Prabhas – BalaKrishna : వైరల్ గా మారిన బాలయ్య షో ప్రభాస్ గ్లింప్.. డార్లింగ్ అంటూ..!

Prabhas – BalaKrishna : బాలకృష్ణ తాజాగా హోస్టుగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం రెండవ సీజన్ కూడా మొదలైంది. ఈ శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్కి రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు హీరో గోపీచంద్ కూడా హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షో ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తాజాగా బాలయ్య షో నుంచీ ప్రభాస్ గ్లింప్ ఒకటి విడుదల చేశారు మేకర్స్.. ఇప్పుడు అది కాస్త బాగా వైరల్ గా మారింది.

From Balayya show.. prabhash glimp goes viral..!
From Balayya show.. prabhash glimp goes viral..!

బాహుబలి ప్రభాస్ మీట్ విత్ బాలయ్య పేరుతో అన్ స్టాపబుల్ సీజన్ 2 స్టేజ్ పైకి ప్రభాస్ రాగానే ప్రేక్షకులంతా ఈలలు , గోలలు చేశారు. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ని ఆహ్వానించగానే క్రాకర్స్ తో కూడిన స్పార్క్స్ లైటింగ్ లో ప్రభాస్ వస్తుండగా అభిమానుల ఆనందాలకు అవదులేవు.. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ప్రభాస్.. అభిమానులను చూసి ” ఏం చెప్తున్నావు డార్లింగ్ ” అన్నాడు. ఇలా ప్రభాస్ చెప్పిన ఈ డైలాగుకు నెటిజన్లు మొత్తం ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే ఈ గ్లింప్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.