Guppedanta Manasu 28 Nov Episode : దేవయాని పై విరుచుకుపడ్డ మహేంద్ర.! గౌతమ్ ను అసహ్యించుకున్న రిషి..!

Guppedanta Manasu 28 Nov Episode : రిషి నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నీకు తెలియాలి అని మహేంద్ర అంటాడు. ఇప్పుడు ఇవన్నీ వద్దు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కూడా కాదు. లవ్ యు డాడ్ మీరు ఎప్పుడు నాతోనే ఉండండి అని రిషి అంటాడు. అంతలో ఫణింద్ర, దేవయాని ఇద్దరు హాస్పిటల్ కి వస్తారు.. ఇంకేం ఇద్దరు కలిసిపోయారు అనమాట అని దేవయాని మనసులో అనుకుంటుంది..

Guppedanta Manasu 28 Nov today full Episode
Guppedanta Manasu 28 Nov today full Episode

జగదీష్ స్పృహ లోకి వచ్చి రిషి తనకు బ్లడ్ ఇచ్చాడు అని తెలిసి సంతోషిస్తుంది. నాకు ఇంతకంటే గొప్ప ఆనందం, గొప్ప బహుమతి ఇంకా ఏం వద్దు మహేంద్ర.. ఇది చాలు నా కొడుకు రిషి నాకు బ్లడ్ ఇచ్చాడు అంటూ జగతి ఆనందంలో తేలిపోతూ ఉంటుంది. అంతలో దేవయాని అక్కడికి వస్తుంది. ఏం జగతి స్పృహలో లేనట్టు బాగానే నాటకం ఆడావే అని అంటుంది. వదిన గారు మీరు సరిగ్గా మాట్లాడండి. మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా.. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాటకం అని అంటారు ఏంటి మహేంద్ర దేవయాని పై విరుచుకుపడతాడు. అయినా తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. మీకు ఇలా మాట్లాడటానికి మనసు ఎలా ఒప్పింది అని మహేంద్ర దేవయానిపై రివర్స్ అవుతాడు. ఇక చర్చలు ఓ రేంజ్ లోకి వెళ్ళిన తర్వాత దేవయాని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే రిషి ఫణీంద్ర అక్కడికి వస్తారు. వసుధర జగతిని చాలా జాగ్రత్తగా చూసుకో అని దేవయాని వాళ్ల ముందు ఓవరాక్షన్ చేస్తుంది.

జగతిని డిస్చార్జ్ చేస్తామని హాస్పిటల్ మేనేజ్మెంట్ చెబుతారు. ఇంటికే తీసుకెళ్తామని రిషి అంటాడు. అందుకు కావలసిన ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన.. తర్వాత మీరు తనని తీసుకు వెళ్లచ్చని డాక్టర్లు చెబుతారు. వసుధర క్యాంటీన్ లో రిషికి టిఫిన్ తీసుకురావాలని వెళ్తుంది. ఇక అక్కడికే వచ్చినా రిషికి వసుధర టిఫిన్ తినిపిస్తుంది. ఏదో మెసేజ్ వచ్చిందని ఇప్పుడే వస్తానని రిషి గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. డాడ్ వాళ్ళు నీ దగ్గరే ఉన్నారని తెలిసినా కూడా నాకు నిజం చెప్పకుండా నా బాధను నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ రా నువ్వు.. గౌతమ్ నువ్వు ఇలాంటి వాడివని నేను అసలు అనుకోలేదు అని రిషి గౌతమ్ లో చెడమడ వాయిస్తాడు. ఒకసారి నేను చెప్పేది వినరా.. ఒక్కసారి నేను చెప్పేది వినరా అని గౌతమ్ ఆ మాటలే పదేపదే చెబుతాడు.. ఇప్పుడు నేను ఏమైనా అన్నానా? అని గౌతమ్ రిషి ని అడుగుతాడు.. ఏం లేదు అని రిషి అంటాడు.. ఓహో ఇదంతా నా కల అని అనుకుంటాడు గౌతమ్.

మహేంద్ర నాకేం కాదు. నువ్వు రిషి గురించి ఆలోచిస్తూ ఉండు అని జగతి అంటుంది. జగతి రిషి నన్ను నిలదీసి ప్రశ్నించచ్చు.. కానీ వాడు అలా చేయలేదు.. వాడిని చూస్తున్నా ప్రతి సారి మనసులో ఏదో కలుక్కుమంటుంది. మనం ఇంత దూరంగా ఉన్న నేను అనుకున్నది జరగలేదని అనిపిస్తుంది జగతి అని మహేంద్ర అంటాడు. మనం కోరుకున్న మార్పు వస్తే బాగుండేది అని మహేంద్ర అంటాడు. రిషి కళ్ళలో సంతోషం తప్ప బాధ నేను చూడలేను.. ఇంటికి వెళ్దాం మహేంద్ర అని జగతి అంటుంది. ఇంత పెద్ద యాక్సిడెంట్స్ అయ్యాక ఇప్పుడు ఇంటికి అంతవెంటి జగతి.. మనసుకి అయిన గాయం కంటే ఇది చాలా చిన్నది మహేంద్ర అని జగతి అంది. నువ్వు రిషి నీరు చేప లాంటి వాళ్ళు.. మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు..