Guppedanta Manasu 01 Dec Episode : జగతి వేసిన ఆ ప్రశ్నకి రిషి దగ్గర సమాధానం లేదు.!వసుధర తో రిషి ఔటింగ్.!

Guppedanta Manasu :మేడం మీరు బాధపడితే డాడ్ తట్టుకోలేరు అని రిషి అంటాడు.. మీకు ఇప్పటివరకు ఆ విషయం అర్థం కాలేదేమో కానీ నాకు ఆ విషయం అర్థమైంది అని రిషి జగతితో చెబుతాడు. రిషి నీకు ఒక విషయం చెప్పనా.. నువ్వు వసుధర ను ప్రేమిస్తున్న సంగతి నేనే నీకు చెప్పాను ఆ విషయం నీకు గుర్తుందా రిషి అని జగతి గుర్తు చేస్తుంది ఆ మాటకి రిషి దగ్గర సమాధానం ఉండదు. రిషి కూడా జగతి మేడం చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు..

guppedanta-manasu-01-dec-today-full-episode
guppedanta-manasu-01-dec-today-full-episode

రిషి నువ్వు వసుధారను ప్రేమిస్తున్నావు. తనమీద నీకు కొండంత ప్రేమ ఉంది. తనని నీ సొంత ఆస్తిగా భావిస్తున్నావు అని రిషి తో జగతి అన్న మాటల్లో గుర్తు చేసుకుంటాడు. మీ మనసులో వసుధారా మీద ప్రేమ ఉందన్న సంగతి నీకంటే నాకే ముందే తెలుసు. ఆ విషయాన్ని నేనే చెప్పాను అని జగతి అనగానే ఆ మాటకు మరో మాట మాట్లాడలేకపోయాడు. రిషి వసుధారా నేను ఎప్పటికీ కలిసే ఉంటాం మేడం, తను ఎలాంటి సమాధానం చెప్పినా తను ఎప్పటికీ నాతోనే ఉంటుంది. అని రిషి అంటాడు మీరు డాడీ ఇద్దరు కలిసి ఉంటే నాకు అదే చాలు అని రిషి అంటాడు.

డైనింగ్ టేబుల్ దగ్గరక అందరూ భోజనానికి కూర్చుంటాడు రిషి భోజనం చేయకుండా లేచి నిలబడతాడు. అదేంటి రిషి భోజనం చేయమని వాళ్ళ పెదనాన్న అంటాడు . లేదు పెద్దనాన్న డాడ్ వచ్చిన సందర్భంగా ఇంట్లో అందరికీ నేనే వడ్డిస్తాను అని రిషి అంటాడు. రిషి మహేంద్ర కు వడ్డిస్తూ ఈ కూర వదిన చాలా బాగా చేస్తుంది డాడ్ తినండి అని అంటాడు. మహేంద్ర ఇంట్లో ఇలా అందరం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది కదా అని వాళ్ళ అన్నయ్య అనగానే మహేంద్ర ముఖం చిన్న బుచ్చుకుంటాడు.

రిషి వసుధారా కి.. వసుధర ఒకసారి ఖాళీగా ఉంటే బయటకు వస్తావని మెసేజ్ చేస్తాడు. రిషి మెసేజ్ చూసి వసుధార తనలో తానే నవ్వుకుంటుంది. ఏంటి సార్ రమ్మన్నారు అని అడుగుతుంది. మనిద్దరం బయటకు వెళ్దాం పద అది కూడా ఇప్పుడే అని అంటాడు. నువ్వే చెప్పావు కదా మనసులో ఏదో ఉంటే అది వెంటనే చేసేయాలి అని.. నాకు నీతో కలిసి ఎప్పటికి బయటకు వెళ్లాలని ఉంది పదా వెళ్దాం అని అంటాడు. అటుగా వెళుతున్న ధరణిని పిలిచి వసుధారా నేను బయటకు వెళ్తున్న వదిన అప్పటివరకు మేడం ని మీరే చూసుకోండి అని అంటాడు. పెద్దమ్మ అడిగితే మేమిద్దరం బయటకు వెళ్ళామని చెప్పమని రిషి చెబితాడు .ఆ మాటలకు వసుధార మనసులో రిషి సార్ మీకు ఎంత ధైర్యం ఉందో .. ఎంత చక్కగా పక్క వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పేశారు అని మనసులో అనుకుంటుంది. వసుధర రిషి ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్తారు.