Guppedanta Manasu 26 Nov Episode : పేగు బంధం అంటే ఇదే..! మహేంద్ర రిషికి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం అదే అని చెప్పేసాడు.!

Guppedanta Manasu 26 Nov Episode : గౌతమ్ మహేంద్ర ఇద్దరు బయట కూర్చుంటారు. ఏంటి గౌతమ్ ఇలా జరిగింది. గౌతమ్ మేము మీ ఫ్లాట్ లో ఉన్నానన్న సంగతి ఎప్పటికీ తెలియనివ్వను అని మహేంద్ర మాట ఇస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంకుల్ అంటడు గౌతమ్. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కి ఎలాంటి మచ్చ రాకుండా నేను చూస్తాను అని మహేంద్ర అంటాడు..వసుధార జగతి దగ్గరికి వెళ్లి మేడం మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు.. కొడుకుగా అది అతని బాధ్యత కదా అని వసుధర ఎమోషనల్ అవుతుంది. వసుధ డాడ్ కి మేడం బాగానే ఉన్నారని చెప్పు అని రిషి అంటాడు..వసుధర రా అమ్మా కూర్చో.. థ్యాంక్యూ.. అని మహేంద్ర అంటాడు. రిషి ఎలా ఉన్నాడు అని మహేంద్ర అడుగుతాడు. తల్లి రుణం తీర్చుకుంటున్నాడు అని వసుధర చెబుతుంది.. సరే జగతి దగ్గరకి వెళ్దాం పద అని మహేంద్ర అంటాడు.

Advertisement
Guppedanta Manasu 26 Nov today full Episode
Guppedanta Manasu 26 Nov today full Episode

 

Advertisement

రిషి ఇచ్చిన బ్లడ్ డాక్టర్స్ జగతికి సెలైన్ ద్వారా పెడతారు. రిషి బెడ్ మీద నుంచి లేచి జగతి దగ్గరకు వెళతాడు. తనతో అంతకు ముందు జరిగిన సంఘటనలు అన్ని గుర్తుకు చేసుకుంటాడు..రిషి రిషి అని జగతి కలవరిస్తూ ఉంటుంది. నర్స్ మీరు తనకి ఏమవుతారు అని అడుగుతుంది. చూస్తూ ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తుంది. మేడం మీకు ఏం కాదు.. కానివ్వను.. డాడ్ కి మీరంటే ప్రాణం.. మీరిద్దరూ ఆనందంగా ఉండాలి అని అంటాడు. అప్పుడే రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా.. రిషి వేలుని జగతి పట్టుకుంటుంది. రిషి కి అప్పుడే అమ్మ ప్రేమంటే ఏంటో అర్థమవుతుంది. రిషి జగతి చేయిని నిదానంగా కింద పెట్టి .. కంటిలో వస్తున్న నీటిని తుడుస్తాడు. మీకు నాకు మధ్యన జరిగిన వాటిని నేను ప్రస్తవించ దలుచుకోలేదు. రిషి మేం నీ దగ్గరకే వస్తున్నాం అని జగతి అంటున్న మాటలకు.. రిషి జగతి తలపై ప్రేమగా నిమురుతూ.. తన చెవి దగ్గరకు వెళ్ళి మీకు ఏం కాదు అని అంటాడు.. అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతుండగా.. దాహం అని జగతి అనగానే.. రిషి జగతికి మంచి నీళ్ళు తాపించి పెదాలు పై నీటిని తుడుస్తాడు. ఈ దృశ్యాలను బయట నుంచి మహేంద్ర, వసుధర, గౌతమ్ చూసి ఆనందిస్తారు.

పదండి అంకుల్ లోపలికి వెళ్దామని గౌతమ్ అంటాడు వద్దు గౌతం వాళ్ళిద్దర్నీ అలాగే ఉండని మనందరం వాళ్ళని కలుపుదాం అని అనుకున్నాము. మనము ఎవ్వరం గౌతమ్ వాళ్ళని కలపడానికి.. పేగు బంధమే వాళ్ళిద్దర్నీ కలిపింది. అదే పేగు బంధం అంటే.. వాడి రక్తమే రక్త బంధాన్ని నిలబెట్టింది అని మహేంద్ర అంటాడు. వసుధార కూడా మనసులో నేనెవర్ని సార్ మీ ఇద్దరినీ కలపాలని అనుకోవడానికి.. మీ బంధమే మిమ్మల్ని కలిపింది అని అనుకుంటుంది.. అప్పుడే ఫణీంద్ర, దేవయాని హాస్పిటల్ కి వస్తారు. ఎటు వెళ్ళాలి అని గౌతమ్ కోసం చూస్తుంటారు..

రిషి నేను ఎందుకు వెళ్ళనో.. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నీకు తెలియాలి అని మహేంద్ర అంటాడు. ఇప్పుడు ఇవన్నీ వద్దు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కూడా కాదు. అయినా మీరు నాకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పటికీ మీరు నన్ను వదిలిపెట్టకి వెళ్ళకండి డాడ్ అని రిషి అంటాడు. మహేంద్ర దేవయాని చేసిన కుట్ర గురించి చెబుతాడా లేదా అనేది చూడాలి.

Advertisement