Intinti Gruhalakshmi 24 sep episode : సామ్రాట్ ను తన భార్య గురించి నిజం చెప్పమని నిలదీసిన అభి..! ఆనందంలో లాస్య..!

Intinti Gruhalakshmi 24 sep episode : తులసి ఇంట్లో హనీకీ ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తుంది.. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ నాకు కూడా తలా ఒక ముద్ద పెట్టమని అడుగుతారు.. తులసి ప్రేమ ఆప్యాయతలను సామ్రాట్ వాళ్ళ బాబాయి మెట్లు మీద నుంచి గమనిస్తూ ఉంటాడు.‌ తులసి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది బాబాయ్.. కానీ అందరికీ మంచి చేసే తులసికి మాత్రం ఆ దేవుడు ఎందుకు ఒంటరిని చేశాడు..అర్థం కావడం లేదు అని సామ్రాట్ అంటాడు.. కొన్ని కొన్ని సార్లు అంతే అని వాళ్ళ బాబాయ్ అంటాడు తులసి అందరికీ గోరుముద్దలు తినిపించిన తర్వాత వెంటనే సామ్రాట్ ఈరోజు ప్రెస్ మీట్ పెడదాం.. మనం తులసివనం ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామని మీడియా వాళ్లకి చెప్పాలి అనే సామ్రాట్ అంటాడు.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని తులసి అంటుంది.. కాదు కాదు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని లాస్య కూడా ఉంటుంది.. ఆ ఏర్పాట్ల బాధ్యతలు చూడమని నందు, లాస్యకు అప్పుడు చెప్తాడు సామ్రాట్..

వెళ్ళిపోదాం లాస్య మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నందు అంటాడు.. అర్జెంటుగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాదు.. ఆ తులసిని ఇక్కడి నుంచి పంపించేలాగా ప్లాన్ చేయాలి అని లాస్య అంటుంది.. ఆలస్యం ఎందుకు త్వరగా ప్రెస్ వాళ్లకి కాల్ చేయమని లాస్య నందుకి చెబుతుంది.. ప్రెస్ మీట్ మనల్ని అరేంజ్ చేయమని తన గొయ్యి దానిని తవ్వుకున్నాడు సామ్రాట్.. ఎంచక్కా తులసితో ఇకక నవ్వుకుంటూ ప్రెస్ మీట్ ఇద్దామని అనుకుంటున్నాడు.. కానీ అక్కడ జరిగేది అది కాదు కొరివితో కోరుకున్నట్టు ఉంటుంది.. అక్కడ అని లాస్య తన ప్లాను నందుతో చెబుతుంది.. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టనురా అని అనుకుంటాడు.. పిచ్చి నందు ఈ రోజు సామ్రాట్ కి కనిపించేది చుక్కలే.. అని లాస్య తన ఫోన్ నుంచి ఎవరికో కాల్ చేసి చేయాల్సింది మొత్తం వివరంగా చెబుతుంది..

Intinti Gruhalakshmi Abhi made Samrat to tell the truth about his wife
Intinti Gruhalakshmi Abhi made Samrat to tell the truth about his wife

లాస్య దగ్గరుండి ప్రెస్ వాళ్లకి సేవలు చేస్తుంది.. అది గమనించిన నందు.. ఎప్పుడూ లేనిది లాస్య ఇలా ఎందుకు వాళ్ళందరికీ సేవలు చేస్తుంది అని ఆలోచనలో పడతాడు.. లాస్య మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పిందంతా గుర్తుందిగా.. చేస్తారు కదా అని వాళ్ళని ఇన్ డైరెక్ట్ గా అడుగుతుంది.. వాళ్లు కూడా సరే అన్నట్టుగా తల ఊపుతారు గుడ్ అని చెప్పి లాస్య అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది.. ఏంటి అంతా ఓవరాక్షన్ చేస్తున్నావని లాస్ అని నందు అడుగుతాడు నీకు ఎలాగూ చేతకాదు కదా నీ వంతు కూడా నేను చేస్తున్నాను అని లాస్య అంటుంది మరి మొఖం అంత సీరియస్గా పెట్టకు అని నందుని లాస్య అంటుంది.. తులసి వనం ప్రాజెక్టు గురించి మీతో మాట్లాడడానికి..

అలాగే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాం అని మీడియా వారితో సామ్రాట్ అంటారు.. ముందు మేము కొన్ని ప్రశ్నలు అడగాలి అని మీడియా వాళ్ళు అంటారు.. తులసి గారికి మీకు మధ్యన ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు.. తను మీరు దగ్గరయ్యారని.. త్వరలోనే ఒక్కటి కానున్నారని మాకు తెలిసింది అని వాళ్ళు నేరుగా సామ్రాట్నే ప్రశ్నిస్తారు.. ఇప్పటివరకు మీ భార్య ఎవరో మాకు చెప్పలేదు కనీసం హనీకైనా తన తల్లి గురించి తెలుసా అని వాళ్ళు ప్రశ్నిస్తారు..

మామ నీతో కలిసి పని చేయదు అని అభి సామ్రాట్ తో అంటాడు.. మీ భార్య చనిపోయిందా లేదంటే మీరే వదిలేసారా లేదంటే చంపేశారా అని సామ్రాట్ ను అభి నీ నిలదీస్తాడు.. కచ్చితంగా చంపేశారు అని అభి అన్న మాటలను విని సామ్రాట్ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు సామ్రాట్ ని చూస్తూ తులసి కూడా ఏడుస్తుంది..

Advertisement