Viral News: ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. వాటిని చూస్తే నవ్వొస్తుంది.. ఇప్పుడు అదే వింత సంఘటన మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది.. సికింద్రాబాద్ నుంచి గుంటూర్ వైపు వెళ్తున్న రైలు పిడుగురాళ్ల రేల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే బోగీలను వదలి రైలు ఇంజన్ ఒక్కటే వెళ్లిపోయింది.. ఇదంతా చూస్తున్న గార్డ్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు..
సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పిడుగురాళ్ల స్టేషన్ సమీపానికి రాగానే నెంబర్ 65వ గేటు వద్ద బోగీలను వదిలి ఇంజన్ మాత్రమే వెళ్లిపోయింది. ఇది గమనించిన గూడ్స్ రైలు గార్డు.. వెంటనే రైల్వే అధికారులకు, ట్రైన్ డ్రైవర్ ఇన్ఫరమేషన్ ఇచ్చాడు. ఆ పాటికే ట్రెయిన్ ఇంజన్ జానపాడు రైల్వేగేటు దాటి వెళ్లింది. ఈలోపు ట్రైన్ డ్రైవర్ విషయం తెలుసుకుని మళ్ళీ రివర్స్ తిరిగి ఇంజన్ ను తీసుకుని బోగీలు ఆగిన చోటుకు వచ్చాడు. ఆ తరవాత బోగీలను తగిలించుకుని ముందుకు కదిలింది ఆ రైలు. ఇదంతా జరగడానికి కాస్త సమయం పట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ సమయంలో పిడుగురాళ్ల వైపు వచ్చే రైళ్లు ఏమీ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఘటను చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు.