Guppedanta Manasu 21 Nov Episode : వసుధర రూమ్ లో లాక్ అయిపోవడంతో రిషికి ఫోన్ చేస్తుంది. రిషి సార్ నేను రూమ్ లో ఉండిపోయాను అని చెబుతుంది. సరే నేను వస్తున్నాను అని రిషి అంటాడు. ఏమైంది వసుధర ఎందుకు రూమ్ లో ఉండిపోయావు అని అంటాడు. అంతలో రిషి వసుధర ఇద్దరు ఉండగా మళ్లీ ఆ వాచ్మెన్ వచ్చి ఇద్దరి ఇద్దరూ ఉన్నా రూమ్ ని మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పానా సార్ ఇది కావాలని ఎవరో చేస్తున్నారు అని వసుధార అంటుంది. సరే అని రిషి రూమ్ ఓపెన్ చేయబోతుండగా మళ్లీ లాక్ చేసి ఉండడం గమనిస్తాడు.. వెంటనే ఎవరికి అయినా సరే ఫోన్ చేస్తాను అని రిషి అంటాడు..

రిషిని కరెక్ట్ టైమ్ లో సేవ్ చేసిన మహేంద్ర.!
అంతలో ఆ వాచ్మెన్ వెళ్లి మీడియా రిపోర్టర్ కి సక్సెస్ అన్నట్టుగా చేత్తో సైగ చేసి చూపిస్తాడు. ఇక ఆ రిపోర్టర్ కాలేజీలో అందరిని తీసుకొని ఏమో మాట్లాడుకుంటూ ఆ రూమ్ దగ్గర వరకు వస్తాడు. అప్పుడే రిషి మళ్ళీ ఇంకోసారి డోర్ వస్తుందేమోనని ఓపెన్ చేస్తాడు. ప్లాన్ లో భాగంగా ఆ రూమ్ డోర్ అప్పుడే తెరుసుకుంటుంది. రిషి పక్కన వసుధార ఉండటం చూసి ఆ రిపోర్టర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడు. స్టూడెంట్ గదిలో ఏండి అంటూ నోటికి వచ్చిన కోతలు కోస్తాడు రిపోర్టర్. రిషికి కోపం వచ్చి పెద్దగా అరుస్తాడు. సరే సార్ మీరిద్దరూ అసలు రూములో ఎందుకు ఉన్నారో చెప్పండి అని రిపోర్టర్ నేరుగా ప్రశ్నిస్తాడు.
రిషి డోర్స్ ఓపెన్ చేయగానే.. వాళ్ళిద్దర్నీ చూసి కాలేజ్ లో దొరికిపోయిన స్టూడెంట్ టీచర్ అంటూ ఆ రిపోర్టర్ అంటుండగా.. నేను సమాధానం చేపోచ్చా అంటూ మహేంద్ర ఆ రూమ్ లో నుంచి సూపర్ ఎంట్రీ ఇస్తాడు. నేను కూడా ఈ రూమ్ లో ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అని మహేంద్ర అంటాడు. సార్ మీరు కూడా లోపల ఉన్నారా అని ఆ రిపోర్టర్ కాస్త అనుమానంగా అంటాడు. అవును నేనే రిషి ని ఈ రూమ్ లోకి రమ్మని చెప్పాను. నేను కూడా ఈ రూమ్ లో ఉన్నాను అంటూ మహేంద్ర ఆ రిపోర్టర్ కి ఊహించని విధంగా షాక్ ఇస్తాడు. రిషి, వసుధర కూడా మహేంద్రని అక్కడ చూసి షాక్ అవుతరు. అందరూ మహేంద్ర ఎంట్రీ చూసి ఆశ్చర్యపోతారు.
ఇప్పుడు ఈ విషయాన్ని హైలెట్ చేయకుండా వచ్చిన పని కానివ్వండి. మర్యాదగా ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేస్తే మంచిది లేకపోతే ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అంటూ ఆ రిపోర్టర్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర. ఇంటర్వ్యూ సంగతి చూడు రిషి మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని మహేంద్ర అంటాడు. మహేంద్ర దగ్గరికి వెళ్లి జగతి మీరు ఎలా వచ్చారు అని అడుగుతుంది .
ఈ కుట్రలు కుతంత్రాలు చేసేది ఎవరో నీకు తెలుసు కదా దేవయాని వదినే ఇదంతా చేసింది. ఈ కాలేజీలో అణువణువు తెలిసిన నాకు ఈ రూమ్ కి రెండు డోర్లు ఉంటాయని నాకు తెలియదా.. ఆ రూమ్ తాళం తీసుకొని నేను లోపలికి వచ్చాను. ఆ తర్వాత మీకు ఏం జరిగిందో మీరంతా చూశారు కదా అని జగతికి జరిగిన విషయాన్ని మహేంద్ర చెబుతాడు. సరైన సమయంలో వచ్చి రిషిని సేవ్ చేసావ్ మహేంద్ర అంటూ జగతి మహేంద్రను మెచ్చుకుంటుంది. ఇక ఇంటర్వ్యూ జరుగుతుంది వసుధారని అందరూ పొగుడుతూ ఉంటారు. వసుధారను అభినందించే క్రమంలో రిషి వసుధార మేడలో దండ వేస్తాడా లేదా అనేది చూడాలి.