Guppedanta Manasu 22 Oct Episode : దేవయానిని అనుమానించిన రిషి.. మీరే ఏదో చేశారు.. వసుధర సూపర్ స్కెచ్..

Guppedanta Manasu 22 Oct Episode :   బయటికి వెళ్తున్నారని జాలీ ట్రిప్ అనుకున్నా.. డాడ్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి..  డాడ్ కి నేనంటే ఇష్టం.. తను నన్ను వదిలేసి వెళ్ళిపోరు.. పెద్దమ్మ మీకు దండం పెడతాను మీరు డాడ్ ను ఏమైనా అన్నారా.. ఏం అన్నారో చెప్పండి.. పెద్దమ్మ మీరు నాకు నిజం చెప్పండి డాడికి మీకు ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి కదా ఖచ్చితంగా ఏదో జరిగింది అదేంటో నాకు నిజం చెప్పండి అని దేవయానిని నిలదీస్తాడు..

guppedanta-manasu-22-oct today full episode
guppedanta-manasu-22-oct today full episode

వసుధర నిద్రలేచేసరికి జగతి మేడం చాలా ఫైల్స్ పంపిస్తారు.. ఇదేంటి మేడం నాకు ఇన్ని ఫైల్స్ పంపించారు అని వసు అనుకుంటుంది.. కానీ వాటి కింద ఇకనుంచి ఈ ఫైల్స్ అన్ని నువ్వే చూసుకోవాలి అని రాసి ఉంటుంది. ఎందుకు మేడం నాకు ఈ ఫైల్స్ పంపించారు అని వసు జగతికి కాల్ చేస్తుంది.. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది.. సరే కాలేజీకి వెళ్ళాక ఈ విషయం మాట్లాడదామని అనుకొని కాలేజ్ కి వస్తుంది వసుధర.. అంతలో గౌతమ్ వచ్చి మహీంద్రా జగతి మేడం ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని చెబుతారు.. ఇకనుంచి నువ్వే రిషి ను చూసుకోవాలి.. పెద్దమ్మ రిషిని కంట్రోల్ చేస్తున్న తను కంట్రోల్ అవ్వడం లేదు.. నువ్వే రిషి ని జాగ్రత్తగా చూసుకోవాలి అని గౌతమ్ అంటాడు.. అదేంటి సార్ మేడం   ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటి.. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని వసుధార అడుగుతుంది..

రిషి ఫోటో దగ్గర వెళ్తున్నాం అని మహీంద్రా రాసిన మాట చూసి తనలో తానే బాధ పడతాడు.. ఏంటి పెద్దమ్మ ఇదంతా డాడ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అని రిషి అంటాడు. నీ మీద మహేంద్రకు ప్రేమ ఉంటే ఆ జగతిని ఇంట్లో నుంచి పంపించేసి  నీ కోసం ఇంట్లోనే ఉండేవాడు కదా..

అలా జరగలేదు అంటే  ఏంటి నీ మీద ప్రేమ లేనట్టే కదా అని దేవయాని రిషికి విషం నూరిపోస్తుంది.. లేదు పెద్దమ్మ డాడ్ కు నేనంటే ఆకాశమంత ప్రేమ.. నామీద కోపం చూపించలేక ఒక్క మాట అనలేక తనలో తనే బాధపడతాడు.. తనను తను శిక్షించుకుంటాడు.. లేదు నాన్న రిషి మహీంద్రా

నీకు దూరమవుతున్నాడు.. ఆ జగతి ఏదో చేస్తుంది అని దేవయాని అంటుండగా.. లేదు పెద్దమ్మ డాడీకి నేను అంటే చాలా ఇష్టం అయినా తను నన్ను తిట్టే హక్కు ఉంది కదా.. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా అని రిషి అంటాడు..

పెద్దమ్మ డాడ్ వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరు చూశారు కదా.. అలా వెళ్ళిపోతుంటే మీరు ఎలా ఊరుకున్నారు.. కనీసం ఆపాలి కదా.. నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని రిషి దేవయానిని నిలదీస్తాడు.. చూస్తే ఆపాలి కదా.. ఎక్కడికి వెళ్తారు.. ఏం చేస్తారు అని రిషి అంటాడు.. మహీంద్రా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.. జగతి మేడం కి కాల్ చేస్తాడు తన నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది పెద్దమ్మ.. అంతలో సార్ సార్ అంటూ వసుధర వస్తుంది.. వసుధర మా డాడ్ ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా అని అడుగుతాడు.. అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మీరు టెన్షన్ పడకండి అని వసు అంటుంది..

రండి సార్.. మీరు రిలాక్స్ అవ్వండి అని అంటుంది..   వసుధర తనని పైకి తీసుకు వెళ్తుండగా వసుధర ఎక్కడికి తీసుకు వెళుతున్నావు అని దేవయాని అడుగుతుంది.. మేడం సార్ కి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అని వసుధర అంటుంది.. నేనా కాఫీ నా అని దేవయాని మళ్ళి అడుగుతుంది.. అవును మేడం స్ట్రాంగ్ కాఫీ అని చెప్పి రిషి ని తన రూమ్ లోకి తీసుకు వెళుతుంది.. వసుధర అన్న మాటలకు   దేవయాని షాక్ అవుతుంది..