Guppedanta Manasu 28 Oct Episode : రిషి తో నేను మీ నీడన్న వసుధార..! దేవయానిని రిషి దగ్గర అడ్డంగా బుక్ చేసిన వసుధార.!

Guppedanta Manasu 28 Oct Episode : తప్పంతా నాదే అనిపిస్తుంది అని రిషి ఏడుస్తూ గౌతమ్ తో చెబుతాడు.. చిన్నప్పుడు ఆ రెండు అక్షరాల ప్రేమ కి తపించిపోయాను.. ఇప్పుడు అదే ప్రేమ నాకు ఈ బాధ మిగిల్చింది.. వసుధార అడిగిన పిలుపు పిలవడానికి నా మనసులో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు.. ఆ రెండు అక్షరాల పిలుపు వెనుక ఎంత బాధ, వేదన ఉందో ఎవరికి తెలుసు.. నేను ఒక లూసర్ ని గౌతమ్.. ఎంతగా కోరుకుంటునో.. అంతగా కోల్పోయాను.. అని రిషి మాట్లాడుతున్న మాటలను వసుధర తలుపు పక్కన నిలబడి వింటుంది.. వసుధార తన ప్రేమ కూడా ఇంతే కదా.. అది కూడా పోతుంది అని అనే లోపు వసుధార రిషి నోటి నుంచి ఆ మాట రాకుండా తన చేతులతో ఆపుతుంది..

Advertisement
guppedanta-manasu-28-oct-episode
guppedanta-manasu-28-oct-episode

సార్ మీరు అలా మాట్లాడకండి.. ఈ వసుధర మీ నీడ సార్.. ఈ మాట నేను ఎప్పుడో అన్నాను.. రిషిధార బంధం ఎప్పటికీ నిలిచి పోతుంది.. ప్లీజ్ సార్ మీ మనసులోకి ఇలాంటి కొత్త ఆలోచనలు రానివ్వకండి.. ఈ మాట మీరు ఇంకొకసారి అంటే ఈ వసుధార తుది శ్వాస విడుస్తుంది అని అంటుంది. అలా అనకు .. నువ్వు నన్ను ఇంకా బాధ పెట్టకు అని అంటాడు.. నువ్వు ఇంకా ఆ పిలుపు కోసం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటాడు.. ఈ పొగరు కి బుద్ది లేదు అంటుంది.. వసుధార లేచి రిషి ని లేపి నిద్రపొమ్మని చెబుతుంది.. వసుధార ప్రేమంటే శాశ్వతం కాదు.. ప్రేమంటే అంకితం..

Advertisement

దేవయాని రిషికి కాఫీ పెట్టి ఇవ్వబోతుండగా
.. తనే అక్కడికి వస్తాడు.. తాగు రిషి నీకోసమే కాఫీ పెట్టాను అని దేవయాని ఇస్తుంది.. వసుధార ఏది పెద్దమ్మ అని రిషి అడుగుతాడు.. తను ఇంకా లేచిందో లేదో అని అంటుంది.. సరే పెద్దమ్మ నేను ఈ కాఫీ తీసుకువెళ్లి వసుధారకు ఇస్తాను అని రిషి అంటాడు.. ఈమధ్య రిషి బాగా మారిపోతున్నాడు అని ధరణితో అంటుంది దేవయాని.. వసుధార రూమ్ లోకి రిషి వెళ్లేసరికి.. తను జగతి మేడంతో మాట్లాడుతుంది.. మేడం మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు.. మీరు ఇంటికి వచ్చేసేయండి అని వసుధార అంటున్న మాటల్లో రిషి విని వసుధారా అని పెద్దగా పిలుస్తాడు రిషి.. ఆ పిలుపు కి అప్పుడు జగతి మేడం ఇక్కడ లేదు అని ఆ భ్రమలో నుంచి బయటకు వస్తుంది వసుధార.. ఇక రిషి తీసుకొచ్చిన కాఫీని ఇద్దరూ షేర్ చేసుకుని తాగుతారు..

దేవయాని దగ్గరకి వచ్చి వసుధార మీ మనసులో ఏం అనుకుంటున్నారో నాకు బాగా తెలుసు.. మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటున్నారు.. ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు.. కానీ నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను గాక వెళ్ళను. రిషి సార్ ఈ ఇంట్లో నుంచి వెళ్లమనేదాకా వెళ్లను.. ఒకవేళ రిషి సార్ వెళ్ళమని చెప్పినా కూడా.. నాకు అప్పుడు మూడ్ ను బట్టి వెళ్ళాలి అనిపిస్తేనే వెళ్తాను.. లేకపోతే వేళ్లను అని వసుధార అంటుండగా వసుధారా అని దేవయాని పెద్దగా పిలుస్తుంది.. ఆ శబ్దానికి రిషి తన రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఏంటి పెద్దమ్మ వసుధార ను ఏదో అడుగుతున్నట్టు ఉన్నారు అని అంటాడు .. అది అని దేవయాని నసుగుతుండగా నేను చెప్తాను ఉండండి మేడం అని వసుధారా.. సార్ నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను అని.. మేడం చెబుతున్నారు అని వసుధార దేవయానిని అడ్డంగా రిషి దగ్గర బుక్ చేస్తుంది.. నేను ఇక్కడే మీ దగ్గరే ఉన్నానని మేడం సంతోష పడుతున్నారు.. ఇలాగే ఎప్పటికీ చూసుకోమని చెప్పారు కదా మేడం అని దేవాయని ని చూస్తూ అంటుంది వసుధార.. హా.. అని ఒక స్మైల్ ఇస్తుంది..

Advertisement