Guppedanta Manasu 19 Nov Episode : వసుధర ఇంటర్వ్యూ ఇవ్వకుండా దేవయాని సూపర్ ప్లాన్.. మహేంద్ర ఆ ప్లాన్ తిప్పి కొట్టడానికి అక్కడికి వస్తాడా.!?

Guppedanta Manasu 19 Nov Episode : దేవయాని ఎవరితోనో నేను చెప్పిన  పని చేయమని చెబుతుంది. మీరు ఆ పని చేస్తే మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది.. ఆ మాటలను చాటుగా ధరణి వింటుంది. దేవయాని వెనక్కి తిరిగి చూడగానే ఆ మాటలను ధరణి  వినేసిందేమో అని డౌట్ వచ్చి తనని పిలుస్తుంది.. ధరణి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది దేవిని ఏం లేదు అత్తయ్య గారు అని ధరణి కవర్ చేసుకుంటుంది. ఇక ఎలాగోలా దేవి అనే నుంచి ధరణి తప్పించుకుని గౌతమ్ కి కాల్ చేస్తుంది.. గౌతమ్ దేవయాని అత్తయ్య గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఎవరి గురించి ఏంటి అనేది మాత్రం అర్థం కాలే..దు కానీ కాలేజీలో ఏదో చేయబోతున్నారని మాత్రం నాకు అర్థమైంది.. రిషి, వసుధర ఇద్దరికీ ఫోన్ చేశాను. వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వే ఈ గండం నుంచి ఎలాగైనా కాపాడాలి అని ధరణి చెబుతున్న మాటల్లో గౌతమ్ ఫోన్లో నుంచి మహేంద్ర వింటాడు..

Advertisement
Guppedanta Manasu 19 Nov today full Episode
Guppedanta Manasu 19 Nov today full Episode

జగతి కాలేజ్ కి వస్తుంది. జగతిని చూడగానే వసుధర అదంతా భ్రమ అని అనుకుంటుంది. జగతి మేడం మీరు వచ్చారా ఇదంతా కలా అని అంటుంది.. జగతి ఆప్యాయంగా వసు అంటూ హత్తుకుంటుంది. వసు నువ్వు సాధించావు.. నన్ను కాదు రిషి పేరు, డిబిఎస్టీ కాలేజ్ పరువు నిలబెట్టావు అని జగతి అంటుంది.. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే కచ్చితంగా మీరు వచ్చారు మేడం అని జగతి నీ గట్టిగా హత్తుకుని వసు థాంక్యూ చెబుతుంది. థాంక్యూ మేడం థాంక్యూ సోమచ్ మీరు నా కోసం వచ్చారు. నువ్వు ఇంటర్వ్యూ బాగా ఇవ్వాలి జగతి చెబుతుంది. మీరు వచ్చారు కదా మేడం.. మీ శిష్యురాలు ఒక్క ఇంటర్వ్యూ ఏంటి పది ఇంటర్వ్యూలు అయినా సరే ఇచ్చేస్తుంది అని వసుధర ఆనందంగా చెబుతూ ఉంటుంది ..

Advertisement

అప్పుడే రిషి వసుధార రెడీ అయ్యావా అంటూ ఆ రూమ్ లోకి వస్తాడు. అక్కడ జగతి మేడంని చూసి సడన్ గా ఆగిపోతాడు. మేడం మీరు వచ్చారంటే .. డాడ్ కూడా వచ్చి ఉంటారు.. డాడ్ ఎక్కడ ఎక్కడ అని తీసి ఆ రూమ్ అంతా అరుస్తారు.. మీరు నన్ను ఆటపట్టించడానికి ఇదంతా చేస్తున్నారు కదా రండి డాడ్ అని రిషి దీనంగా మహెంద్రా అక్కడున్నాడేమోనని అనుకుంటాడు.. కానీ మహేంద్ర అక్కడ లేడని ఆ తర్వాత అర్థం చేసుకుంటాడు..అర్థమైంది మేడం నాకు బాగా అర్థమైంది మీ శిష్యురాలు మీద ఉన్న మీ ప్రేమ కోసం మీరు వచ్చారు.. నాకోసం నా రాలేదు అని రిషి అంటాడు..

మేడం మీరైనా వచ్చారు నాకు అదే సంతోషం.. వసుధార ఇంటర్వ్యూని జాగ్రత్తగా జరిగే లాగా చూడండి.. డాడ్ నాకు ఎందుకు దూరమయ్యారో కూడా ఇప్పటికీ తెలియదు.. కనీసం ఆయన నాకు ఇంత గొప్ప శిక్ష ఎందుకు వేస్తున్నారు నాకు తెలియాలి.. నా తప్పేంటో నేను తెలుసుకోవాలి కదా మేడం .. మీకు చెప్పాలి అని అనిపిస్తే ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ విషయాన్ని నాకు చెప్పి వెళ్ళండి ప్లీజ్ అని జగతిని రిషి రిక్వెస్ట్ చేస్తాడు.. ఇంటర్వ్యూకి తన ఇంట్రడక్షన్ మీరే ఇస్తే బాగుంటుంది అని రిషి చెపుతాడు.. సరే వసుధర నువ్వు త్వరగా రెడీ అయి రా అని రిషి అక్కడి నుంచి వెళ్తాడు. జగతి కూడా త్వరగా రమ్మని ఫంక్షన్ హాల్ రూమ్ లోకి వెళుతుంది.. వసుధార ఉన్న రూం ని ఎవరో వెనకమాల నుంచి లాక్ చేస్తారు బహుశా ఇదే దేవయాని ప్లాన్ అయ్యి ఉండొచ్చు. మహేంద్ర , గౌతమ్ తో ఈ ప్లాన్ తిప్పికొట్టిస్తాడా తనే వస్తాడా అనేది చూడాలి.

Advertisement