Guppedanta Manasu 22 Nov Episode : మహేంద్ర రేపు రిషి కోసం పర్మినెంట్ గా వస్తాడా.!? లేదంటే బంధం తెంపేసుకుంటాడా.!?

Guppedanta Manasu 22 Nov Episode : వసుధార ఇంటర్వ్యూ అందరి మధ్య ఘనంగా జరుగుతుంది. జగతి శాలువతో వసుధారని సత్కరిస్తే రిషి వసుధార మెడలో దండ వేసి అభినందిస్తాడు. అందరూ వసుధర గురించి అద్భుతంగా స్పీచ్ ఇస్తారు. ఇక ఇంటర్వ్యూకి నాతో పట్టే నన్ను ప్రోత్సహించిన జగతి మేడం రిషి సార్ ఇద్దరూ నా పక్కన ఉండాలి అని వసుధర అందరి ముందు రిక్వెస్ట్ చేస్తుంది. సరే అని వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు. నేను ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి నన్ను ప్రోత్సహించింది జగతి మేడమే.

ఈ కాలేజీలోకి నేను ఎన్నో ఆశల మధ్య అడుగు పెట్టాను. మా ఇంటిని నా కుటుంబాన్ని కూడా కాదనుకొని ఈ కాలేజ్ కి నేను వచ్చాను. ఈరోజు యూనివర్సిటీ టాపర్ అయ్యాను అని వసుధర గర్వంగా చెబుతుంది. అందుకు నేను పార్ట్ టైం జాబ్ చేశాను. కష్టపడి చదివాను. ఈ విజయం సాధించడానికి నేను శ్రమ మీద మాత్రమే ఆధారపడ్డాను అని వసుధారా చెబుతుంది. ఇక ఇంటర్వ్యూ ముగిసే చివరి క్షణంలో మహేంద్ర అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది గమనించిన రిషి మహేంద్రను ఫాలో అవుతాడు. ఆగండి అని అంటాడు. అంతలో ఎవరో సెల్ఫీ కోసం రాగా మధ్యలో రిషి ఆగిపోతాడు.

Guppedanta Manasu 22 Nov Episode :
Guppedanta Manasu 22 Nov Episode :

ఇక జగతి కూడా వసుధారా నుంచి తప్పించుకొని బయటకు వస్తుంది. రిషి జగతి తో మీరైనా డాడీని జాగ్రత్తగా చూసుకోమని జగతితో చెబుతాడు. ఇంతవరకు వచ్చినందుకు థాంక్యూ మేడం అని అంటారు. జగతి కూడా రిషి నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళిపోతుంది. మహేంద్ర కార్లో ఎక్కబోతుండగా రిషి మహీంద్రా చేతిని గట్టిగా పట్టుకుంటాడు. డాడ్ వెళ్ళాడని వీల్లేదని అని ఆపుతాడు

డాడ్ మిమ్మల్ని ఈ రిషి వదిలి ఉండలేడు.. ప్లీజ్ డాడ్ నన్ను వదిలి పెట్టేసి వెళ్ళద్దు అని రిషి రిక్వెస్ట్ చేస్తాడు. మహేంద్ర మాత్రం రిషి తో ఉండటానికి సుముఖత చూపలేదు. మేము వెళ్ళిన దానికి ఇంకా ప్రతిఫలం రాలేదు అని అంటాడు. డాడ్ మీరు నాతో పాటు ఇంటికి రండి అని రిషి అంటాడు. ఇక్కడ వరకు వచ్చాడు. ఇంకా మా డాడ్ ఎప్పటికీ దూరం కారని ఆశ పడ్డాను. మళ్ళీ మీరు ఎందుకు నా నుంచి వెళ్లిపోతున్నారు. నాకు అన్ని మీరే కదా డాడ్.. ఫ్రెండ్ అయినా డాడ్ అయినా అన్ని మీరే కదా.. నేను ఏదో తెలిసో తెలియకో అన్నానో అనుకోండి.. ఇంత పెద్ద శిక్ష వేస్తారా.. నాకు నేనే శిక్ష వేసుకున్న శిక్ష ఇది అని మహేంద్ర అంటాడు.

మీరు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ నేను ఆపును మీరు ఇక మళ్ళీ నా దగ్గరకు తిరిగి రావాలి అంటే రేపు ఉదయం వరకు ఆలోచించుకోండి. ఈరోజు రాత్రంతా బాగా ఆలోచించుకొని రేపు ఉదయం సూర్యోదయం కాకముందే నా దగ్గరకు రండి అని రిషి అంటాడు. ఇక మహేంద్ర ఇంటికి వెళ్లి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను అని జగతితో అంటాడు. డాడ్ కోసం ఇన్ని రోజులు ఆగాను కానీ.. రేపొద్దున వరకు ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నాను వసుధర.. డాడ్ తప్పకుండా వస్తారంట అని ఆవేదనతో రిషి వసుధారతో అంటాడు. ఇక మహేంద్ర రిషి కోసం వస్తాడా లేదంటే వాళ్ళిద్దరూ పెళ్లి మాట వినేంత వరకు ఆగుతాడా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి.