Guppedanta manasu 10 Nov Episode : జగతి ఇంటికి రావాలని వసుధర ఇలా ప్లాన్ చేసిందా.!? గౌతమ్ కి కౌంటర్ వేసిన దేవయాని.!

Guppedanta manasu 10 Nov Episode : మహేంద్ర ను చూస్తూ ఇంకా ఎన్ని రోజులు అంకుల్ ఈ అజ్ఞాతవాసం అని గౌతమ్ అంటాడు. కొన్ని కొన్ని కావాలి అనుకుంటే.. కొన్ని వదులుకోవాలి గౌతమ్.. కొన్ని రోజులు ఈ ఇబ్బందులు తప్పదు. ఆ తరువాత అంతా సెట్ అవుతుంది అని మహేంద్ర అంటాడు. ప్లీజ్ అంకుల్ వచ్చేయండి అని గౌతమ్ అంటాడు. జగతి వసుధర విజయాన్ని తలుచుకుని సంతోషంతో పొంగిపోతుంది..

Guppedanta manasu 10 Nov today full Episode
Guppedanta manasu 10 Nov today full Episode

యూనివర్సిటీ టాపర్ వసుధర వినడానికి ఎంత బాగుందో అని రిషి అంటాడు.. అవును సార్ చాలా ఆనందంగా ఉంది అని వసుధర అంటుంది. వసుధర నేను ఇక్కడ మాట్లాడుతుంటే.. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నువ్వు ఇప్పుడు ఏం కావాలో అడుగు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని రిషి అంటాడు. ఏం కావాలన్నా ఇస్తారా సార్ అని వసుధర అడుగుతుంది. నీ ఎదురుగా ఉంది రిష్యేంద్రభూషణ్. నువ్వు ఏమడిగినా కూడా తీరుస్తాను అని రిషి అంటాడు. మీరు జగతి మేడంని అని వసుధర తన మనసులో ఉన్న కోరిక చెప్పేలోపే.. తను ఇప్పుడు ఏం అడుగుతుంది అని రిషి ఆలోచనలో పడతాడు..

సార్ నేను ఇక్కడకి రావడానికి జగతి మేడమే కారణం. ఆ మేడమే కనుక లేకపోయిండుంటే నేను ఈరోజు యూనివర్సిటీ టాపర్ అయ్యి ఉండే దానిని కాదు. నేను మేడం కాళ్ళకి దండం పెట్టుకోవాలి. మేడం ను కలవాలని ఉంది సార్ అని వసుధార అంటుంది. ఇవన్నీ కాదు వసుధార.. ఇందాక నీ మనసులో ఒక కోరిక ఉంది అన్నావు కదా.. అదేంటో చెప్పు అని రిషి అడుగుతాడు. పదండి సార్.. మీరు కారు తీయండి. దారిలో వెళ్తూ వెళ్తూ నేను చెబుతాను అని వసుధార అంటుంది. ఇంతలో ఓ చెరువు గట్టు దగ్గర ఆగి రిషి వసుధార కూర్చుంటారు.

ఏంటి వసుధర ఎక్కడికి తీసుకు వచ్చావు అని రిషి అంటాడు. కాగితపు పడవలు చేసి నీటిలో వదలాలని ఉంది సార్ అని వసుధార అంటుంది. మనం అంతకుముందు కూడా ఇలా వదిలాం కదా అని రిషి అంటాడు. అప్పుడు వేరే కోరిక సార్ ఇప్పుడు మనసులో వేరే కోరిక ఉంది అని అంటుంది. రిషి కాగితం పడవ చేసి ఇస్తాడు. సార్ మీరు పడవ ఇంత త్వరగా ఎలా చేసి ఇచ్చారు. మీకు ఈ పడవ చేయడం ఎవరు నేర్పించారు అని వసుధార అడుగుతుంది. వసుధారా అని ఒక అమ్మాయి ఉందిలే.. తను నేర్పించింది అని రీషి అంటాడు. ఇక ఇద్దరూ నీళ్లలో దిగి 11 పడవలను నీటిలో వదులుతారు. నా పడవలు బాగా వెళుతున్నాయి. హే అంటూ ఎగురుతుంది అందులో కాళ్లు స్లిప్పే నీళ్లలో పడిపోతుంది. రిషి తన కోటు తీసి ఇచ్చి వసుధారపై కప్పుతాడు.

ధరణి అని దేవయాని పెద్దగా పిలుస్తుంది. ఏంటి అత్తయ్య ఏం కావాలి అని ధరణి వంటగదిలో నుంచి అడుగుతుంది. ఏంటి ధరణి నీకు కూడా నేను అలుసైపోయానా వంట గదిలో ఉండే సమాధానం చెబుతున్నావు అని ధరణి పై ఫైర్ అవుతుంది. లేదు అత్తయ్య రిషి స్వీట్స్ చేయమంటే చేస్తున్న పని అంది. మీ అంతటికి మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు గాని దేవయాని ధరణి పై కౌంటర్ వేస్తుంది. మీరు వద్దంటే ఆపేస్తాను అత్తయ్య రిషి వచ్చి అడిగితే మీరు చేయొద్దు అని అన్నారు అని చెబుతాను అని అంటుంది. గౌతమ్ కూడా అక్కడికి వస్తాడు. వసుధర యూనివర్సిటీ టాపర్ అయింది పెద్దమ్మ అని.. వసుధార దండకం చదువుతాడు గౌతమ్. దేవయాని తట్టుకోలేక ఆపు గౌతమ్ అని అంటుంది. వీళ్లిద్దరూ ఎక్కడికో వెళ్లారు పెద్దమ్మ ఇంకా రాలేదు ఏంటి అని గౌతమ్ అడుగుతాడు. పొద్దున లేచిన దగ్గర్నుంచి రిషితో పాటు కలిసి తిరిగేది నువ్వు.. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో నువ్వు చెప్పాలి కానీ.. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అని గౌతమ్ పై సెటైర్ వేస్తుంది దేవయాని.