Inaya : బిగ్ బాస్ సీజన్ 6 ముగిసే సరికి కాస్త రసవత్తరంగా మారింది. ఇప్పుడిప్పుడే ఈ షోని ప్రేక్షకులు నాన్ స్టాప్ గా చూడటం మొదలుపెట్టారు. ఇక 14వ వారం అనూహ్యంగా ఇనయ ఎలిమినేట్ అయింది.. టాప్ త్రీ కంటెంట్ గా ఉంటుందని భావించిన ఇనయ ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం తో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు..

ప్రతి టాస్క్ లోను గట్టి పోటీ ఇస్తూ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసిన వర్మ హీరోయిన్ అన్నయ్య టాప్ పొజిషన్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇకపోతే 14 వారాలు పాటు హౌస్ లో కొనసాగినయిన ఇనయ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేస్తుంది. 14 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఇనయ కు బిగ్ బాస్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇనయ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఇనయకు ఒక వారానికి సుమారు లక్ష రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేలాగా ముందుగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఇలా 14 వారాలకు గాను ఈమెకు సుమారు 15 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందిందని సమాచారం. ఇనయకు 15 లక్షల రెమ్యూనరేషన్ అంటే మంచి రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. పైగా ఇనయ ఊహించని విధంగా ట్రేస్ ను సంపాదించుకుంది. ఇక హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత తనకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.