Guppedanta Manasu 01 Nov Episode : దేవయాని కల నిజమవుతుందా.!? వసుధర పై రిషి ఫైర్..!

Guppedanta Manasu 01 Nov Episode : వసుధర ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని రిషి అంటాడు.. నాకు కూడా అలాగే ఉంది అని వసుధర అంటుంది.. కానీ డాడ్ మనతో పాటు లేకపోవడమే నాకు ఇంకా బాధగా ఉంది.. మన మధ్య ఇప్పుడు ఎలాంటి షరతులు కూడా లేవు.. ఇప్పుడు డాడ్ వస్తె అన్ని సెట్ అవుతాయి అని రిషి అంటాడు.. ఏంటో వసుధర నాకు దగ్గర అయినా వాళ్లంతా దూరం అవుతున్నారు అని రిషి అంటాడు.. నేను మాత్రం ఎప్పటికీ నీతో పాటు ఉంటానని మీకు మాటిస్తున్నా సార్ అని వసుధర అంటుంది..

Guppedanta Manasu 01 Nov today full Episode
Guppedanta Manasu 01 Nov today full Episode

గౌతమ్ మహింద్రా వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. గౌతమ్ రిషి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు మహింద్రా.. మీకు తెలుసు కదా అంకుల్ వాడు ఎలా ఉంటాడో అని అంటాడు గౌతమ్.. ఇప్పటికైనా మీరు ఇంటికి వచ్చేస్తే మంచిది అంకుల్.. వాడు నన్ను చూసిన ప్రతిసారి నేను వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను.. ఇప్పటికైనా మీరు ఇంటికి వచ్చేసేయండి అంకుల్ అని గౌతమ్ అంటాడు.. గౌతమ్ నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని మహింద్రా అంటాడు.. చెప్పండి అంకుల్ ఏంటో చేస్తాను అని గౌతమ్ అంటాడు.. వసుధర తన మనసులో ఎలా ఆలోచిస్తుందో నువ్వు నాకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి అని మహింద్రా అంటాడు.. సరే అని గౌతమ్ అంటాడు..

వసుధర ఆగు అని రిషి వెనకాలా పరిగెత్తుతూ ఉంటాడు.. వసుధర నువ్వు యూనివర్సిటీ టాపర్ అయ్యావు అని థాంక్యూ సార్ అని వసుధర రిషి ని గట్టిగా హత్తుకుంటుంది.. ఈ గిఫ్ట్ నీకోసమే అని గిఫ్ట్ ఇస్తాడు.. మీరే నాకు పెద్ద గిఫ్ట్ సారీ గిఫ్ట్స్ తో నాకు పని ఉంది అని అంటూ తనని గట్టిగా హత్తుకుంటుంది.. వాళ్ళిద్దరూ అలా దగ్గర అవ్వడం చూసి నో నో అని దేవయని పెద్దగా అరుస్తుంది.. ఓహో ఇదంతా నా కల అని దేవయని మనసులో అనుకుంటుంది..

రిషి వసుధార కి ఫోన్ చేసి రిజల్ట్స్ వస్తున్నాయి నువ్వు ఎక్కడ ఉన్నావు.. త్వరగా రమ్మని పిలుస్తాడు .. అలా వసుధర కాలేజీలోకి వస్తుండగా ఒక మేడం మహీంద్రా, జగతి మేడం మీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారంట కదా అని అంటుంది.‌ ఈ విషయం కాలేజీలో చాలామందికి తెలిసిపోయింది.. ఈ విషయాన్ని దేవయాని మేడం నాతో చెప్పింది అని తను జరిగిందంతా చెబుతుంది.. వెంటనే ఆ విషయం వసుధర రిషికి చెబుతుంది.. పెద్దమ్మ చెప్పింది కరెక్టే కదా.. వాళ్ళిద్దరూ నిజంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.. వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అని రిషి వసుధార మీద అరుస్తాడు..

రేయ్ వసుధార మీద అరవకు అని గౌతమ్ అంటాడు.. వాళ్లు ఇలా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు పెద్దమ్మ అందరికీ చెప్పడంలో తప్పులేదు.. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని మనం ప్రత్యేకంగా చెప్పాలా అని రిషి ఫైర్ అవుతాడు.. రిషి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటాడు.. గౌతమ్ ఇప్పుడు వద్దులే అంటాడు.. రేయ్ రిషి పాపం రా.. ఆ వసుధరను తిట్టకు అని అంటాడు.. ఇంతకీ పొగరు ఎక్కడ ఉంది అని మనసులో అనుకుంటాడు..