Guppedanta Manasu 24 Nov Episode : వసుధర డాడ్ తప్పకుండా వస్తారంట అని ఆవేదనతో రిషి వసుధారతో అంటాడు.తప్పకుండా వస్తారు సార్ మీరు కంగారు పడకండి ఆల్రెడీ బయలుదేరే ఉండి ఉంటారు కదా అని రిషి వాళ్ళ అమ్మానాన్నల కోసం అటు ఇటు ఎదురు చూస్తూ ఉంటాడు..

అప్పుడే దేవయాని వచ్చి మహేంద్ర వాళ్ళు నిన్ను కాదనుకొని వెళ్లిపోయారు రిషి.. నీకు ఆ విషయం అర్థం కావడం లేదు నీకోసం నీ గురించి ఆలోచించని వాళ్లకోసం నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని దేవయాని మహేంద్ర వాళ్ళ పై లేనిపోనివన్నీ ఎక్కేసి చెబుతుంది. అది కాదు పెద్దమ్మ డాడ్ కచ్చితంగా వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది నా మీద డాడీకి చాలా ప్రేమ ఉంది. కచ్చితంగా వస్తారు మీరు చూస్తూ ఉండండి అని రిషి కాన్ఫిడెంట్ గా దేవయాని తో చెప్తాడు..
మహేంద్ర జగతి ఇద్దరూ రిషి దగ్గరికి రావడానికి బయలుదేరుతారు. అప్పుడే మహేంద్ర నేను ఏమైనా తప్పు చేశానా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి ఎన్ని రోజులు నా ప్రయత్నాన్ని వృధా చేస్తున్నానా అని అంటాడు. మహేంద్ర జగతి వెళుతున్న కారికి యాక్సిడెంట్ అవుతుంది ఇక వాళ్ళిద్దరినీ హాస్పిటల్లో చేయిస్తారు హాస్పిటల్ నుంచి గౌతమ్ కి ఫోన్ వస్తుంది గౌతమ్ వెళ్లి ఇదంతా చూసి కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెబుతాడు. యాక్సిడెంట్ అయింది అని గౌతమ్ దేవయానికి ఫోన్ చేస్తాడు. తను కాల్ కట్ చేస్తుంది. రిషికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు. వసుధర తో కలిసి మహేంద్ర జగతి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.