Guppedanta manasu 25 Nov Episode : ఒక్కటైనా తల్లి కొడుకు.. కన్నీళ్లు పెట్టించే హైలైట్ ఎపిసోడ్..! రేపటికి సూపర్ ట్విస్ట్.!

Guppedanta manasu 25 Nov Episode :  గౌతమ్ రిషి కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వసుధరకి ఫోన్ చేస్తాడు. ఎవరు వసుధర ఫోన్ చేస్తుంది.. డాడ్ వాళ్ళేనా అని అనుకుంటూ వసుధార చేతిలో ఉన్న ఫోన్ రిషి తీసుకుంటాడు. తీరా చూస్తే గౌతమ్ కాల్ చేస్తాడు. వీడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేస్తాడు. రేయ్ రిషి నేను నీకు చాలా సార్లు కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయబోయే సరికి వసుధర కి ఫోన్ చేశాను.. నేను ఇందాక కాల్ వచ్చిందని అర్జెంటుగా హాస్పిటల్ కి వచ్చాను కదా.. నువ్వు అక్కడికి అర్జెంటుగా రావాలి. ప్లీజ్ అర్థం చేసుకో నేను లొకేషన్ పంపిస్తున్నాను రమ్మని గౌతమ్ చెబుతాడు.. అసలు నేను ఉన్న పొజిషన్ ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని రిషి అంటాడు..

Advertisement
guppedanta-manasu-25-nov-episode
guppedanta-manasu-25-nov-episode

నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్ళవా అని గౌతమ్ రిషి ని రిక్వెస్ట్ చేస్తాడు. అసలు గౌతమ్ సార్ ఇన్నిసార్లు కాల్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది అని వసుధార అంటుంది. ఇద్దరం వెళ్దాం అని వసుధర రిషి ఇద్దరు హాస్పటల్ కి బయలుదేరుతారు.. ఇద్దరు రాగానే గౌతమ్ ఐసియూ రూమ్ కి రమ్మని చెబుతాడు. రేయ్ నీకు ఏమైనా అయిందా అంటాడు రిషి.. అంకుల్ అని గౌతమ్ మసుగుతూ ఉండగా డాడీ వాళ్లు ఇంకా రాలేదు అని అంటాడు. అంకుల్ అని మళ్లీ అనగానే డాడీ వాళ్లకు ఏమైంది. మర్యాదగా చెప్పు అని రిషి అంటాడు. గౌతమ్ ఏం మాట్లాడకుండా ఐసీయూ రూమ్ వైపు చూస్తాడు చూసి రిషి వసుధర ఇద్దరు షాక్ అవుతారు.

Advertisement

డాడ్ అంటూ రిషి ఏడుస్తాడు. డాడ్ కి ఏమైంది ఆ కట్లు ఏంటి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. డాడ్ డాడ్ ఏమైంది మీకు.. రిషి సారీ నాన్న.. నన్ను క్షమించు.. అని మహేంద్ర అంటాడు. నీ దగ్గరకి వస్తుంటే యాక్సిడెంట్స్ అయ్యింది. నిన్ను బాధ పెట్టినందుకు నాకు ఆ దేవుడు ఈ శిక్ష వేశాడు అని మహేంద్ర అంటాడు. సార్ మేడం అని వసుధర అడుగుతుంది. పక్కనే జగతి క్రిటికల్ పొజిషన్ లో ఉందని చెబుతారు. మేడం మేడం మాట్లాడింది అంటూ వసుధర ఏడుస్తుంది.

అంతలో డాక్టర్స్ వచ్చి జగతి కి చాలా బ్లడ్ లాస్ అయింది అని ఇందాక ఆ యెల్లో షర్ట్ అతనికి చెప్పాను. O -ve అని కూడా చెప్పాను కదా అని డాక్టర్స్ అంటాడు. నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను అని రిషి అంటాడు. రక్తం పంచిన అమ్మకి నీ రక్తం పంచుతున్నవా రిషి అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. రిషి జగతికి బ్లడ్ ఇస్తాడు. వసుధర జగతి నీ చూసి ఏడుస్తుంది. హేయ్ వసుధర మేడం కి ఏం కాదు. మేడం కి ఏం కాదు.. నేను ఉన్నాను కదా అని రిషి అంటాడు. గౌతమ్ మహేంద్ర ఇద్దరు బయట కూర్చుంటారు. ఏంటి గౌతమ్ ఇలా జరిగింది. రిషి

వసుధార జగతి దగ్గరికి వెళ్లి మేడం మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు కొడుకుగా అది అతని బాధ్యత కదా అని వసుధర ఎమోషనల్ అవుతుంది. రిషి జగతి దగ్గర నుంచి వెళ్ళిపోతుండగా రిషి వేలుని జగతి పట్టుకుంటుంది. రిషి రిషి అని జగతి కలవరిస్తూ ఉంటుంది. రిషి జగతి తలపై ప్రేమగా నిమురుతూ.. అమ్మని ముద్దు పెట్టుకోబోతాడు.. ఈ దృశ్యాలను బయట నుంచి మహేంద్ర, వసుధర, గౌతమ్ చూసి ఆనందిస్తారు ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Advertisement