Guppedantha Manasu Serial : టిఆర్పి రేటింగ్ లో మళ్లీ ఆ స్థానంలోకి గుప్పెడంత మనసు సీరియల్..!!

Guppedantha Manasu Serial : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు కూడా ఒకటి.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. టిఆర్పి రేటింగ్ లో కూడా దూసుకెళ్తూ కార్తీకదీపం కు గట్టి పోటీనీ ఇస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ రేటింగ్స్ లో రేటింగు సొంతం చేసుకుని గుప్పెడంత మనసు సెకండ్ ప్లేస్ లో నిలిచింది.. గతవారం ఈ సీరియల్ మూడవ స్థానంలో నిలవగా.. ఈ వారం ఇంటింటి గృహలక్ష్మిని వెనక్కి నెట్టి గుప్పెడంత మనసు రెండవ స్థానంలో నిలిచింది.. ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు.. వచ్చేవారం ఎలాంటి ట్విస్టులు జరుగుతాయో చూద్దాం.. డి బి ఎస్ టి కాలేజ్ లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళకి ఫేర్వెల్ పార్టీతో.. స్టూడెంట్స్ మనసులను ఇంకాత ఉత్సాహం నింపేందుకు రిషి ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేస్తాడు..

ఫేర్వెల్ పార్టీని ముగిసిన తరవాత తన మనసులో ఉన్న ప్రేమను రిషికి చెప్పాలనుకుంది వసుధార.. రిషి కార్లో వెళ్తుండగా తనని రోడ్డు మీద ఆపి తనతో మాట్లాడాలని చెబుతుంది.. ఇవన్నీ ఇప్పుడు కాదు అని రిషి వెళ్ళిపోతుండగా.. నీతో ఈ రోజు మాట్లాడకుండా ఇక్కడి నుంచి కదలను అని వసుధర పట్టుబడుతుంది.. మన ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ.. ఈరోజుతో నేను మీరు కలిసి రిషిధర అయ్యాము. ఐ లవ్ యు రిషి సార్ అని వసుధర చెబుతుంది.. ఏంటి వసుధర నువ్వు మాట్లాడేది అని షాక్ అవుతూ రిషి అడుగుతాడు అవును సర్ మీరంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఈ మాట చెప్పకపోతే ఇక జీవితంలో మీకు చెప్పలేను అని అనిపిస్తుంది అని మరోసారి రిషికి ఐ లవ్ యు చెబుతుంది.. రిషి వసుధార చేతిలో ఉన్న గిఫ్ట్ ను తీసుకుంటాడు.. ఈ వర్షం నాకు ఐ లవ్ యు చెప్పించింది.. మన ఇద్దరం కూడా ఆకాశం లాగా ఉండాలి.. అలా అని మబ్బుల లాగా మరి మన ప్రేమని ఎప్పటికీ వానలా కురిపించకూడదు..

Guppedantha Manasu Serial is again that position in TRP rating
Guppedantha Manasu Serial is again that position in TRP rating

ఆకాశమంత ఎత్తులో ఉండాలి అని రిషి అంటాడు.. నువ్వు ఇచ్చిన ఈ ప్రేమ బంధం నేను ఎప్పటికీ కాపాడుకుంటాను.. మన బంధాన్ని శాశ్వతంగా కాపాడే బాధ్యత నాది అని రిషి వసుధారకు మాట ఇస్తాడు వసుధర తీసుకువచ్చిన ఉంగరం తన వేలికి పెట్టాలని రిషి చూస్తాడు.. రిషి వసుధార చేతినీ పట్టుకొని ఉంగరం పెట్టబోతాడు.. కానీ ఈ చేతికి నేను ఈ రింగ్ పెట్టాలంటే నువ్వు ఒక త్యాగం చేయాలి అని రిషి అంటాడు.. రిషిధర ఒక్కటి అవ్వాలి అంటే VR రింగ్ మీద రెండు అక్షరాలు రాసి కలిపేస్తే సరిపోదు.. ఆ బంధం ఒకటి కావాలంటే నువ్వు త్యాగం చేయాలి.. మన ప్రేమను త్యాగం చేయాలి అని రిషి అంటాడు. అంతకంటే నా ప్రాణం అడగండి సర్ ఆనందంగా ఇచ్చేస్తాను అని వసు అంటుంది.. వసుధర నీకు నాకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అది మీ లక్ష్యం యూనివర్సిటీ టాప్ గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి ముందు నువ్వు నీ లక్ష్యం దిశగా అడుగులు వెయ్యి ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు మనం కలుసుకోకూడదు మాట్లాడుకోకూడదు.. నీ ఆశయం కోసం కుటుంబాన్ని వదిలేసి వచ్చేసావు.. ఇప్పుడు మన ప్రేమ ముందు నువ్వు అది మర్చిపోయావు అందుకే ఒక్కసారి నీ ఆశయం గురించి ఆలోచించు అని రిషి అంటాడు..

సర్ ఈ రింగ్ మీ చేత తొలగించుకోవడం కంటే యూనివర్సిటీ గోల్డ్ మోడల్స్ సాధించడం నాకు పెద్ద విషయం కాదు అని వసుధర అంటుంది.. కానీ నేను అలా చేయాలి అంటే నాకు ఒక విషయంపై క్లారిటీ కావాలి ఈ రింగ్ ఎప్పటికీ నాదే కదా అని వసుధారా ఋషిని అడుగుతుంది వసుధర నీకు ఈ రిసింద్రభూషణ్ మాట ఇస్తున్నాడు.. పంచభూతాలు ఈ వర్షం ఎందుకే సాక్ష్యం.. మన మనసులు సాక్ష్యం.. ఎప్పటికీ ఇది నీకే కానీ నీ ఆశయం చదువు గురించి నాకు మాట ఇవ్వు.. అని నేను చెప్పినట్టు మీ దృష్టి అంతా చదువు మీదే పెట్టు అని రిషి అంటాడు.. సార్ మీకోసం మన ప్రేమ కోసం నా ఆశయం కోసం మీ మాట వింటాను.. మీరు చెప్పినట్టే పరీక్షలు పూర్తయ్య దాకా.. ప్రేమ కోసం ఆలోచించను ప్రామిస్ అని అంటుంది వసుధార.. ఉరుము ఉరమటంతో రిషి ని గట్టిగా హత్తుకుంటుంది వసుధర.. రిషి వసుధర చేతిలో చేయి వేసి మరో చేత్తో కార్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ఇంటికి వరకు వెళ్తాడు.. వసు దిగు అని అంటాడు.. ఏంటి సార్ అప్పుడే వచ్చేసమా అని అంటుంది.. హా.. అని అంటాడు.. సరే ఇక ఈ విషయాన్ని మర్చిపోయి నువ్వు నీ చదువు మీద కాన్సంట్రేట్ చెయ్యి..

నీ లక్ష్యాన్ని సాధించడానికి అడుగులు వేయాలి అని చెబుతాడు రిషి.. ఆల్ ది బెస్ట్ వసుధర్ అని రిషి అంటాడు.. నువ్వు తప్పకుండా నీ లక్ష్యాన్ని సదిస్తావన్న నమ్మకం నాకు ఉంది.. మన ప్రేమ మీద నమకం నాకు ఉంది.. తప్పకుండా సార్ అని వసు అంటుంది… రిషి థాంక్యూ అంటూ ప్రకృతి కి చెబుతాడు.. తన నిడతో మన మనసు విప్పి మాట్లాడతాడు.. వసుధర ఇక తన సొంతమని.. మా ఇద్దరి మధ్య ఇంకా ఎవ్వరూ రారని.. వసుధర తో తన ప్రేమను సొంతం చేసుకోవాలి అని.. ప్రేమ బంధాన్ని పెళ్లితో ఒక్కటవ్వాలని.. వసుధర తన లక్ష్యం చేరుకుంటే చాలని అనుకుంటాడు.. ఆనందంగా ఇంటికి బయలు దేరాడు.. అప్పుడే దేవయాని మళ్లీ సీన్ లోకి సాక్షిని దింపుతుంది. ఈసారి ఎంతమంది ఎదురై అడ్డుగా నిలిచినా కూడా రిషి ఎవరిని పట్టించుకోడు. వసుధారా రిషి ని మనసులో ఉంచుకొని తన ధ్యాసంతా చదువుపై పడుతుంది.. మొత్తానికి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. రిషి ప్రేమను సొంతం చేసుకుంటుంది. మధ్యలో సాక్షి వస్తే తనను వెనక్కి నెత్తి వసుధారను ఇష్టమని రిషి వాళ్ళ ఇంట్లో అందరితో చెప్పేస్తాడ.. ఇదే వచ్చే వారం హైలైట్ ట్విస్ట్..

Advertisement