Guppedantha Manasu : రిషి వసుధార ను దూరం చేయాలని దేవయాని, సాక్షి ప్లాన్.. వచ్చేవారం ట్విస్ట్ ఇదేనా.!?

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ ఇప్పటికే 546 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులు అలరిస్తూనే ఉంది.. ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో కూడా కార్తీక దీపం కు గట్టి పోటీ ఇస్తుంది.. ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో చూద్దాం..! రిషి ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేయడంతో ఇక కాలేజీలో వసుధార మళ్లీ తనని కలవలేనని అనుకుంటుంది.. ఎలాగైనా తన మనసులో ఉన్న మాటని ఈరోజుతో చెప్పాలని డిసైడ్ అవుతుంది.. వసుధారా రిషికి ప్రపోజ్ చేస్తుంది.. రిషి కూడా తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు.. కాకపోతే ఒక కండిషన్ పడతాడు. నువ్వు పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చింది నా కోసం కాదు.. నీ లక్ష్యం కోసం..

ఇలాంటప్పుడు నువ్వు నీ లక్ష్యాన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు నువ్వు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి కాలేజ్ తో పాటు యూనివర్సిటీ ఆఫర్ అవ్వాలనుకున్న నీ లక్ష్యాన్ని చేరుకోవాలి.. అప్పటివరకు నువ్వు నేను మాట్లాడుకోకూడదు.. ఈ విషయం గురించి ఆలోచించకు అలా అని నువ్వు నాకు మాటిస్తే చాలు అని రిషి అంటాడు.. ఇలా మీకు దూరంగా ఉన్నా కూడా మీరు నాకే సొంతమా కాదా అని వసుధర అడుగుతుంది.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నీ సొంతం అని మాట ఇస్తాడు ఎగ్జామ్స్ రాస్తుంది. ఇక ఫైనల్ ఎగ్జామ్ రోజు దేవయాని, సాక్షి లు కలిసి కిడ్నాప్ ప్లాన్ చేస్తారు.. కానీ రిషి మాత్రం ఫైనల్ గా వాసుధర ను కపడి తన చేత ఎగ్జామ్ రయిస్తాడు.. వసుధర రిషి ఒకటయ్యారని తెలిసి మా దేవయాని వదిన బాధతో విలవిల్లాడిపోతుంది.. అని మహేంద్ర అన్న మాటలను దేవయాని వినింది.. వాళ్ళందరూ కలిసి నవ్వుకోవడం చూసి కోపంతో కిందకు వచ్చి సాక్షికి కాల్ చేస్తుంది.. దేవయానికి సాక్షి నీ చెప్పిన పని చేయడం చేతకాదు..

Devayani and Sakshi plan to alienate Rishi Vasudhara
Devayani and Sakshi plan to alienate Rishi Vasudhara

పనులు అందరూ చేస్తారు కానీ పర్ఫెక్ట్ గా కొందరే చేస్తారు.. నీలో ఆ పర్ఫెక్షన్ లేదు.. నీలో తెలివితేటలు ఉంటే నీలో ఆ పర్ఫెక్షన్ ఉంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎందుకు వదులుకుంటాడు అని దేవయాని అంటుంది.. అప్పుడు వదులుకుంటే మళ్లీ నీకు రెండవ అవకాశం వచ్చింది.. ఎలాగూ వాళ్ళిద్దరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఉండరు మనం ఇలాగే వారానికి ఒకసారి కలుసుకొని వాళ్ల గురించి తెలుసుకుని బాధపడదాం అని దెప్పిపొడుస్తుంది.. రిషి ని వసుధర ను వేరు చేయడానికి ఒక్క అవకాశం కోసం వెతకండి.. వసుధార ను వెళ్ళగొట్టే దారి నేను చూసుకుంటాను అని సాక్షి అంటుంది.. మనం ఇలా చేసే కాడే ఉంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు కూడా చేయాల్సిందే ఏదైనా ఉంటే త్వరగా చేయాలి అని దేవయాని అంటుంది.. సాక్షి మనసులో నాకుండే ప్లాన్స్ నాకు ఉన్నాయి.. నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలులేదు అని సాక్షి అంటుంది.. రిషి వసును తీసుకుని లాంగ్ టూర్ ప్లాన్ చేస్తాడు.. అది దేవయానికి తెలుస్తుంది.. అదే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్..

Advertisement