Guppedanta Manasu 17 Nov Episode : జగతికి మెయిల్ చేసిన రిషి.. మహేంద్ర ప్లాన్ వర్కౌట్ అవుతుందా.!?

Guppedanta Manasu 17 Nov Episode : వసుధర రాత్రి భోజనం తినకుండా పడుకుంటుంది. రిషి భోజనం ప్లేట్ తీసుకొని వసుధార దగ్గరికి వస్తాడు. వసుధర ఏంటి భోజనం చేయలేదు అని అడుగుతాడు. సార్ నాకు తినాలని లేదు అని వసుధార అంటుంది. అయితే నేను కూడా తినను అని ఆ ప్లేట్ వైపు చూపిస్తూ చెబుతాడు. నువ్వు తింటాను అంటేనే నేను తింటా ను రిషి అంటాడు.. సరే అని వసుధర ఆ ప్లేట్ తీసుకొని రిషి కి గోరుముద్దలు తినిపిస్తుంది..

Guppedanta Manasu 17 Nov today full Episode
Guppedanta Manasu 17 Nov today full Episode

తను తిన్న తర్వాత రిషి కూడా వసుధారకి భోజనం తినిపిస్తాడు. మన ఇద్దరం తినింది కొద్దిగా అయినా కూడా నా మనసు సంతృప్తిగా ఉంది అని వసుధర అంటుంది. నాకు కూడా అలాగే ఉంది అని రిషి అంటాడు. సార్ నాకు జగతి మేడంని చూడాలని ఉంది.. మేడం లేకుండా ఇంటర్వ్యూ కి వెళ్లడం ఇష్టం లేదు అని వసుధర చెబుతుంది. అయితే నువ్వేమీ బాధపడకు వసుధర.. నీకు ఇంటర్వ్యూ చేసే టయానికి జగతి మేడం కచ్చితంగా వస్తారు అని రిషి భరోసా ఇస్తాడు.

ఇక ఉదయం లేచిన తర్వాత వసుధర కాఫీ తీసుకొని ఇంట్లో అందరికీ ఇస్తుంది. దేవయాని ఏంటి వసుధార ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా దేవయాని అంటుంది. నేను ఎవరి వల్ల విజయం సాధించానో నాకు తెలుసు మేడం అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేస్తుంది. వసుధార అయినా వాళ్ళు ఇప్పుడు నీతో లేరు కదా అని దేవాయని చురకంటిస్తుంది. రిసీజర్ జగతి మేడం ఇంటర్వ్యూ వచ్చేలా చేస్తాను అని అన్నారు. నాకు రిషి సార్ మాట మీద నమ్మకం ఉంది అని వసుధర అంటుంది . మేడం వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు తెలిసిపోయిందా అని గౌతమ్ మనసులో కంగారు పడతాడు.

మహేంద్ర మహేంద్ర అని జగతి పిలుస్తుంది. మేడం గారు మీకు ఒక నమస్కారం.. ఇలా మీకు ఒక మెయిల్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోవడం లేదు. మీరు చిన్నప్పుడు నన్ను వదిలి పెట్టేసి వెళ్ళిపోయారు. నా బాధ ఏంటో మీకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. మీరు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో కూడా నాకు ఇప్పటికీ తెలియదు అయినా నేను అవన్నీ పట్టించుకోకుండా డాడీ సంతోషం గా ఉండాలని మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని చెప్పాను మీరు వచ్చినట్టే వచ్చి డాడీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు ఇది ఎక్కడి న్యాయం మేడం అని ఆ లెటర్లో అడుగుతాడు వసుధర చాలా బాధపడుతుంది ఒక తల్లి వదిలేసి వెళ్లిపోయిన బిడ్డ అడిగినందుకు మీరు వస్తారో.. ఒక శిష్యురాలు బాధపడుతున్నందుకు మీరు వస్తారో.. అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అని రిషి జగతి మేడం కి మెయిల్ చేస్తాడు. ఇప్పుడైనా మనం రిషి దగ్గరికి వెళ్దాం మహేంద్ర అని జగతి అంటుంది వద్దు అని మహేంద్ర అంటాడు నిన్ను కావాలని పిలవడం లేదు. ఇద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాతే మనం వెళ్దామని మహేంద్ర అంటాడు.