Star Maa : సాధారణంగా బుల్లితెరపై పలు రకాల చానల్స్ లో పలు రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా కామెడీ షో ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కొక్క చానల్లో ఒక్కో రకమైన కంటెస్టెంట్లతో కామెడీ షో లను రన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీలో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఏకైక కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే జబర్దస్త్ లో బాగా పాపులారిటీ దక్కించుకున్న వాళ్లను రెమ్యునరేషన్ పేరిట ఆశ చూపించి స్టార్ మా వాళ్ళు లాగేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈటీవీ కూడా అదే తరహాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సద్దాం ను తాజాగా జబర్దస్త్ లోకి తీసుకొచ్చారు జబర్దస్త్ నిర్వాహకులు. దీన్ని బట్టి చూస్తే జబర్దస్త్ లో చేసేవారు ఎవరైనా సరే ఇతర షోలలో చేయకూడదు అన్న రూల్ కూడా ఉంది కాబట్టి స్టార్ మా కి ఇక శాశ్వతంగా సద్దాం గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అదిరింది ,కామెడీ స్టార్ట్ వంటి కార్యక్రమాలలో సద్దాం తన టీం తో అదిరిపోయే పంచులు వేస్తూ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రాబోయే డిసెంబర్ 22వ తేదీ నుంచి ఆయన ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో టీం లీడర్ గా వ్యవహరించబోతున్నారు.