత్తయ్య అని మనసులో అనుకుంటూ ధరణి వంటగదిలోకి వెళ్ళిపోతుంది.

Advertisement

హాస్పటల్ బెడ్ పై ఉన్న జగతిని వసుధర ఎందుకు మేడం మీరు రిషి సార్ ని వదిలేసి వెళ్ళిపోయారు. రిషి సార్ ఎంత బాధ పడ్డారో మీకు తెలుసా? సార్లు నన్ను ఎన్నోసార్లు మహేంద్ర సార్ ఇంటికి వస్తారా అని అడిగారు. పైకి నేను వస్తారు అని సమాధానం చెప్పినా కానీ లోపల ఏదో తెలియని భయం ఉంది అని చెబుతుంది. ఎందుకు మేడం మీరు వదిలేసి వెళ్ళిపోయారు అని వసుధర అడిగిన ప్రశ్నలకు జగతి.. తనకు మేము శిక్ష వేసాము అని అనుకుంటున్నారు కానీ మేమెంత బాధపడ్డామో నీకు తెలీదు వసు.. మహేంద్ర నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఒక అర్ధాంగిగా నేను నా బాధ్యతను నిర్వర్తించాను అని జగతి చెబుతుంది ..

వసు నీకు తెలుసా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు రిషి చిన్నప్పుడే నేను ఆ ఇంట్లో నుంచి గెంటేయబడ్డాను.. విడాకులు కాగితాలు తీసుకువచ్చి దేవయాని అక్కయ్య నన్ను ఇంట్లో నుంచి గంటేసింది అని వసుధారా కి ఉన్న నిజాన్ని జగతి చెప్పేస్తుంది. నీకో విషయం చెప్పనా వసు.. రిషి చిన్నప్పటినుంచి నన్ను ఏది అడిగినా.. నేను కాదు లేదు అనకుండా ఇచ్చాను. అందుకే మొన్న నీ ఇంటర్వ్యూ అప్పుడు రిషి కాలేజీకి రమ్మని అనగానే నేను వెంటనే రిషి కోసం అక్కడికి వచ్చేసాను. రిషి అడిగితే నేను ఏది కాదు అని అనలేను అని జగతి అవుతుంది.

ఏంటి మేడం మీరు రిషి సార్ రమ్మన్నారని నాకు తెలీదు. నాకోసం మిమ్మల్ని రమ్మని రిషి సార్ మెయిల్ చేశారని.. మీరు నాకోసం వచ్చారా అని వసుధర షాక్ అవుతూ అడుగుతుంది. అవును వసు అని జగతి ఉన్న విషయాన్ని చెబుతుంది. ఇక జగతి డిస్చార్జ్ అవడంతో కార్ లో రిషి పక్కన వసుధర వెనకమాల సీట్ లో మహేంద్ర జగతి ఇద్దరు కూర్చుని ఇంటికి బయలుదేరుతారు

Advertisement